Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

టెస్టింగ్ సమయంలో మళ్ళీ గుర్తించబడిన Tata Punch EV, ఇది దాని లోయర్ వేరియంట్ కావచ్చా?

టాటా పంచ్ EV కోసం rohit ద్వారా డిసెంబర్ 08, 2023 12:08 pm ప్రచురించబడింది

ఈ వేరియంట్‌లో స్టీల్ వీల్స్ అందించారు, అంతే కాక ఇంతకు ముందు టెస్టింగ్ సమయంలో కనిపించిన వేరియంట్‌లో గుర్తించిన పెద్ద ఫ్రీ-ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ ఈ వేరియంట్‌లో లేదు.

  • పంచ్ EV టాటా యొక్క తదుపరి ఎలక్ట్రిక్ కారు.

  • నెక్సాన్ వంటి స్ప్లిట్ హెడ్ లైట్ లతో పాటు టర్న్ ఇండికేటర్లుగా పనిచేసే LED డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్ ఉంటాయి.

  • బ్యాటరీ పునరుత్పత్తి కోసం 2 స్పోక్ స్టీరింగ్ వీల్స్, ప్యాడిల్ షిఫ్టర్లు ఇందులో ఉంటాయి.

  • ఇందులో రెండు రకాల బ్యాటరీ ప్యాక్ ఎంపికలు ఇవ్వవచ్చు మరియు దీని పరిధి 500 కిలోమీటర్లు.

  • 2024 ప్రారంభంలో విడుదల అయ్యే అవకాశం ఉంది, దీని ధర రూ. 12 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది.

టాటా పంచ్ EV విడుదలకు చాలా దగ్గరగా ఉన్నట్లు తెలుస్తోంది, ఎందుకంటే ఈ ఎలక్ట్రిక్ SUV యొక్క అనేక స్పై షాట్లు ఆన్లైన్లో విడుదలయ్యాయి. దీని టెస్ట్ మోడల్ చాలా ఫీచర్లతో కనిపించింది, కానీ ఈసారి తక్కువ ఫీచర్లతో ఉన్న వేరియంట్ గుర్తించబడింది.

అలా ఎందుకు చెబుతున్నాం?

తాజా చిత్రాలను పరిశీలిస్తే, ఇది దాని లోయర్ వేరియంట్ కావచ్చు, ఎందుకంటే ఇందులో అల్లాయ్ వీల్స్ మరియు ఫ్రీ ఫ్లోటింగ్ టచ్స్క్రీన్ కనిపించలేదు, కాని ఈ ఫీచర్లు మునిపతి విడుదలైన వేరియంట్ చిత్రాలలో కనిపించింది.

అంటే, ఇందులో కొత్త నెక్సాన్ వంటి LED DRLలు ఉండవు, ఇది టర్న్ ఇండికేటర్గా కూడా పనిచేస్తుంది మరియు దీనికి స్ప్లిట్ హెడ్లైట్ సెటప్ కూడా ఉంది. గతంలో గుర్తించిన మోడల్ లో రేర్ డిస్క్ బ్రేకులు, కొత్త గ్రిల్ మరియు కొత్త ఎయిర్ డ్యామ్ హౌసింగ్ కూడా ఉన్నాయి.

క్యాబిన్ మరియు ఫీచర్ నవీకరణలు

కొత్త టాటా పంచ్ EVలో టాటా లోగో మరియు ప్యాడిల్ షిఫ్టర్లు ఉన్న 2-స్పోక్ స్టీరింగ్ వీల్ ఏర్పాటును మేము గుర్తించగలిగాము (బ్యాటరీ పునరుత్పత్తి యొక్క స్థాయిని సర్దుబాటు చేయడానికి).

ఇందులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, సెమీ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, 360 డిగ్రీల కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతే కాక కొత్త టాటా ఎలక్ట్రిక్ లో ఆరు ఎయిర్ బ్యాగులు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP) ఉన్నాయి.

ఇది కూడా చదవండి: ఏడాది చివర్లో కారు కొనడం వల్ల కలిగే లాభాలు, నష్టాలు ఏంటో తెలుసుకోండి

ఎలక్ట్రిక్ పవర్ట్రెయిన్ వివరాలు

పంచ్ EV రెండు బ్యాటరీ ప్యాక్ లతో అందించబడే అవకాశం ఉంది. ఇది 500 కిలోమీటర్ల వరకు పరిధిని కలిగి ఉంటుందని టాటా కంపెనీ పేర్కొన్నారు. ఇందులో అందించే ఎలక్ట్రిక్ మోటారు వివరాలు వెల్లడించబడలేదు, కానీ దీని పవర్ అవుట్ పుట్ 75 PS నుండి 100 PS వరకు ఉండవచ్చు.

ఎప్పుడు విడుదల అవుతుంది?

టాటా పంచ్ EV 2024 ప్రారంభంలో రూ .12 లక్షల వరకు ప్రారంభ ధరతో విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇది సిట్రోయెన్ eC3తో పోటీ పడనుంది. ఈ వాహనం టాటా టియాగో EV, MG కామెట్ EV కంటే ప్రీమియం ఎంపిక.

ఇది కూడా చదవండి: 2024 లో భారతదేశానికి రాబోయే కార్లు: వచ్చే సంవత్సరం మీరు రోడ్లపై చూడగలిగే కార్లు

మరింత చదవండి : పంచ్ AMT

Share via
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది ఎలక్ట్రిక్ కార్లు

  • పాపులర్
  • రాబోయేవి
Rs.18.90 - 26.90 లక్షలు*
Rs.48.90 - 54.90 లక్షలు*
Rs.21.90 - 30.50 లక్షలు*
Rs.17.49 - 21.99 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర