సుబారు వారు కాన్సెప్ట్ ఇంప్రెజా సెడాన్ తో కవ్విస్తున్నారు
నవంబర్ 16, 2015 12:59 pm అభిజీత్ ద్వారా ప్రచురించబడింది
- 21 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
సుబారు వారు ఇంప్రెజా సెడాన్ యొక్క చిత్రాలను తలుక్కుమనిపించారు. ఇది లాస్ ఏజిలిస్ లో ఒక నెల రోజుల తరువాత ఆవిష్కారం కానుంది. కొన్ని రోజుల క్రితం తయారీదారి 5-డోర్ల హ్యాచ్‌బ్యాక్ కాన్సెప్ట్ ని టోక్యో మోటర్ షోలో ప్రదర్శించారు.
వచ్చే ఏడాది ఆరంగ్రేటం కానున్న తరువాతి తరం ఇంప్రెజా కి ఈ రెండు కార్లు పునాదిగా ఉంటాయి. ఈ కార్లు ఎస్‌జీపీ (సుబారు గ్లోబల్ ప్లాట్‌ఫార్మ్) అనే వేదిక ఆధారంగా నిర్మించబడి తేలిక బరువు కలిగి ఉంటాయి. కంటపడిన చిత్రాలలో కారుకి ఉన్న పై కప్పు దీని స్పోర్టీ అప్పీల్ ని ఇంకో ఎత్తుకి తీసుకు వెల్లింది. ముందు మరియూ వెనుకా టోక్యోలో ప్రదర్శించిన హ్యాచ్‌బ్యాక్ మాదిరిగానే కనపడుతున్నాయి.
కొలతల విషయంలో ఎటువంటి వివరణ లేకపోయినా, 4,440mm పొడవు, 1880mm వెడల్పు మరియూ 1440mm ఎత్తు కలిగి ఉండే అవకాశం ఉంది. వీల్‌బేస్ 2670mm గా ఉండవచ్చును.
సుబారు కాన్సెప్ట్ కారుని నవంబర్ 19న లాస్ ఏజిలెస్ ఆటో షోలో ఆవిష్కరించిన నాడే పూర్తి వివరాలు తెలుస్తాయి. ప్రస్తుతం ఉన్న కారు ర్యాలీ దిగ్గజంగా ఎంతో కాలం నుండి ఉన్నప్పటికీ, సుబారు యొక్క ఏడబ్ల్యూడీ సిస్టం వలన అన్ని విధములైన దారులలో దూసుకుపోయే సామర్ధ్యం ఇప్పుడు పొంది ఉంది.
0 out of 0 found this helpful