• English
  • Login / Register

రూ. 15.49 లక్షల ప్రారంభ ధరతో విడుదలైన 2023 Tata Harrier Facelift

టాటా హారియర్ కోసం ansh ద్వారా అక్టోబర్ 17, 2023 03:07 pm ప్రచురించబడింది

  • 423 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

నవీకరించబడిన ఎక్స్టీరియర్, భారీ స్క్రీన్‌లు, మరిన్ని ఫీచర్లు అందించబడ్డాయి, కానీ ఇది ఇప్పటికీ డీజిల్ SUV మాత్రమే

Tata Harrier facelift

  • 2023 హారియర్ ధర రూ. 15.49 లక్షల నుండి రూ. xx లక్షల మధ్య ఉంది (ప్రారంభ ధర, ఎక్స్-షోరూమ్).

  • టాటా దీన్ని 4 వేర్వేరు వేరియంట్‌లలో అందిస్తోంది: అవి వరుసగా స్మార్ట్, ప్యూర్, ఫియర్‌లెస్ మరియు అడ్వెంచర్.

  • 2-లీటర్ డీజిల్ ఇంజన్, మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లతో అలాగే ఉంచబడింది.

  • స్టీరింగ్ మరియు సస్పెన్షన్ పరంగా మెరుగైన డ్రైవింగ్ డైనమిక్స్.

  • పెద్ద టచ్‌స్క్రీన్, మరిన్ని భద్రతా ఫీచర్లు మరియు నవీకరించబడిన క్యాబిన్‌ను పొందుతుంది.

అనేక నెలల పరీక్ష మ్యూల్స్‌ను గుర్తించి, అధికారికంగా ఆవిష్కరించిన కొద్దిసేపటి తర్వాత, 2023 టాటా హ్యారియర్ ఫేస్‌లిఫ్ట్ ఎట్టకేలకు విడుదల అయ్యింది. 2019లో ప్రారంభమైనప్పటి నుండి మిడ్-సైజ్ SUVకి ఇది అత్యంత సమగ్రమైన నవీకరణ. ఇది 4 వేర్వేరు వేరియంట్‌లలో అందించబడుతోంది: స్మార్ట్, ప్యూర్, ఫియర్‌లెస్ మరియు అడ్వెంచర్, మరియు దీని ధర రూ. 15.49 లక్షల నుండి (పరిచయ, ఎక్స్-షోరూమ్) అందించబడుతుంది. హారియర్ ఫేస్‌లిఫ్ట్‌లో అందించబడ్డ అన్నీ కొత్త అంశాలు ఇక్కడ ఉన్నాయి:

ధరలు

2023 టాటా హారియర్ వేరియంట్‌లు

ప్రారంభ ధరలు (ఎక్స్ షోరూమ్)

స్మార్ట్

రూ.15.49 లక్షలు

ప్యూర్

రూ. 16.99 లక్షలు

ప్యూర్ +

రూ.18.69 లక్షలు

అడ్వెంచర్

రూ.20.19 లక్షలు

అడ్వెంచర్

రూ.21.69 లక్షలు

ఫియర్ లెస్

రూ. 22.99 లక్షలు

ఫియర్ లెస్+

రూ.24.49 లక్షలు

ఆటోమేటిక్ వేరియంట్లు

 

ప్యూర్+, అడ్వెంచర్+, ఫియర్లెస్, ఫియర్లెస్+

19.99 లక్షల నుండి

#డార్క్ వేరియంట్స్

 

ప్యూర్+, అడ్వెంచర్+, ఫియర్లెస్, ఫియర్లెస్+

19.99 లక్షల నుండి

టాటా, హారియర్ ఫేస్‌లిఫ్ట్ యొక్క అన్ని విభిన్న వేరియంట్‌ల ప్రారంభ ధరలను మాత్రమే విడుదల చేసింది మరియు పూర్తి ధరల జాబితా త్వరలో వెల్లడి చేయబడుతుందని భావిస్తున్నారు.

నవీకరించబడిన లుక్

టాటా హారియర్ డిజైన్‌ను గుర్తించదగ్గ విధంగానే పూర్తిగా సవరించింది. ఇది ఇప్పుడు కనెక్ట్ చేయబడిన DRL సెటప్, కొత్త సొగసైన గ్రిల్, నిలువుగా పేర్చబడిన LED హెడ్‌లైట్‌లు మరియు ముందు భాగంలో పునఃరూపకల్పన చేయబడిన బంపర్ అలాగే స్కిడ్ ప్లేట్‌తో వస్తుంది.

2023 Tata Harrier Facelift Side

సైడ్ ప్రొఫైల్‌లో ఎక్కువగా మార్పులు లేవు కానీ టాటా కొత్త 18-అంగుళాల అల్లాయ్ వీల్స్ (డార్క్ వేరియంట్‌కు 19-అంగుళాలు) మరియు ముందు డోర్లపై "హారియర్" బ్యాడ్జింగ్‌ను జోడించింది.

ముందువైపు వలె, వెనుక భాగంలో కూడా Z- ఆకారపు LED టెయిల్ లైట్లతో కనెక్ట్ చేయబడిన లైట్ సెటప్ ఉంది. వెనుక ప్రొఫైల్ సైడ్ భాగంలో సొగసైన రిఫ్లెక్టర్ ప్యానెల్‌లు మరియు రీడిజైన్ చేయబడిన బంపర్‌ను కూడా పొందుతుంది. ఈ ఫేస్‌లిఫ్ట్‌తో, మీరు మూడు కొత్త రంగు ఎంపికలను కూడా పొందుతారు: అవి వరుసగా సీవీడ్ గ్రీన్, యాష్ గ్రే మరియు సన్‌లిట్ ఎల్లో.

2023 Tata Harrier Facelift Cabin

టాటా హారియర్ ఫేస్‌లిఫ్ట్ క్యాబిన్ కూడా రీడిజైన్ చేయబడింది. ఇది ఒక లేయర్డ్ డ్యాష్‌బోర్డ్‌ను కలిగి ఉంది, దిగువన వక్ర డిజైన్‌తో ఉంటుంది. డ్యాష్‌బోర్డ్‌లో పెద్ద టచ్‌స్క్రీన్, బ్యాక్‌లిట్ టాటా లోగోతో కొత్త 4-స్పోక్ స్టీరింగ్ వీల్ ఉన్నాయి మరియు సెంటర్ కన్సోల్ టచ్ ఆధారిత AC ప్యానెల్‌ను కలిగి ఉంది. వేరియంట్‌పై ఆధారపడి, మీరు ఎక్ట్సీరియర్‌కు రంగుతో సరిపోలిన క్యాబిన్ ఇన్‌సర్ట్‌లను కూడా పొందుతారు.

ఇప్పటికీ హుడ్ కింద మార్పు లేదు

కొత్త టాటా హారియర్ మునుపటి మాదిరిగానే 2-లీటర్ డీజిల్ ఇంజన్‌తో వస్తుంది. ఈ ఇంజన్ 170PS/350Nm పవర్ మరియు టార్క్ లను అందిస్తుంది మరియు ఇది 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ (పాడిల్ షిఫ్టర్‌లతో) ఎంపికను పొందుతుంది. కొత్త హారియర్, టాటా యొక్క కొత్త 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను కూడా 2024లో పొందనుంది.

మరిన్ని ఫీచర్లు

Tata Harrier facelift touchscreen

టాటా ఫేస్‌లిఫ్టెడ్ హారియర్‌కు అనేక కొత్త ఫీచర్లను జోడించింది, అవి వరుసగా వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేతో కూడిన 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, టచ్-బేస్డ్ AC ప్యానెల్‌తో డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, 10-స్పీకర్ JBL సౌండ్ సిస్టమ్ మరియు పవర్డ్ టెయిల్ గేట్.

అంతేకాకుండా వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ మరియు మెమరీ ఫంక్షన్‌తో కూడిన పవర్డ్ డ్రైవర్ సీటు వంటి ఫీచర్లు మునుపటి వెర్షన్ నుండి అలాగే ఉంచబడ్డాయి. ఇది ఇప్పటికే డ్రైవ్ మోడ్‌లు మరియు టెర్రైన్ మోడ్‌లతో వచ్చింది, కానీ ఇప్పుడు మరింత ప్రీమియం యూజర్ అనుభవం కోసం ఒక డయల్ తో కూడిన డిస్‌ప్లేను పొందుతుంది.

Tata Harrier facelift airbags

టాటా ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) తో పాటు, 7 ఎయిర్‌బ్యాగ్‌లు మరియు అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్‌తో హారియర్ భద్రతను కూడా మెరుగుపరిచింది. మిగిలిన భద్రతా లక్షణాలు EBD తో కూడిన ABS , ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), 360-డిగ్రీ కెమెరా, లేన్ డిపార్చర్ వార్నింగ్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ మరియు ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్‌ వంటి అంశాలు అందించబడ్డాయి.

ఇది కూడా చదవండి: కొత్త టాటా హ్యారియర్ మరియు సఫారి ఫేస్‌లిఫ్ట్‌తో టాటా కారులో ప్రారంభమైన 5 ఫీచర్లు

ప్రత్యర్థులు

2023 Tata Harrier Facelift Rear

నవీకరించబడిన టాటా హారియర్, దాని కొత్త లుక్స్ మరియు అభినందనలతో, మహీంద్రా XUV700MG హెక్టర్ మరియు జీప్ కంపాస్‌లకు వ్యతిరేకంగా కొనసాగుతోంది.

మరింత చదవండి : టాటా హారియర్ డీజిల్

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Tata హారియర్

Read Full News

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience