Tata Nexon ఎలక్ట్రిక్ కారును డ్రైవ్ చేసిన తర్వాత తెలుసుకున్న ఐదు విషయాలు
టాటా నెక్సాన్ ఈవీ కోసం ansh ద్వారా సెప్టెంబర్ 22, 2023 03:40 pm ప్రచురించబడింది
- 28 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
కొత్త నెక్సాన్ EV పనితీరు మరియు ఫీచర్ల పరంగా చాలా బాగా పనిచేస్తుంది, కానీ ప్రీ-ఫేస్ లిఫ్ట్ నెక్సాన్ EV యొక్క కొన్ని సమస్యలు ఇప్పటికీ ఉన్నాయి
టాటా నెక్సాన్ EV ఫేస్ లిఫ్ట్ ప్రారంభ ధర రూ .14.74 లక్షలు (పరిచయం, ఎక్స్-షోరూమ్). దీని డిజైన్ చాలా ఫ్రెష్ గా ఉంది మరియు కొత్త ఫీచర్లను కూడా ఇందులో అందించారు, ఈ ఎలక్ట్రిక్ కారు ఇప్పుడు మునుపటి కంటే ఎక్కువ పరిధిని ఇస్తుంది. లాంచ్ చేయడానికి ముందు, ఈ ఎలక్ట్రిక్ SUVని నడపడానికి మాకు అవకాశం లభించింది, ఈ కారు గురించి మరింత మరింత తెలుసుకుందాం:
దీనిని ఎలక్ట్రిక్ కారు తరహాలో రూపొందించారు
నెక్సాన్ EV యొక్క మునుపటి వెర్షన్ నెక్సాన్ SUV యొక్క ICE (ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్) వెర్షన్ ఆధారంగా రూపొందించబడింది. ఇది చూడటానికి ఒకేలా ఉంటుంది, EV-నిర్దిష్ట క్లోజ్డ్ బ్లూ ఎలిమెంట్స్ మరియు క్లోజ్డ్-ఆఫ్ గ్రిల్తో సహా కేవలం కొన్ని మార్పులు జరిగాయి. నెక్సాన్ EV ఫేస్ లిఫ్ట్ మోడల్ లో టాటా అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించింది. దీన్ని బట్టి చూస్తే టాటా మొదట నెక్సాన్ EVని సరికొత్త ఎలక్ట్రిక్ కారుగా ప్రత్యేకంగా డిజైన్ చేసి, ఆ తర్వాత అదే డిజైన్ ను ICE వెర్షన్ కు ఇచ్చినట్లు తెలుస్తోంది.
కనెక్టింగ్ LED DRLలు, ఏరోడైనమిక్ అల్లాయ్ వీల్స్, బంపర్పై వర్టికల్ ఎలిమెంట్స్, ఫ్రంట్ లుక్ చాలా నేచురల్గా కనిపించడంతో పాటు సరికొత్త ఎలక్ట్రిక్ కారులా కనిపిస్తోంది. ఈ ఎలిమెంట్స్ నెక్సాన్ EVకి దాని స్వంత గుర్తింపును ఇస్తాయి.
ఇందులో గొప్ప ఫీచర్లను అందించారు
కొత్త లుక్ తో పాటు, 2023 నెక్సాన్ EVలో ప్రస్తుత ICE నెక్సాన్ వెర్షన్ లో లేని చాలా ఫీచర్లు ఉన్నాయి. ఈ కొత్త టాటా ఎలక్ట్రిక్ కారు టాప్ వేరియంట్లో 12.3 అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంది. ఈ బిగ్ స్క్రీన్ గొప్ప ఇన్ఫోటైన్మెంట్ అనుభవాన్ని ఇస్తుంది మరియు టాటా యొక్క ఆర్కేడ్.ev ద్వారా పార్క్ చేసేటప్పుడు మీరు OTT ప్లాట్ఫామ్లను కూడా స్ట్రీమ్ చేయవచ్చు.
ఇది కూడా చదవండి: 2023 టాటా నెక్సాన్ EV ఫేస్లిఫ్ట్ వర్సెస్ మహీంద్రా XUV400 EV వర్సెస్ MG ZS EV: ధర పోలిక
ఈ స్క్రీన్తో పాటు, కొత్త నెక్సాన్ EVలో 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, బ్లైండ్ వ్యూ మానిటర్తో 360-డిగ్రీ కెమెరా, వెహికల్-టు-లోడ్ మరియు వెహికల్-టు-వెహికల్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫీచర్ల వలన నెక్సాన్ EV మిగతా కార్ల కంటే ప్రత్యేకంగా ఉంటుంది.
మొత్తం డ్రైవింగ్ అనుభవం చాలా స్మూత్ గా ఉంటుంది
టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ యొక్క ప్రీ-ఫేస్ లిఫ్ట్ మోడల్ యొక్క పనితీరు బాగుంది, ఇది కొంతమందికి నచ్చింది, కాని మొదటిసారి ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేసిన వినియోగదారులకు ఇది మంచి అనుభవాన్ని అందించలేదు. ఇప్పుడు టాటా కొత్త నెక్సాన్ EVలో కొత్త జనరేషన్ -2 ఎలక్ట్రిక్ మోటారును ఇచ్చింది, ఇది కొత్త నెక్సాన్ EV యొక్క డ్రైవింగ్ అనుభవాన్ని సులభతరం చేసింది అలాగే ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేసే కొత్త వినియోగదారులకు కూడా ఇది మంచి అనుభవాన్ని అందిస్తుంది. ఇది రెండు రకాల ఎలక్ట్రిక్ మోటార్లను కలిగి ఉంది, దీని అవుట్ పుట్ వరుసగా 129PS/215Nm మరియు 144PS/215Nm. దీని పవర్ అవుట్ పుట్ పెరిగింది, కానీ టార్క్ అవుట్ పుట్ కొద్దిగా పడిపోయింది, దీని కారణంగా యాక్సిలరేషన్ సమయంలో ఎక్కువ పంచ్ లభ్యం కావడం లేదు. కానీ ఇది ఈ కారు యొక్క మొత్తం పనితీరుని ప్రభావితం చేయలేదు అలాగే కొత్త నెక్సాన్ EV యొక్క టాప్ స్పీడ్ ఇప్పుడు గంటకు 140 కిలోమీటర్ల నుండి 150 కిలోమీటర్లకు పెరిగింది.
ఇది కూడా చూడండి: టాటా నెక్సాన్ ఫేస్ లిఫ్ట్ ప్యూర్ వేరియంట్ 10 చిత్రాలలో వివరించబడింది
నెక్సాన్ EV యొక్క రైడ్ క్వాలిటీ చాలా బాగుంది. ఇది ICE నెక్సాన్ కంటే కొంచెం దృఢంగా ఉన్నప్పటికీ, ఇది అసౌకర్యంగా ఉండదు. ఇది గతుకులు ఉన్న రోడ్ల పై సులభంగా వెళ్ళగలదు, దీని అధిక వేగ స్థిరత్వం కూడా చాలా బాగుంది.
కొంచెం ఇరుకుగా ఉంటుంది
నెక్సాన్ EVలో క్యాబిన్ స్పేస్ పెద్దగా సమస్య కాదు అలాగే నెక్సాన్ యొక్క ICE వెర్షన్ తో సమానంగా ఉంటుంది. కానీ, నెక్సాన్ లాంగ్ రేంజ్ (గతంలో నెక్సాన్ EV మ్యాక్స్)తో, పెద్ద బ్యాటరీని అమర్చడం వల్ల వెనుక సీట్లు కొద్దిగా పెరిగాయి. దీనిని అదనపు కుషన్ తో జత చేయడం వల్ల వెనుక సీటు ప్రయాణీకులకు కొంచెం ఇరుకుగా ఉంటుంది.
ఎర్గోనామిక్ క్యాబిన్ సమస్యలు ఉన్నాయి
ప్రాక్టికల్ పరంగా, నెక్సాన్ EV బాగుంది, కానీ దాని ఆకృతి కారణంగా, ప్రీ-ఫేస్ లిఫ్ట్ వెర్షన్ స్థలం విషయంలో ఇప్పటికీ కొన్ని సమస్యలు ఉన్నాయి. దాని క్యాబిన్ ముందు భాగంలో కప్ హోల్డర్ లేదు మరియు ఛార్జింగ్ పోర్ట్ లు గేర్ నాబ్ వెనుక ఉంచబడ్డాయి, దానిని చేరుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. దీని వెనుక డోర్ జేబులు కూడా చాలా ఇరుకుగా ఉన్నాయి అలాగే ఫుట్ వెల్ ప్రాంతం కూడా ఇరుకుగా ఉంటుంది.
ఇది కూడా చదవండి: కియా సోనెట్ కంటే టాటా నెక్సాన్ ఫేస్ లిఫ్ట్ మెరుగైనదని నిరూపించే 7 ఫీచర్లు
ఈ లోపాలు ఉన్నప్పటికీ, నెక్సాన్ EV మంచి కారు, రోజువారీ ఉపయోగానికి బాగుంటుంది.
ధర & ప్రత్యర్థులు
కొత్త నెక్సాన్ EV ధర రూ .14.74 లక్షల నుండి రూ .19.94 లక్షల (పరిచయం, ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది మరియు నేరుగా మహీంద్రా XUV400 తో పోటీపడుతుంది. ఇది MG ZS EV మరియు హ్యుందాయ్ కోనా ఎలెక్ట్రిక్ ఎలక్ట్రిక్ కారుకు సరసమైన ప్రత్యామ్నాయంగా చూడవచ్చు.
ఇది కూడా చదవండి: టాటా నెక్సాన్ EV ఆన్ రోడ్ ధర
0 out of 0 found this helpful