త్వరలో ప్రారంభం కాబోయే మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ డీజిల్ ఆటోమేటిక్ , రహస్యంగా పట్టుబడింది
మారుతి డిజైర్ 2017-2020 కోసం konark ద్వారా డిసెంబర్ 24, 2015 12:02 pm ప్రచురించబడింది
- 15 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
భారతదేశం లో అత్యుత్తమంగా విక్రయించబడిన సెడాన్,'మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్' ఇటీవల ఒక ఆటోమేటిక్ గేర్బాక్స్ తో రహస్యంగా పట్టుబడింది. కారుకి ఇరువైపులా DDiS sSబ్యాడ్జేస్ ఉండటం వలన దీనిని చుసిన వెంటనే ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ని కలిగి ఉన్నటువంటి మొట్ట మొదటి డీజిల్ కారు అని గుర్తించవచ్చు.
ఈ కారు మాగ్నట్టీ మార్వెల్ సోర్స్ ఎ ఎం టి ని (ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్) ని కలిగి ఉన్నటువంటి బ్రాండెడ్ ఆటో గేర్ షిఫ్ట్ (AGS) ఆటోబాక్స్ ని కలిగి ఉంటుంది. మారుతి హాచ్బాక్ లు అయినటువంటి ఆల్టో కె 10, సెలెరియో వాహనాలలో ఇది విజయవంతం అయింది. స్విఫ్ట్ డిజైర్ CVT ఆటోమేటిక్ గేర్బాక్స్ ఫీచర్ ని కలిగి ఉండి కేవలం ఒక పెట్రోల్ వేరియంట్ తో వచ్చింది.
మార్కెట్ ఆటోమేటిక్ వాహనాల కోసం చూస్తుంది. దీనిలో భాగంగానే భారత కార్ మేకర్ ఎ ఎం టి ని పరిచయం చేస్తుంది . ఇది భారత మార్కెట్ లో ఒక మంచి మార్పుని తీసుకోస్తుందని చెప్పవచ్చు.
టాప్ లైన్ zdi వేరియంట్ ఈ ఇమేజెస్ లో గుర్తించబడింది. ఇది డ్యూయల్ ఎయిర్బ్యాగ్స్, ఏబిఎస్, బ్లూటూత్ కనెక్టివిటీ , స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ లని గమనించవచ్చు.
ఆటోమాటిక్ వేరియంట్ ని పరీక్షించారు. దీని యొక్క 1.3 లీటర్ Multijet నాలుగు వాల్వ్ DOHC టర్బో డీజిల్ ఇంజిన్ 4000rpm వద్ద 74bhp శక్తిని , మరియు 2,000rpm వద్ద 190Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది . దీని యొక్క ఎ ఎం టి వేరియంట్స్ జనవరి 2016 లో ప్రారంభించే అవకాశం ఉంది. వీటి యొక్క మాన్యువల్ కౌంటర్ పార్ట్స్ ధర 30 నుండి 50 వేల వరకు ఉండవచ్చు.
ఇది కుడా చదవండి .