ఏ ఎం టి వెర్షన్ తో రంగప్రవేశం చేసిన నెలలోనే 3,000 బుకింగ్స్ స్వాధీనం చేసుకున్న టాటా నానో జెనెక్స్
టాటా నానో కోసం saad ద్వారా జూన్ 23, 2015 10:53 am ప్రచురించబడింది
- 38 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్: టాటా మోటార్స్ తదుపరి తరం నానో నుంచి ఊహిస్తున్నట్లుగా మొదటి నెలలోనే, 3000 యూనిట్లు విక్రయించింది. తాజా గా ఉన్న ఈ చిన్న కారు, మునుపటి సంవత్సరం యొక్క కార్ల పనితీరుతో పోల్చినపుడు ఇది చాలా బాగుంది. టాటా మోటార్స్ ఇటీవల విడుదల చేసిన తాజా తరం మోడల్ నానో జెనెక్స్, దీనిలో వెలుపల, అంతర్గత భాగాలలో మరియు ముఖ్యంగా ఏ ఎం టి పద్దతి ని అదనంగా చేర్చి సమగ్ర మార్పులు చేయడం వలన ఇది అవసరమైన రీతిలో వినియోగదారులకు దొరుకుతుంది. 1,000 యూనిట్లు ఇప్పటికే సంతోషంగా వినియోగదారులకు అందజేసారు, ఇంకా 2,000 యూనిట్లు మరొక బ్యాచ్ లో త్వరలో వినియోగదారులకు పంపించబడతాయి.
ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ యూనిట్ అధ్యక్షుడు మయాంక్ పరీక్ మాట్లాడుతూ "మా మొత్తం బుకింగ్స్ ఆధారంగా, 70 శాతం ఏ ఎం టి వర్షన్ జెనెక్స్ నానోస్ బుకింగ్స్ నమోదు అయ్యాయి. ఏ ఎం టి ఒక సాంకేతికతగా కలిగిన ఈ కారు క్లచ్ ఫ్రీ డ్రైవింగ్ సౌలభ్యం ఇస్తుంది మరియు ఆటోమేటెడ్ గేర్ మార్చటం మరియు స్వతంత్ర్య డ్రైవ్ మోడ్ ను ఇస్తుంది. ఒక సరసమైన ధర వద్ద హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఇంధన వ్యవస్థను మనకు అందిస్తుంది." అని ఆయన వాఖ్యానించారు.
మార్పులు గురించి క్లుప్తంగా చెప్పాలంటే, ఇది ఇప్పుడు స్మైలింగ్ ముందు గ్రిల్ తో వస్తుంది, మరియు స్మోక్డ్ హెడ్ల్యాంప్స్ , పునరుద్ధరించిన బంపర్స్ మరియు ముందు ఫాగ్ ల్యాంప్స్ తో కనిపిస్తుంది. దీనిలో ముఖ్యంగా గమనించవలసిన మార్పు ఏమిటంటే వెనుకవైపున ఓపెనెబుల్ బూట్ హాచ్ ఉంటుంది, మునుపటి వర్షన్లో ఇది మనకు కనపడదు. అలాగే నానో జెనెక్స్ ఉత్తేజకరమైన ఏడు కొత్త రంగుల లో అందుబాటులో ఉంది.
ఈ వాహన లోపలి భాగం, అనేక మార్పులను ఒక్కసారిగా పొందింది. దీనిలో భాగంగా, బహుళ సమాచార ప్రదర్శన, లక్ట్రిక్ పవర్ అసిస్టెడ్ స్టీరింగ్ (ఈపిఏఎస్), ఫ్రంట్ పవర్ విండోస్ మరియు ఆటోమేటిక్ వెర్షన్ లో స్పోర్ట్స్ మోడ్ లో డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్. ఈ వాహనం లో ఇంకా మార్పు చేయబడినవి ఏమిటంటే, ఎయిర్ కండిషనింగ్ మరియు కొత్త సంగీతం వ్యవస్థ తో పాటు ఆక్స్-ఇన్, యుఎస్బి మరియు బ్లూటూత్ ప్లేబ్యాక్ వంటి వాటికి 4 స్పీకర్ల ద్వారా మద్దతిస్తుంది.
ఇంజన్ విషయానికి వస్తే, అదే 0.6 లీటర్ 2 సిలండర్ల ఎంపి ఎఫ్ ఐ ఇంజన్ తో అందుబాటులో ఉంది. ఈ ఇంజన్ అత్యధికంగా 38.19 PS పవర్ ను ఉత్పత్తి చేయగా, అత్యధికంగా 51 Nm గల టార్క్ ను విడుదల చేస్తుంది. మరియు ఈ ఇంజన్ 4 - స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో జత చేయబడి ఉంటుంది. మరియు ఆటోమేటిక్ వెర్షన్ లో అయితే, మగెంట్టి మార్వెల్ నుండి దిగుమతి అయ్యే పరికరాలతో అందుబాటులో ఉంది. అంతేకాకుండా, ఈ ఆటోమేటిక్ వెర్షన్ 21.9 kmpl మైలేజ్ ను అందిస్తుంది.
ఈ వాహనం యొక్క ప్రారంభ ధర 1.99 లక్షల వద్ద ప్రారంభమైయ్యింది. ఈ వాహనం ఇప్పటికే దాని ప్రభావం గురించి మరింత బయలుపరచును. రాబోయే నెలల్లో దాని పోటీధారులైన మారుతి ఆల్టో 800, హ్యుందాయ్ ఈన్ వంటి వాహనాలతో పోటీ పడనుంది. ఇప్పుడు, టాటా నానో జెనెక్స్ ఆటోమేటిక్ వెర్షన్, అమ్మకాల పరంగా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది. రానున్న 6 వారాల్లో ఈ అమ్మకాలు పెరిగే అవకాశాలు ఉన్నాయని ఎదురుచూస్తున్నాం. ఈ నానో జెనెక్స్ ఆటోమేటిక్ వెర్షన్, ఎక్స్ ఎం ఏ మరియు ఎక్స్ టి ఏ వేరియంట్ల తో అందుబాటులో ఉంది. దీని యొక్క ప్రారంభ ధర 2.7 లక్షల నుండి 2.9 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) వద్ద అందుబాటులో ఉంది.