Nexon Facelift బుకింగ్ؚలను ప్రారంభించిన Tata
ప్రస్తుతం నెక్సాన్ ఫేస్ؚలిఫ్ట్‌ను టాటా నాలుగు విస్తృత వేరియెంట్ؚలలో అందిస్తుంది: స్మార్ట్, ప్యూర్, క్రియేటివ్ మరియు ఫియర్ؚలెస్
-
టాటా కొత్త నెక్సాన్ؚను సెప్టెంబర్ 14వ తేదీన విడుదల చేయనుంది.
-
టాటా పాన్-ఇండియా డీలర్ؚషిప్ؚల వద్ద మరియు ఆన్ؚలైన్ؚలో దీన్ని బుక్ చేసుకోవచ్చు.
-
ప్రామాణిక మోడల్ؚతో పాటుగా నెక్సాన్ EV ఫేస్ؚలిఫ్ట్ؚను కూడా ఈ కారు తయారీదారు పరిచయం చేయనున్నారు.
-
డిజైన్ మార్పులలో నాజూకైన గ్రిల్, పూర్తి-LED లైటింగ్ మరియు కనెక్టెడ్ టెయిల్ؚలైట్లు ఉన్నాయి.
-
ప్రస్తుతం క్యాబిన్ؚలో డ్యూయల్ 10.25-అంగుళాల డిస్ప్లేలు మరియు AC కంట్రోల్ؚల కోసం టచ్-ఆధారిత ప్యానెల్ ఉన్నాయి.
-
కొత్త ఫీచర్‌లؚలో 360-డిగ్రీల కెమెరా, ఆరు ఎయిర్ బ్యాగ్ؚలు మరియు ముందు పార్కింగ్ సెన్సార్‌లు ఉన్నాయి.
-
ఇంతకు ముందు మోడల్‌ల విధంగానే పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ؚలతో అందిస్తున్నారు; డీజిల్ ఇంజన్ ప్రస్తుతం 7-స్పీడ్ DCTతో వస్తుంది.
-
ప్రారంభ ధర రూ.8 లక్షల (ఎక్స్-షోరూమ్) కంటే కొంత ఎక్కువగా ఉండవచ్చని అంచనా.
టాటా ఇటీవల నెక్సాన్ డిజైన్‌ను పూర్తిగా వెల్లడించింది, సెప్టెంబర్ 14 తేదీన విడుదలకు ముందుగానే నెక్సాన్ ఫేస్ؚలిఫ్ట్ ప్రీ-ఆర్డర్‌లను టాటా అంగీకరిస్తుంది. ఈ కారు తయారీదారు ఆన్ؚలైన్ మరియు పాన్-ఇండియా డీలర్ నెట్ؚవర్క్ రెండిటి ద్వారా బుకింగ్ؚలను అంగీకరిస్తోంది. నవీకరించిన ఈ SUVని నాలుగు విస్తృత వేరియెంట్ؚలలో అందిస్తున్నారు: స్మార్ట్, ప్యూర్, క్రియేటివ్ మరియు ఫియర్ؚలెస్. నవీకరించిన నెక్సాన్ EV ధరలను కూడా టాటా అదే రోజు విడుదల చేయనుంది. కొత్త నెక్సాన్ గురించి ఇప్పటి వరకు తెలిసిన విషయాల శీఘ్ర పునశ్చరణ ఇక్కడ ఇవ్వబడింది.
ఖచ్చితంగా ఆకర్షణీయంగా ఉంటుంది
ప్రధానంగా ముందు మరియు వెనుక భాగాలలో ఫేస్ؚలిఫ్ట్ నెక్సాన్ؚ మార్పులను పొందింది వీటిలో సరికొత్త మరియు నాజూకైన గ్రిల్, సవరించిన LED DRLలు మరియు మార్చిన బంపర్ؚలతో పొడవుగా అమర్చిన ప్రొజెక్టర్ హెడ్ؚలైట్‌లు ఉన్నాయి. వెనుక వైపు మార్పులలో టాటా కనెక్టెడ్ మరియు డ్యాపర్ LED టెయిల్ؚలైట్‌లు మరియు రీ-డిజైన్ చేసిన టెయిల్ؚగేట్ؚలను అందిస్తుంది.
ఇటీవల విడుదలైన కొత్త నెక్సాన్ EV (లేదా నెక్సాన్.ఈవీ అని పిలిచే మోడల్) ప్రామాణిక నెక్సాన్ డిజైన్ؚకు సారూప్యమైనదిగా ఉన్నట్లు విడుదల అయిన కొత్త టీజర్‌లలో చూడవచ్చు. ఇందులో చేసిన భారీ డిజైన్ మార్పు ఏమిటంటే, ముందు భాగం వెడల్పు అంతటా విస్తరించిన LED DRLలు.
