ఆస్ట్రేలియాలో 3-డో ర్ల జిమ్నీ కొత్త హెరిటేజ్ ఎడిషన్ؚను పరిచయం చేసిన సుజుకి
మారుతి జిమ్ని కోసం rohit ద్వారా మార్చి 09, 2023 12:19 pm ప్రచురించబడింది
- 20 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఈ లిమిటెడ్ ఎడిషన్ SUV, రెడ్ మడ్ ఫ్లాప్ؚలు మరియు ప్రత్యేక మెటల్ స్టిక్కర్‌లؚతో సహా ప్రామాణిక జిమ్నీతో పోలిస్తే లుక్ పరంగా కొన్ని తేడాలను పొందుతుంది.
-
సుజుకి జిమ్నీ హెరిటేజ్ ఎడిషన్ కేవలం 300 యూనిట్‌లకు మాత్రమే పరిమితం చేయబడుతుంది.
-
1970ల నుంచి 1990 వరకు SUV 4X4 వారసత్వాన్ని ఇది వేడుక చేసుకుంటుంది.
-
నాలుగు రంగులలో అందించబడుతుంది: తెలుపు, బ్లూయిష్ బ్లాక్ పర్ల్, జంగిల్ గ్రీన్ మరియు మీడియం గ్రే.
-
దీని ఫీచర్‌లలో ఏడు-అంగుళాల టచ్ స్క్రీన్, ముందు వైపు పవర్ విండోలు ఉన్నాయి; క్రూజ్ కంట్రోల్ మాత్రం ఇందులో ఉండదు.
-
ప్రామాణిక మోడల్ విధంగానే 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ తో(102PS/130Nm), కేవలం ఐదు-స్పీడ్‌ల MTతో వస్తుంది.
-
మారుతి త్వరలోనే భారతదేశంలో ఐదు-డోర్‌ల జిమ్నీని ప్రవేశపెట్టనుంది, దీనిలో ప్రత్యేక ఎడిషన్‌లు కూడా ఉంటాయని ఆశిస్తున్నాము.
సుజుకి, ‘హెరిటేజ్’ పేరుతో మూడు-డోర్‌ల జిమ్నీ కొత్త పరిమిత ఎడిషన్ؚను ఆస్ట్రేలియాలో ప్రవేశపెట్టింది. ఈ ఆఫ్-రోడర్ కొత్త ప్రత్యేక ఎడిషన్ కేవలం 300 యూనిట్‌లు మాత్రమే అందుబాటులో ఉంటాయి అని, 1970 నుండి 1990 వరకు 4X4 వారసత్వాన్ని వేడుక జరుపుకుంటుంది అని ఈ కారు తయారీదారు తెలియచేసారు.
“హెరిటేజ్” ఎడిషన్ ప్రత్యేక వివరాలు
ప్రామాణిక మూడు-డోర్‌ల మోడల్ؚతో పోలిస్తే హెరిటేజ్ ఎడిషన్ؚలో ముఖ్యంగా లుక్ పరంగా కొన్ని తేడాలు ఉన్నాయి. వీటిలో రెడ్ మడ్ ఫ్లాప్‌లు (వెనుకవైపున "సుజుకి" అక్షరాలతో కూడిన డిజైన్), ప్రత్యేక జిమ్నీ హెరిటేజ్ బూట్ మ్యాట్, వెనుక చక్రాల ఆర్చ్‌ల పైన ఉన్న "హెరిటేజ్" మెటల్ స్టిక్కర్‌లు మరియు "హెరిటేజ్" ప్యాక్ ఉన్నాయి.


సుజుకి హెరిటేజ్ ఎడిషన్ؚను నాలుగు ఎక్స్ؚటీరియర్ రంగులలో అందిస్తుంది: తెలుపు, బ్లూయిష్ బ్లాక్ పర్ల్, జంగిల్ గ్రీన్, మరియు మీడియం గ్రే.
జిమ్నీ హెరిటేజ్ ఎడిషన్ ఇంటీరియర్ గురించి ఎటువంటి వివరాలు లేకపోయినా, సుజుకి దీని అలంకరణను మార్చినట్లు కనిపించడం లేదు. లిమిటెడ్ ఎడిషన్ SUV, ప్రామాణిక మోడల్ؚలో ఉన్నట్లుగా స్వరూప ఫ్యాబ్రిక్ సీట్‌లతో వస్తోంది.
సంబంధించినది: మారుతి జిమ్నీలో, ఈ 3-డోర్‌ల జిమ్నీ టిష్యూ బాక్స్ ఆకర్షణీయమైన యాక్సెసరీ
ఇందులో ఏ ఫీచర్ లు ఉన్నాయి?
మునపటి డిజైన్ ప్రేరణతో, లిమిటెడ్-ఎడిషన్ జిమ్నీలో ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. సాధారణ జిమ్నీలో విధంగా ఏడు-అంగుళాల టచ్ స్క్రీన్ సిస్టమ్, టిల్ట్-అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్, LED ప్రొజెక్టర్ హెడ్ؚలైట్‌లు, ముందు పవర్ విండోలు, క్లైమేట్ కంట్రోల్ వంటి పరికరాలు ఇందులో ఉంటాయి. అయితే, క్రూజ్ కంట్రోల్ మాత్రం ఇందులో అందుబాటులో లేదు.
భద్రత కిట్ؚలో రివర్సింగ్ కెమెరా, ఆరు ఎయిర్ బ్యాగ్ؚలు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), ట్రాక్షన్ కంట్రోల్ ఉంటాయి. హై-బీమ్ అసిస్ట్, ఆటో-ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ డిపార్చర్ వార్నింగ్ వంటి కొన్ని డ్రైవర్ అసిస్ట్ సిస్టమ్ؚలను కూడా ఇది పొందింది.
ఇది కూడా చదవండి: మీ మారుతి జిమ్నీని మినీ G-వాగెన్ؚగా మార్చే 5 ప్రధాన కిట్‌లు ఇవే
బోనెట్ؚలో మార్పులు లేవు
జిమ్నీ హెరిటేజ్ ఎడిషన్ؚలో సాధారణ మోడల్‌లలో ఉండే 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ (102PS/130Nm) మరియు 4WDలు కొనసాగుతాయి, కానీ దీన్ని కేవలం ఐదు-స్పీడ్‌ల మాన్యువల్ గేర్ బాక్స్ؚతో అందిస్తున్నారు, అయితే ప్రామాణిక జిమ్నీలో నాలుగు-స్పీడ్‌ల ఆటోమ్యాటిక్ؚను కూడా సుజుకి అందిస్తుంది.
భారతదేశంలో జిమ్నీ
2023 ఆటో ఎక్స్ؚపోలో ప్రదర్శించిన ఐదు-డోర్‌ల జిమ్నీని మారుతి సుజుకి త్వరలో మార్కెట్ؚలోకి ప్రవేశ పెట్టనుంది, దీని ప్రారంభ ధర రూ.10 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండవచ్చు. ఇది ప్రజాదరణ పొందిన వాహనం యొక్క ప్రయోగాత్మక వెర్షన్, దీని పొడవైన వీల్ؚబేస్ వెనుక సీట్‌లకు మరింత లెగ్ రూమ్ؚను ఇస్తుంది. దీన్ని ఐదు-స్పీడ్‌ల మాన్యువల్ లేదా నాలుగు-స్పీడ్‌ల ఆటోమ్యాటిక్ؚతో జోడించి, 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ؚతో మాత్రమే (105PS/134Nm) అందిస్తున్నారు. ఇండియా-స్పెక్ జిమ్నీ కూడా 4WDని ప్రామాణికంగా పొందుతుంది. కారు తయారీదారు ఈ SUVని మార్కెట్ؚ-ఆధారిత లిమిటెడ్ ఎడిషన్ؚలలో కూడా అందిచవచ్చని ఆశిస్తున్నాము.