టాటా HBX EV లాంచ్ అయ్యే అవకాశం ఉంది
టాటా పంచ్ కోసం raunak ద్వారా ఫిబ్రవరి 10, 2020 11:03 am ప్రచురించబడింది
- 34 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఇది టాటా యొక్క EV లైనప్‌లోని ఆల్ట్రోజ్ EV కి దిగువన ఉంటూ నెక్సాన్ EV తో ఫ్లాగ్‌షిప్ మోడల్ గా ఉంటుంది
- HBX యొక్క ALFA-ARC (ఎజైల్ లైట్ ఫ్లెక్సిబుల్ అడ్వాన్స్‌డ్ ఆర్కిటెక్చర్) ICE (పెట్రోల్ & డీజిల్) మరియు EV పవర్‌ట్రెయిన్‌ల కోసం సిద్ధంగా ఉంది.
- ALFA-ARC ఆధారంగా ఉన్న EV లు 300 కిలోమీటర్ల రేంజ్ ని అందించగలవు.
- ఆల్ట్రోజ్ మరియు ఆల్ట్రోజ్ EV తరువాత ALFA-ARC లో నిర్మించిన రెండవ వాహనం HBX కాన్సెప్ట్.
- పెట్రోల్ తో నడిచే HBX 2020 మధ్యలో లాంచ్ అవుతుందని భావిస్తున్నాము.
- HBX EV 2021 నాటికి ప్రారంభించబడుతుందని భావిస్తున్నాము.
టాటా మోటార్స్ ఆటో ఎక్స్‌పో 2020 లో నాలుగు సరికొత్త కార్లతో మరియు EV లు, BS 6 మోడల్స్ మరియు కమర్షియల్ వాహనాల విస్తారమైన లైనప్ తో తళుక్కుమనేలా చేసింది. ‘80 -85 శాతం ’ప్రొడక్షన్-స్పెక్ అయిన HBX మైక్రో-SUV కాన్సెప్ట్ ఎక్స్‌పో లో మంచి మార్కులు కొట్టింది. ఇది 2020 మధ్యలో మార్కెట్ లోనికి వచ్చే అవకాశం ఉంది.
ప్రొడక్షన్-స్పెక్ HBX కన్వెన్షనల్ పవర్‌ట్రెయిన్‌లను కలిగి ఉంటుంది (ఎక్కువగా పెట్రోల్-మాత్రమే మోడల్స్), టాటా ఆల్-ఎలక్ట్రిక్ పవర్‌ట్రైన్ ఎంపికను కూడా ప్రవేశపెట్టాలని చూస్తోంది. కార్‌మేకర్ యొక్క కొత్త ఆల్ఫా-ARC ప్లాట్‌ఫాం కొత్త ఆల్టోజ్ EV వంటి ఆల్-ఎలక్ట్రిక్ మోడళ్లతో సహా బహుళ-పవర్‌ట్రైన్ ఎంపికలను అందిస్తున్నందున ఇది ఆశ్చర్యం కలిగించదు.
దీని గురించి టాటా మోటార్స్, ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ యూనిట్ హెడ్ మార్కెటింగ్ వివేక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, “ HBX అనేది EV మరియు గ్యాసోలిన్ (పెట్రోల్) వెర్షన్‌లను కలిగి ఉంటుంది.” అని తెలిపారు.
కార్‌డెఖోకు నెక్సాన్ EV లాంచ్ అవుతుండగా, టాడా మోటార్స్ నాలుగు EV లలో ఒక సెడాన్, రెండు హ్యాచ్‌బ్యాక్‌లు మరియు ఒక SUV ఉంటుందని దృవీకరించింది. రెండు హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటి (కాంపాక్ట్ మోడల్స్) HBX EV అని మేము నమ్ముతున్నాము. ఇది ఆల్ట్రోజ్ EV క్రింద ఉంటుంది, అలాగే ఇది కొత్తగా ప్రారంభించిన నెక్సాన్ EV క్రింద ఉంచబడుతుంది.
ఆల్ట్రోజ్ EV తన ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ ను కొత్తగా విడుదల చేసిన నెక్సాన్ EV తో పంచుకుంటుంది, ఇది 30.2Kwh బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంది. ఆల్ట్రోజ్ EV 250 నుండి 300 కిలోమీటర్ల మధ్య రేంజ్ ని కలిగి ఉంటుందని టాటా తెలిపింది. ఎలక్ట్రిక్ HBX విషయానికి వస్తే, బ్యాటరీ ప్యాక్ 20 నుండి 25 కిలోవాట్ల మధ్య 250 కిలోమీటర్ల రేంజ్ లో ఉంటుంది. ఇది ఇటీవల ప్రారంభించిన (వాణిజ్య ఉపయోగం కోసం మాత్రమే) మహీంద్రా e-KUV 100 అందించే దానికంటే 100 కిలోమీటర్లు ఎక్కువ.
నెక్సాన్ EV యొక్క ప్రారంభ ధర రూ .14 లక్షలు, చిన్న HBX EV టాటా యొక్క మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఆఫర్ రూ .10 లక్షలలోపు ఉంటుంది. ఇదిలా ఉండగా, ఆల్ట్రోజ్ EV యొక్క ధర సుమారు 12 లక్షల రూపాయల నుండి ప్రారంభమవుతుంది.
0 out of 0 found this helpful