మరింత ఖరీదైన ప్రీమియం క్యాబిన్ అనుభవం
కొత్త నెక్సాన్ రీడిజైన్ చేసిన డ్యాష్ؚబోర్డ్, కర్వ్ؚలో ఉన్నటు వంటి ప్రకాశవంతమైన టాటా లోగో కలిగిన కొత్త 2-స్పోక్ؚల ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ؚతో వస్తుంది. ఎంచుకున్న వేరియెంట్ మరియు పెయింట్ ఎంపిక ఆధారంగా భిన్నమైన కలర్ స్కీమ్ؚతో అప్ؚహోల్ؚస్ట్రీని అందిస్తున్నారు. నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ క్లైమేట్ కంట్రోల్ؚల కోసం టచ్-ఆధారిత ప్యానెల్ؚను కూడా టాటా ఉపయోగిస్తుంది, దీనికి బ్యాక్ؚలిట్ సెట్అప్ కూడా ఉంది.
ఫీచర్‌లకు కొదవ లేదు
ఈ మిడ్‌లైఫ్ రీఫ్రెష్‌తో, నెక్సాన్ భద్రత మరియు ఫీచర్‌ల జాబితా మరింతగా పెరిగింది వీటిలో 10.25-అంగుళాల డిస్ప్లేలు (ఒకటి ఇన్స్ట్రుమెంటేషన్, మరొకటి ఇన్ఫోటైన్మెంట్ కోసం), 360-డిగ్రీల కెమెరా, ఆరు ఎయిర్ బ్యాగ్ؚలు (ప్రామాణికంగా) మరియు ముందు పార్కింగ్ సెన్సార్‌లు ఉన్నాయి. నెక్సాన్ؚలో ఉన్న కొత్త ఫీచర్‌లు అన్నిటిని ఇప్పటికే తెలియ చేశాము అలాగే దాని వేరియెంట్-వారీ ఎక్విప్మెంట్ జాబితాను కూడా వివరించాము.
అనేక ఎంపికలను అందిస్తుంది
నిలిపివేస్తున్న మోడల్ؚతో పోలిస్తే వేరియెంట్ లైన్అప్ؚను సరళీకృతం చేసినప్పటికీ, కొనుగోలుదారులు తమకు అత్యంత ఇష్టమైన దాన్ని ఎంచుకోగలిగేలా టాటా ఇంజన్-గేర్ బాక్స్ కాంబినేషన్‌ల శ్రేణిని అందిస్తుంది. ఇవి ఈ క్రింది విధంగా ఉంటాయి:
స్పెసిఫికేషన్ |
1.2-లీటర్ టర్బో-పెట్రోల్ |
1.5-లీటర్ డీజిల్ |
పవర్ |
120PS |
115PS |
టార్క్ |
170Nm |
260Nm |
ట్రాన్స్ؚమిషన్ |
5-స్పీడ్ MT, 6-స్పీడ్ MT, 6-స్పీడ్ AMT, 7-స్పీడ్ DCT |
6-స్పీడ్ MT, 6-స్పీడ్ AMT |
నెక్సాన్ ఇప్పటికి మూడు డ్రైవ్ మోడ్ؚలను కలిగి ఉంది (ఎకో, సిటీ మరియు స్పోర్ట్స్), కానీ ప్రస్తుతం ఇది AMT మరియు డ్యూయల్-క్లచ్ ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚؚమిషన్ ఎంపికల రెండిటిలో ప్యాడిల్ షిఫ్టర్ؚలను అందిస్తుంది. మరొక వైపు, నెక్సాన్ EV ఫేస్ؚలిఫ్ట్ పవర్‌ట్రెయిన్ؚలో మార్పులు ఉండకపోవచ్చు.
అంచనా ధర మరియు పోటీ
టాటా నెక్సాన్ ఫేస్ؚలిఫ్ట్ ధర రూ.8 లక్షల కంటే కొంత ఎక్కువగా (ఎక్స్-షోరూమ్) ఉండవచ్చు. ఈ SUV కియా సోనెట్, మారుతి బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా XUV300 వంటి వాటితో కాకుండా మారుతి ఫ్రాంక్స్ క్రాస్ؚఓవర్ؚతో కూడా పోటీని కొనసాగిస్తుంది.
ఇక్కడ మరింత చదవండి: నెక్సాన్ AMT