• English
  • Login / Register

స్పోర్టీ వైఖరితో నేపాల్ లో ఇటీవల విడుదల అయిన టాటా బోల్ట్

టాటా బోల్ట్ కోసం sameer ద్వారా జూలై 27, 2015 06:19 pm ప్రచురించబడింది

  • 13 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: టాటా మోటార్స్ చివరకు నేపాల్ లో, చాలా కాలంగా ఎదురుచూస్తున్న స్పోర్టి లుక్ కలిగిన బోల్ట్ ను ఇటీవల విడుదల చేసింది. ఈ బోల్ట్ ను పూనే లో ఉన్న పింప్రి- ప్లాంట్ వద్ద తయారు చేశారు. ఈ కారు ను, టాటా హారిజోనెక్స్ట్ ఆధారంగా రూపకల్పన చేశారు మరియు స్పోర్టియర్ లుక్ తో పాటు ఈ విభాగంలో అనేక లక్షణాలతో విడుదల అయ్యింది.

ఈ బోల్ట్ యొక్క రెవోట్రాన్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఎన్ పి ఆర్23.95 లక్షల (ఎక్స్-షోరూమ్ ఖాట్మండు) యొక్క ప్రారంభ ధర వద్ద ప్రారంభించారు మరియు ఈ వాహనం యొక్క డీజిల్ ఇంజన్ ను, 28.35 లక్షల (ఎక్స్-షోరూమ్ ఖాట్మండు) యొక్క ప్రారంభ ధర వద్ద ప్రారంభించారు. ఈ కొత్త బోల్ట్ ను ఒక కొత్త డిజైన్ తో రూపొందించారు. అంతేకాకుండా, డ్రైవరబిలిటీ మరియు కనెక్టివిటీ తో దేశవ్యాప్తంగా 16 కంటే ఎక్కువ  సిప్రడి ఔట్లెట్ల లో అందుబాటులో ఉంది.  

టాటా మోటార్స్, మిస్టర్ సుజన్ రాయ్, రీజనల్ హెడ్ దక్షిణాసియాలోని ప్రయాణీకుల వాహనాలు వ్యాపార యూనిట్ ప్రకారం, టాటా మోటార్స్ వినియోగదారులకు ఉత్తమ సేవలను అందించాలని చాలా రొజులుగా ఎదురుచూస్తున్న బోల్ట్ ను ప్రారంభించడం జరిగింది. ఈ బోల్ట్ ప్రవేశంతో, కంపెనీ యొక్క హాచ్బాక్ మార్కెట్లో తమ ఉనికిని బలోపేతం చేయడానికి అవకాశముంది. ఈ స్పోర్టీ వాహనం, ప్రపంచ డిజైన్ మరియు స్టాండర్డ్స్ ను అందిస్తుంది. అంతేకాకుండా, మొదటిసారి కొనుగోలు చేసే కారు కొనుగోలుదారులకు ఈ వాహనం చాలా ఆకర్షణీయంగా కనపడటం  మాత్రమే కాదు, ఇప్పటికే కారు ను కలిగి ఉన్న వినియోగదారులకు కూడా ఆకర్షణీయంగా కనబడేలా రూపొందించారు.

"బోల్ట్" అనే పదం వేగాన్ని సూచిస్తుంది మరియు ఒక విజేత మరియు ముందుకు ఉంటున్న వైఖరి ని అందిస్తుంది, ఇది స్పష్టంగా దాని అద్భుతమైన బోల్డ్ డిజైన్, పరిపూర్ణ డ్రివరబిలిటీ మరియు స్థిరమైన కనెక్టివిటీ తో ఇటీవల విడుదల అయ్యింది. ఈ కార్యక్రమంలో, టాటా మోటార్స్ కూడా (గతంలో కావాల్సిన) 4 సంవత్సరాలు లేదా 75,000 కి.మీ. విస్తృతమైన వారంటీ ని ప్రకటించింది. అంతేకాకుండా, ఇది ఖచ్చితంగా వినియోగదారులకు విశ్వసనీయత యొక్క అధిక స్థాయి, తక్కువ యాజమాన్య ఖర్చు మరియు ఎక్కువ పునఃవిక్రయం విలువలను ఇస్తుంది. 

ఈ వాహనం యొక్క ప్రదర్శన విషయానికి వస్తే, ఈ స్పోర్టి హాచ్బాక్, నునుపైన, ఫ్లోయింగ్ లైన్స్ ను అందిస్తుంది. ఇది స్పాయిలర్ యొక్క అంచు వద్ద అంతమవుతుంది మరియు కారు ఇప్పటికీ నిలిచి ఉన్నప్పటికీ కదలిక భ్రాంతిని సృష్టిస్తుంది. అయితే, ఏరోడైనమిక్స్ లో రేర్ స్పాయిలర్ ఏ ఐ డి ఎస్ ను కలిగి ఉంటుంది. సి పిల్లార్ ను కలిగి ఉండటం వలన అందమైన రూఫ్ డిజైన్ తో పాటు వెనుక విండోలు చుట్టబెట్టుకున్నట్టుగా కనబడతాయి. ఈ క్లాస్సి హాచ్బాక్ కు అదనపు స్పోర్టి టచ్ ను జోడించడం జరిగింది. ఫ్లేమెడ్ షేప్ ఆకారంలో ఉండే టైల్ ల్యాంప్స్ మరియు టాటా హేచ్ యొక్క రేర్ బంపర్ కూడా కంటి ఆకట్టుకునే పదార్థంతో రూపొందించారు.

ఈ టాటా బోల్ట్ ఐదు ఆకర్షణీయమైన రంగులలో అందుబాటులో ఉంది. అవి వరుసగా, ప్రిస్టిన్ వైట్, స్కై గ్రే, వెనీషియన్ రెడ్, డూన్ బీజ్ మరియు ప్లాటినం సిల్వర్. అంతేకాకుండా ఈ కొత్త బోల్ట్ హాచ్బాక్ ఎక్స్ ఈ, ఎక్స్ ఎం, ఎక్స్ టి అను మూడు పవర్ట్రీన్ లతో అందుబటులో ఉంది. ఈ వాహనాన్ని డ్రివ్ నెక్స్ట్ అను లక్షనంతో పొందుపరిచారు. అందుచేత,  ఈ విభాగంలో ఇది డ్రైవింగ్ డైనమిక్స్ పరంగా ఉత్తమ లక్షణాలను అందిస్తుంది. ఈ వాహనాన్ని పెట్రోల్, డీజిల్ రెండు జరపటంతో అందిస్తున్నారు. ఈ వాహనం యొక్క పెట్రోల్ వేరియంట్, 1.2 లీటర్ టర్బోచార్జ్డ్ మల్టీ పాయింట్ ఫ్యూయెల్ ఇంజెక్షన్ (ఎమ్ పిఎఫ్ఐ) రెవోట్రాన్ మోటార్ తో అమర్చారు. ఈ ఇంజన్, అత్యధికంగా 5000 rpm వద్ద 90 PS పవర్ ను మరియు 1500 rpm నుండి 4000 rpm మద్య లో 140 Nm గల పీక్ టార్క్ ను విడుదల చేస్తుంది. డీజిల్ మోటార్ గురించి మాట్లాడటానికి వస్తే, ఈ ఇంజన్ 1.3 లీటర్ క్వాడ్రా పవర్ట్రెయిన్ తో జత చేయబడి ఉంటుంది. అంతేకాకుండా ఈ ఇంజన్, 4000 rpm వద్ద 75 PS పవర్ ను విడుదల చేస్తుంది మరియు 1750 నుండి 3000 rpm మద్య లో 140 Nm గల పీక్ టార్క్ ను విడుదల చేస్తుంది. పెట్రోల్, డీజిల్ జరపటంతో బి ఎస్-IV ను పోలి ఉంటాయి. మైలేజ్ విషయానికి వస్తే, ఏఆర్ఏఐ సర్టిఫికేషన్ ప్రకారం ఈ 1.2 లీటర్ రెవోట్రాన్ ఇంజన్, 17.57 kmpl మైలేజ్ ను అందిస్తుంది మరియు డీజిల్ ఇంజన్, 22.95 kmpl మైలేజ్ ను అందిస్తుంది.  

ఈ వాహనం ప్రపంచ కన్సల్టెన్సీల సహకారంతో రూపొందించబడింది. ఇది శక్తి, టార్క్ మరియు సామర్థ్యం పరంగా ప్రపంచ స్థాయి సామర్ధ్యాలను కలిగి ఉంది మరియు 3,00,000 పైగా పరిశోధనా పరిక్షలను ఎదుర్కొంది.

was this article helpful ?

Write your Comment on Tata బోల్ట్

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience