Tata Harrier Facelift ఆటోమ్యాటిక్ & డార్క్ ఎడిషన్ వేరియెంట్‌ల ధరల వివరణ

టాటా హారియర్ కోసం shreyash ద్వారా అక్టోబర్ 20, 2023 01:49 pm ప్రచురించబడింది

  • 253 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

హారియర్ ఆటోమ్యాటిక్ ధరలు రూ.19.99 లక్షల నుండి ప్రారంభమై రూ.26.44 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి

  • ఆటోమ్యాటిక్ మరియు డార్క్ ఎడిషన్లు రెండూ హారియర్ ప్యూర్ బేస్ వేరియెంట్ కంటే ఒక స్థానం ఎగువ నుండి ప్రారంభం అవుతాయి. 

  • ఎంట్రీ-లెవెల్ ఆటోమ్యాటిక్ ఎంపిక మినహా, మిగిలిన ఆటోమ్యాటిక్ మోడల్‌ల ధరలు వాటి సంబంధిత మాన్యువల్ వేరియెంట్ల కంటే రూ.1.4 లక్షలు ఎక్కువగా ఉన్నాయి. 

  • 170PS పవర్ మరియు 350Nm టార్క్‌ను విడుదల చేసే 2-లీటర్ డీజిల్ ఇంజన్‌తో వస్తుంది. 

  • హ్యారియర్ ఫేస్ؚలిఫ్ట్ؚను టాటా రూ.15.49 లక్షలకు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ప్రారంభ ధరతో అందిస్తోంది. 

టాటా హారియర్ ఇటీవల సమగ్రమైన మార్పులను పొందింది మరియు రూ.15.49 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)  ప్రారంభ ధరతో విక్రయించబడుతోంది. ఆటోమ్యాటిక్ వేరియెంట్లు మరియు డార్క్ ఎడిషన్ మోడల్‌ల ధరల జాబితాను మినహహించి, కొత్త హారియర్ ఫీచర్‌లు మరియు స్పెసిఫికేషన్‌ల గురించిన వివరాలను టాటా ఇప్పటికే అందించింది. ప్రస్తుతం, వీటి అన్నిటి వేరియెంట్-వారీ ధరలు మన వద్ద ఉన్నాయి, ఇవి క్రింది పట్టికలో వివరించబడ్డాయి. 

హారియర్ ఆటోమ్యాటిక్ వేరియెంట్‌ల ధరలు 

వేరియెంట్లు

ధర

ప్యూర్+ AT

రూ. 19.99లక్షలు

ప్యూర్+ S AT

రూ. 21.09లక్షలు

అడ్వెంచర్+ AT

రూ. 23.09లక్షలు

అడ్వెంచర్+ A AT

రూ. 24.09లక్షలు

ఫియర్ؚలెస్ డ్యూయల్-టోన్ AT

రూ. 24.39లక్షలు

ఫియర్ؚలెస్+ డ్యూయల్-టోన్ AT

రూ. 25.89లక్షలు

హారియర్ ఆటోమ్యాటిక్ వేరియెంట్‌లను టాటా రూ.19.99 లక్షల నుండి రూ.25.89 లక్షల (డార్క్ వేరియెంట్లను మినహాయించి) ధరలతో అందిస్తుంది. ఎంట్రీ-లెవెల్ ఎంపికను మినహహించి, 6-స్పీడ్ ఆటోమ్యాటిక్‌లో అందించే సౌకర్యం కోసం రూ.1.4 లక్షలు అధికంగా చెల్లించవలసి ఉంది, ఎంట్రీ-లెవల్ ఎంపికల కోసం ఈ ధర రూ.10,000 తక్కువగా ఉంది.

హారియర్ ఫేస్‌లిఫ్ట్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ మోడల్‌ల ధరల కోసం, మా విడుదల కథనాన్ని ఇక్కడ చూడండి. 

డార్క్ ఎడిషన్‌లు

వేరియెంట్లు

ధర MT

ధర AT

ప్యూర్+ S డార్క్

రూ. 19.99 లక్షలు

రూ. 21.39 లక్షలు

అడ్వెంచర్+ డార్క్

రూ. 22.24 లక్షలు

రూ. 23.64 లక్షలు

ఫియర్ؚలెస్ డార్క్

రూ. 23.54 లక్షలు

రూ. 24.94 లక్షలు

ఫియర్ؚలెస్ డార్క్+

రూ. 25.04 లక్షలు

రూ. 26.44 లక్షలు

ప్యూర్ బేస్ వేరియెంట్ తరువాతి వేరియంట్ నుండి టాటా, హారియర్ డార్క్ ఎడిషన్ؚను అందిస్తోంది, వీటి ధరలు రూ.19.99 లక్షలుగా ఉంది. డార్క్ ఎడిషన్ؚలో, ఈ వేరియెంట్ పనోరమిక్ సన్ؚరూఫ్ؚను పొందుతుంది అని గమనించవచ్చు. అలాగే, టాప్-స్పెక్ డార్క్ ఎడిషన్ మాన్యువల్ వేరియెంట్ ధర రూ. 25.04 లక్షలుగా ఉంది. 

డార్క్ ఆటోమ్యాటిక్ వేరియెంట్ల ధరలు రూ.21.39 లక్షల నుండి ప్రారంభమై రూ.26.44 లక్షల వరకు ఉన్నాయి, మాన్యువల్ కంటే రూ.1.4 లక్షల ధర ఎక్కువగా ఉన్నాయి. డార్క్ ఎడిషన్ؚకు పూర్తి-నలుపు ఎక్స్ؚటీరియర్ ట్రీట్మెంట్ అందించబడింది మరియు వేరియెంట్ పై ఆధారపడి, 19-అంగుళాల అలాయ్ వీల్స్ؚను కూడా అందిస్తున్నారు. 

ఫీచర్‌లు & భద్రత

2023 Tata Harrier Facelift Cabin

2023 టాటా హారియర్ؚలో 12.3-అంగుళాల టచ్ؚస్క్రీన్ సిస్టమ్, 10.25-అంగుళాల ఫుల్లీ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, 10-స్పీకర్ JBL సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్‌లు ఉన్నాయి. బహుళ రంగుల ఆంబియెంట్ లైటింగ్, డ్యూయల్-జోన్ ఆటోమ్యాటిక్ AC, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 6-వే పవర్డ్ డ్రైవర్ సీట్, 4-వే పవర్డ్ కో-డ్రైవర్ సీట్, పనోరమిక్ సన్ؚరూఫ్ (మూడ్ లైటింగ్ؚతో) మరియు జెశ్చర్-ఆధారిత పవర్డ్ టెయిల్ గేట్ కూడా ఉన్నాయి.

భద్రత విషయానికి వస్తే, హారియర్ ఫేస్ؚలిఫ్ట్ؚలో 7 వరకు ఎయిర్ బ్యాగ్ؚలు  (6 ఎయిర్ బ్యాగ్ؚలు ప్రామాణికం), హిల్ అసిస్ట్ؚతో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), 360-డిగ్రీల కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) ఉన్నాయి. అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ؚతో అడ్వాన్సెడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ؚలను (ADAS) కూడా పొందుతుంది (కేవలం ఆటోమ్యాటిక్స్ؚతో). Global NCAP నిర్వహించిన టెస్ట్ؚల ప్రకారం, ఇది భారతదేశంలో తయారైన అత్యంత సురక్షితమైన కార్‌లలో ఒకటి.

డీజిల్ పవర్ؚట్రెయిన్

2023 Tata Harrier Facelift Engine

టాటా హారియర్ ఫేస్‌లిఫ్ట్ 170PS పవర్ మరియు 350Nm టార్క్‌ను విడుదల చేసే 2-లీటర్ డీజిల్ ఇంజన్ నుండి శక్తి పొందుతుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ లేదా 6-స్పీడ్ ఆటోమ్యాటిక్ؚతో జోడించబడింది. ఈ SUVకి కోసం ఇతర పవర్ؚట్రెయిన్ ఎంపికలు అభివృద్ధి చేయబడుతున్నాయి మరియు 2024లో అందుబాటులోకి వస్తాయి, వీటిలో పెట్రోల్ మరియు EV ఉన్నాయి.

ధరలు & పోటీదారులు 

టాటా హారియర్ ఫేస్ؚలిఫ్ట్ ధరలు రూ.15.49 లక్షల నుండి రూ.26.44 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ఉన్నాయి. ఇది MG హెక్టార్, మహీంద్రా XUV700 5-సీటర్ వేరియెంట్లు మరియు హ్యుందాయ్ క్రెటా మరియు కియా సెల్టోస్ హయ్యర్-స్పెక్డ్ వేరియెంట్ లతో పోటీ పడుతుంది. 

అన్నీ ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధరలు

ఇక్కడ మరింత చదవండి: హారియర్ డీజిల్

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన టాటా హారియర్

Read Full News

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience