స్కోడా ఫోర్త్- జనరేషన్ ఆక్టేవియాను అనుకోకుండా వెల్లడించింది
స్కోడా ఆక్టవియా కోసం dhruv ద్వారా అక్టోబర్ 31, 2019 11:02 am ప్రచురించబడింది
- 21 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ప్రస్తుత-జెన్ లో ఉండే స్ప్లిట్-హెడ్‌ల్యాంప్ సెటప్ దీనిలో కూడా ఉంటుందని అందరూ ఆశించినప్పటికీ అది కొత్త మోడల్‌లో లేదు
- కొత్త ఆక్టేవియాను 2019 నవంబర్‌లో ఆవిష్కరించనున్నారు.
- కొత్త మోడల్ ఫేస్ లిఫ్ట్ వంటి అద్భుతమైన ఎగ్రసివ్ ఫ్రంట్ ఎండ్ ని పొందుతుంది.
- ఇది VW యొక్క MQB మాడ్యులర్ ప్లాట్‌ఫాం యొక్క తాజా వెర్షన్ పై ఆధారపడి ఉంటుంది.
- క్యాబిన్ మినిమాలిస్టిక్ డిజైన్‌ను కలిగి ఉంటుంది.
- 2020 ద్వితీయార్ధంలో ఇండియాలో ప్రారంభించబడే అవకాశాలు ఉన్నాయి.
కొన్ని రోజుల క్రితం, స్కోడా రాబోయే నాల్గవ-తరం ఆక్టేవియా యొక్క డిజైన్ స్కెచ్‌ను వెల్లడించింది. అయినప్పటికీ, కొత్త నాల్గవ-తరం ఆక్టేవియా ఎలా ఉంటుందో తెలుసుకొనేందుకు ఇప్పుడు మాకు ఫోటో వచ్చింది. ముఖ్యంగా దీనికిగానూ స్కోడా యొక్క వెబ్‌సైట్ లోని లోపానికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి.
టీజర్ సూచించినట్లే, లీకైన చిత్రం స్కోడా స్ప్లిట్-హెడ్‌ల్యాంప్ సెటప్‌ను తొలగించిందని మరియు కొత్త సొగసైన హెడ్‌ల్యాంప్‌లు ప్రస్తుత-జెన్ సూపర్బ్‌లో అందించినట్లుగా కనిపిస్తాయని నిర్ధారిస్తుంది. ముందు భాగం చాలా ఎగ్రసివ్ గా కనిపిస్తుంది మరియు ఫ్రంట్ ఫెండర్ నుండి దాదాపు టెయిల్ లైట్ వరకు ఉన్న షోల్డర్ లైన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది
ఇది కూడా చదవండి: 2020 ఆక్టేవియా కోసం స్కోడా మొదటి టీజర్‌ను వదులుతుంది
VW యొక్క MQB ప్లాట్‌ఫామ్ యొక్క తాజా వెర్షన్ కొత్త స్కోడా ఆక్టేవియాకు మద్దతు ఇస్తుంది. ఇది వచ్చే నెల వెల్లడైన తరువాత, 2020 ప్రారంభంలో ప్రపంచ మార్కెట్లలో విక్రయించబడాలి. ఇది 2020 రెండవ భాగంలో భారత మార్కెట్‌కు చేరుకోవాలి. సైజ్ విషయానికి వస్తే ఆక్టేవియా కొంచెం పెద్దగా అయ్యే అవాకాశాలు ఉన్నా యని మేము ఆశిస్తున్నాము.
ప్రస్తుత-తరం ఆక్టేవియా భారతదేశంలో అమ్మకానికి ఉంది.
మేము లోపలి భాగాన్ని చూడలేకపోతున్నప్పటికీ, ప్యాసింజర్ కంపార్ట్మెంట్ మినిమాలిస్టిక్ డిజైన్ థీమ్‌ను అనుసరిస్తుందని టెస్ట్ మ్యూల్ సూచిస్తుంది.
ప్రస్తుత తరం స్కోడా ఆక్టేవియా ధర రూ .15.99 లక్షల నుంచి రూ. 25.99 లక్షలు వద్ద ఉంది. వచ్చే ఏడాది కొత్త మోడల్ భారతదేశానికి వచ్చినప్పుడు, ప్రస్తుతం ఉన్న మోడల్ కంటే కొంచెం ఎక్కువ ధర కలిగి ఉంటుందని ఆశిస్తున్నాము. దీనికిగానూ కఠినమైన ఎమిషన్ నారంస్ కి కృతజ్ఞతలు తెలుపుకోవాలి.
0 out of 0 found this helpful