• English
  • Login / Register

రియాద్ లో కొత్త షోరూమ్ తో పాటు సేవ సౌకర్యాలను ప్రారభించబోతున్న టాటా మోటార్స్

జూన్ 06, 2015 09:49 am raunak ద్వారా ప్రచురించబడింది

  • 17 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: టాటా మోటార్స్ యొక్క ఒక కొత్త ప్రధాన షోరూమ్ ను మరియు సేవ సౌకర్యాలను రియాద్, సౌదీ అరేబియాలో ప్రారంభించారు. మనహిల్ ఇంటర్నేష్నల్ కంపెనీ, మొహమ్మద్ యూసఫ్ నాగి & బ్రదర్స్ గ్రూప్ (ఎం వై ఎన్ గి) మరియు టాటా మోటార్స్ లిమిటెడ్ ఏకైక అధికార డిస్ట్రిబ్యూటర్ యూనిట్, వీరందరిచే ఈ షోరూమ్ సౌదీ అరేబియా లో ప్రారంభించబడింది. అంతేకాక, టాటా యొక్క ఈ విభాగం అధికారికంగా జిసిసి (గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్) లో అతిపెద్ద కేంద్రాల్లో ఒకటిగా ఉంటుందని అని పేర్కొన్నారు.   

ఈ సందర్భంగా, అంతర్జాతీయ వ్యాపార హెడ్, వాణిజ్య వాహనాలు బిజినెస్ యూనిట్ అయిన మిస్టర్ ఆర్ టి వాసన్ ఈ విధంగా మాట్లాడారు, సౌదీ అరేబియా లో ఉన్న ఈ టాటా మోటార్స్ యొక్క దృష్టి వ్యూహాత్మక విస్తరణ ప్రణాళికలలో ప్రధాన అంశాలలో ఒకటి అని పేర్కొన్నారు.మా వినియోగదారుల కోసం నాణ్యత సేల్స్ ను అందిచడమే కాదు అమ్మకపు అనుభవం తర్వాత సేవలను కూడా అందిస్తాము అని చెప్పసాగారు.వినియోగదారులకు సేవలను అందించడం కొరకు అత్యంత నైపుణ్యం కలిగిన  ఒక బృందాన్ని ఏర్పాటు చేసి వారి అంచనాలకు తగినట్టుగా సమర్థవంతమైన సేవలను అందించడానికి టాటా మోటార్స్ సిద్దంగా ఉంది అన్నారు.  

సౌకర్యాల గురించి మాట్లాడుతూ, ఇది మనకు ఇండస్ట్రియల్ ఏరియా (ఎగ్జిట్-18, ఈస్ట్రన్ ఎక్స్ ప్రెస్ వే) లో ఉండటం వలన, దానిలో టాటా మోటార్స్ నుండి ఉత్పత్తి అయిన అన్ని రకాల వాహనాలు పూర్తి శ్రేణిలో లభిస్తాయి అని చెప్పారు.అంతేకాకుండా,సేవా కార్య క్రమాలు పూర్తిగా ఆధునిక పరికరాల తో కూడిన మరియు నైపుణ్యం కలిగిన వారి సమక్షంలో సేవలు వినియోగించుకోవచ్చు.అంతేకాక,వినియోగదారుల కోసం మొబైల్ సేవ లేదా ఆన్ సైట్ సేవలు కూడా గరిష్ట్ట పరిమితిలో అందించనున్నారు అని ఆయన ప్రసంగించారు.    

ఈ సందర్భంగా మనహిల్ అంతర్జాతీయ కంపెనీ, ఆటోమోటివ్ డివిజన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మిస్టర్ అబ్దుల్ వహాబ్ ఇటాని ప్రసంగిస్తూ " వినియోగదారులకోసం 3ఎస్ సౌకర్యం అనగా సేల్స్, సర్వీస్ మరియు స్పేర్స్ అందరికి అందుబాటులో ఉండేలా నైపుణ్యం కలిగిన వారిచే టాటా మోటార్స్ ఒక బృందాన్ని నియమించింది. నేడు, ఆటోమోటివ్ రంగం చాలా డైనమిక్ మరియు అభ్యున్నతి పట్ల బాధ్యత కలిగి ఉన్నటువంటి రంగం. మనహిల్ అంతర్జాతీయ సంస్థ టాటా మోటార్స్ యొక్క నెట్ వర్క్  కింగ్డమ్ అంతా విస్తరింపజేసి, ప్రతి నగరంలోను వినియోగదారులకు చేరువ అయి మీ వాహన ఆపరేషన్ సామర్థ్యాన్ని తెలుసుకుని, మీ సేవలను అందరికి అందిచేలా ప్రణాళిక ఎర్పాటు చేయడానికి మా సంస్థ యోచిస్తోంది. ఒకవేళ మీరు వినియోగదారుల అంచనాలకు చేరువ కాకపోతే, మీరు పట్టు కోల్పోయి వెంటనే ఈ ట్రాక్ నుండి వెల్లిపోవాలిసి వస్తుంది అని ఆయన వాఖ్యానించారు.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience