కంటపడింది: బజాజ్ RE60 క్వాడ్రిసైకల్ - విడుదలకి సిద్దంగా ఉంది

సెప్టెంబర్ 23, 2015 12:50 pm manish ద్వారా ప్రచురించబడింది

  • 13 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

విడుదలకు సీద్దంగా ఉన్న RE60 క్వాడ్రిసైకల్ కంపెనీ వారి పూణేలో ఉన తయారీ సదుపాయం బయట పరీక్షించబదుతూ కంటపడింది. బజాజ్ వారు దీని విడుదలకు సంబంధించి అన్ని అనుమతులు పొందారు. ఈ వాహనం సెప్టెంబరు 25న విడుదలకు సిద్దంగా ఉంది. ఇది భారతదేశం యొక్క మొట్టమొదటి క్వాడ్రిసైకల్ అవుతుంది మరియూ 216cc సింగల్-సిలిండర్ డీటీఎస్ -ఐ పెట్రోల్ ఇంజిను కలిగి ఉంటుంది. ఈ ఇంజినుకి 4-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ జత చేయబడుతుంది. ఈ క్వాడ్రిసైకల్ 20bhp విడుదల ఉంటుంది. ఇది అచ్చం పల్సర్ మరియూ RS మోటర్ సైకిలు లాగా ఉంటుంది. శక్తి మరియూ బరువు యొక్క నిష్పత్తి కారణంగా మైలేజీ లీటరుకి 35 కీ.మీ గ ఉంటుంది.

కొత్త వాహన విభాగంలోకి బజాజ్ వారు ఈ RE60 క్వాడ్రసైకిల్ ని తీసుకురాగలిగారు. ఇది భారతదేశం గవర్నమెంట్ ద్వారా గుర్తించబడింది. దేశ వ్యాప్తంగా ఎన్నో పిల్స్ ని (పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్స్) ని దాటుకుని ఇప్పుడు ఈ వాహనం విడుదలకు సిద్దం అయ్యింది.ఈ పిల్స్ అన్ని ఈ వాహనం యొక్క భద్రత విషయమై పెట్టినవి. అంతే కాదు, ఈ వాహనం ఆటో రిక్షాల ఉనికి కి కూడా ఒక ముప్పు అని భావిస్తున్నారు. ఎందుకంటే వారి లైసెన్సులు నవీకరించుకోవాలి ఎందుకంటే ఇది నాలుగు చక్రాల బండి. ఆటో రిక్షాల కంటే ఈ బండి మెరుగైన రక్షణ ఇస్తుంది అని మా అంచనా. ఈ వాహనం ధర రూ. 2 లక్షలు (ఎక్స్-షోరూం) ఉండవచ్చు. నివేదికల ప్రకారం, ఈ కమర్షియల్ యొక్క ప్రైవేటు వెర్షన్ కూడా బజాజ్ వారి ద్వారా నిర్మింపబడుతోంది మరియూ దీని వివరాలు విడుదల రోజు వివరించవచ్చును.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience