• English
  • Login / Register

టాటా మోటర్స్ కొత్త సంకల్పం 'ద చోసెన్ వన్స్ ', ఒక అపురూప అవకాశం అందిస్తోంది

జూన్ 04, 2015 02:24 pm sourabh ద్వారా ప్రచురించబడింది

  • 15 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: నానో జెనెక్స్ విడుదల తరువాత, టాటా మోటర్స్ ఈరోజు వారి కొత్త సంకల్పం  'ద చోసెన్ వన్స్ '  ని పరిచయం చేసారు.  దీని ద్వారా, ఈ ఉత్పత్తిదారులు   జెనెక్స్  నానో కస్టమర్లు ఎంచుకునేందుకు గాను ఆశక్తికరమైన అవకాశాలను   కల్పిస్తున్నరు. ఇందులో గెలుచుకున్న వారు ఎంతో ఖరీదైన సనంద్ కి వెళ్ళే ప్రయాణం ఖర్చుని  మరియూ వారి స్వంత నానో ని తయారు చేస్తుండగా ప్రత్యక్షంగా చూసే అవకాశం కల్పించడం జరుగుతుంది. ఇటువంటి  ఒక ప్రయత్నం  దేశంలోనే  మొట్టమొదటి సారిగా జరుగుతుంది మరియు  వినియోగిదారుల కొరకు కంపెనీ వారు అందించే మరో లాభం. ఈ ప్రచారం ఈరోజు నుండి ప్రారంభం అయ్యి జూను 18,2015 వరకు కొనసాగుతుంది.

ఈ ప్రకటన కార్యక్రమంలో, కారు బుక్ చేసుకున్న మరియూ చేసుకోబోయే కస్టమర్లు అర్హులు. ఇందులో నుండి 20 కస్టమర్లను వెలికి తీస్తారు. ఈ అదృష్ట విజేతలను జూను 24న ప్రకటించి, వారికి   2015 జులై,7న సనంద్ కి వెళ్ళే అవకాశం అందిస్తారు. 'ద చోసెన్ వన్స్ ' లో ఎంచుకోబడిన వారి కార్లకి జన్మదిన సర్టిఫికేటు కూడా ఇవ్వడం జరుగుతుంది.

టాటా మోటర్స్ యొక్క ప్యాసెంజర్ వెహికిల్స్ బిజినెస్ యూనిట్ కి అధ్యక్షుడు అయిన మిస్టర్.మయనక్ పరీక్ ఈ వినూత్న కస్టమర్ అనుభవం గురించి మాట్లాడుతూ, 'టాటా జెస్ట్ మరియూ బోల్ట్ తరువాత గెనెక్స్ నానో హారిజోన్ నెక్స్ట్ అనే మా సంకల్పం లో నుండి విడుదలైన  మూడవ కారు అనీ, ఇకపై వినియోగదారులకు మరింత చేరువగా వెళ్ళేందుకు అన్ని విధాలా ప్రయాత్నం చేస్తూ ఉంటాము అని అన్నారు. ఈ కార్యక్రమం మేము ఇచ్చిన వాగ్ధానాలను నిలబెట్టుకునేందుకు గాను ఎంతగానో తోడ్పడుతుంది అని, కొత్తగా ప్రవేశ పెడుతున్న ఉత్పత్తులూ మరియూ కార్యక్రమాలకు గాను ఇది ఒక వేదికగా నిలుస్తుంది 'అని తెలిపారు. ఈ కొత్త గెనెక్స్ నానో ఎంతో చురుకైనది, సొగసైనది, సమర్ధవంతమైనది మరియూ సిటీ పరిస్థితులకు వాస్తవికంగా ఉపయోగ పడే కారుగా నిలుస్తుంది.  యువకులకి మరియూ  వయసులో  యౌవ్వనులకు గాను మేము ఒక ఆశక్తికరమైన ఉత్పత్తిని తయారు చేసినా మేము మా కస్టమర్లకు మరింత వినూత్న రీతిలో చేరువ కావాలని ప్రయత్నిస్తున్నము. ఇది ఆ మార్గం వైపు వేసిన ఒక అడుగు.

టాటా మోటర్స్ ఇటీవల జెనెక్స్  నానో ని 1.99 లక్షల రూపాయలకు విడుదల చేసింది. ఏఎంటీ లేదా ఈసీ షిఫ్ట్ వేరియంట్ 2.69 లక్షల రూపాయలకు వస్తుంది మరియూ టాప్ ఎండ్ వేరియంట్ ఎక్స్టీఏ 2.89 లక్షలకు వస్తోంది. అన్ని ధరలూ ఎక్స్-షోరూం ఢిల్లీ కి చెందినవి.

was this article helpful ?

Write your వ్యాఖ్య

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience