• English
  • Login / Register

లియోనెల్ మెస్సీ ని గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించిన టాటా మోటార్స్

నవంబర్ 03, 2015 03:07 pm raunak ద్వారా సవరించబడింది

  • 21 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: 

జాగ్వార్ మరియు ల్యాండ్ రోవర్ యజమానులు, టాటా మోటార్స్, వారు వారి గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ గా నాలుగు సార్లు ఫిఫా వరల్డ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అయిన లియోనెల్ మెస్సీని ప్రకటించింది. స్వదేశ వాహనతయారీ సంస్థ ప్రకారం, దాని ప్రయాణీకుల వాహన విభాగం మొదటిసారి బ్రాండ్ అంబాసిడర్ తో బ్రాండ్ సంఘం ప్రచారం చేయనున్నాయి మరియు లియోనెల్ మెస్సీ యొక్క ఎండార్స్మెంట్ దీర్ఘకాల భాగస్వామ్యంగా ఉంటుంది. 

 నాలుగు సార్లు ఫిఫా వరల్డ్ ప్లేయర్ గా ఉన్న లియోనెల్ మెస్సీ, మాట్లాడుతూ " నమస్తే భారతదేశం. నేను ఒక భారతీయ బ్రాండ్ తో నా మొదటి సంబందం పంచుకుంటున్నందుకు సంతోషిస్తున్నాను మరియు టాటా మోటార్స్ కుటుంబంలో ఒక భాగంగా ఉన్నందుకు చాలా ఉత్తేజపడుతున్నాను. నేను ఎప్పుడూ భారతదేశం పట్ల ఆశక్తితో ఉంటాను మరియు ఈ విభిన్న దేశం గురించి చాలా గొప్ప విషయాలు విన్నాను. నేను అర్జెంటీనా నేషనల్ టీం తో భారతదేశం లో ఒకప్పుడు ఉన్నాను మరియు ఇప్పుడు మళ్ళీ భారతదేశాన్ని సందర్శిస్తానని ఆశిస్తున్నాను. టాటా మోటార్స్ భారతదేశం యొక్క నిజమైన ప్రాతినిథ్యం మరియు ప్రపంచవ్యాప్తంగా బాగా స్థిరపడిన బ్రాండ్. నిన్ను నువ్వు నమ్ముకోవడం ముఖ్యం మరియు విజయం సాధించే వరకూ ప్రయత్నిస్తూ ఉండు, అదే మన సంస్థ యొక్క ట్యాగ్ లైన్ కూడా. మనం ఐకమత్యంగా ఉండి మరింత మందికి ప్రేరణగా నిలుస్తామని ఆశిస్తున్నాను." అని తెలిపారు. 

ఈ అసోసియేషన్ ని ప్రకటించిన ప్యాసింజర్ వాహన బిజినెస్ యూనిట్ అధ్యక్షుడు, మయాంక్ పారిక్ మాట్లాడుతూ " మేము బోర్డు పైన లియోనెల్ మెస్సీని కలిగి ఉన్నందుకు సంతోషిస్తున్నాము. అతను విశ్వాసంతో మంచి ప్రతిభను కలిగి ఉన్నాడు మరియు ఆయన నేటి యువతకు ఐకాన్. ఆయన ఫుట్‌బాల్ ఆడడం చూస్తుంటే ఒక మ్యాజిక్ లాగా అనిపిస్తుంది. ఆట మైదానంలో తను చూపించే నిబద్ధత విస్మయం స్పూర్తిని ఇస్తుంది. అతను నమ్మదగిన, మార్గదర్శక, సాధారణ మరియు స్వీయ విశ్వాసంతో ముందుకు వెళుతున్న ఆటగాడు. మేము ప్రపంచవ్యాప్తంగా మా పాదముద్ర విస్తరించేందుకు చూస్తున్నాము. మెస్సీ యొక్క సామర్ధ్యం మరియు ఆదర్శ వ్యక్తిత్వం మా బ్రాండ్ ని మరింత ముందుకి నడిపిస్తుంది. " అని తెలిపారు. 

కంపెనీ రాబోయే ఉత్పత్తులు గురించి మాట్లాడుకుంటే, టాటా మోటార్స్ హ్యాచ్ మరియు కాంపాక్ట్ సెడాన్ రెండిటిని రాబోయే నెలల్లో ప్రారంభించనున్నది. సంస్థ హెక్సా క్రాసోవర్ ని కూడా 2015 జెనీవా మోటార్ షోలో నెక్సాన్ కాంపాక్ట్ ఎస్యువి తో పాటు వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రారంభిస్తుందని భావిస్తున్నారు. మెస్సీ ఈ ఉత్పత్తుల మార్కెటింగ్ లో పాల్గొంటాడు మరియు ఫుట్‌బాల్ అభిమానులు భారతదేశం లో మరియు ప్రపంచవ్యాప్తంగా బ్రాండ్ ని బలోపేతనం చేస్తారు. 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience