స్కోడా ర్యాపిడ్ ఆనివర్సరీ ఎడిషన్ రూ.6.99 లక్షల దగ్గర విడుదల అయ్యింది
published on సెప్టెంబర్ 02, 2015 10:18 am by bala subramaniam కోసం స్కోడా రాపిడ్
- 12 సమీక్షలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
స్కోడా ఆటో ఇండియా వారు కొత్త ర్యాపిడ్ ఆనివర్సరీ ఎడిషన్ ని రూ.6.99 లక్షల ఎక్స్-షోరూం ధర కి విడుదల చేసారు. దీనికి పక్క డోర్ ఫాయిల్స్, గమనించదగిన భేదాలతో కూడిన రూఫ్ రెయిల్స్ మరియూ వుడ్ డెకార్ అంతర్ఘత ట్రింస్ కలిగి ఉన్నాయి. కాకపోతే, ఎలిగన్స్ ప్లస్ మోడల్ కి విప్లవాత్మక ట్రాక్ ప్రో కారు ట్రాకింగ్ డివైజ్ సిస్టం అనే పరికరం అందించబడింది. ఇంకా, ర్యాపిడ్ కి డ్యువల్ ముందు వైపు ఎయిర్-బ్యాగ్స్ ప్రామాణికంగా అన్ని వెర్షన్స్ కి అమర్చబడి ఉండటం తో ఇది మొత్తం సీ సెగ్మెంట్ లో ఇది అత్యంత సురక్షితమైనది. ర్యాపిడ్ ఆనివర్సరీ ఎడిషన్ ఒక పరిమితి కాలం వరకే స్కోడా డీలర్షిప్ లలో 2015 సెప్టెంబర్ చిరవి వరకు లభ్యంగా ఉంటుంది.
ఆనివర్సరీ ఎడిషన్ కి 7-స్పీడ్ డీఎస్జీ ట్రాన్స్మిషన్ తో టిప్ట్రానిక్ మాన్యువల్ గేర్ చేంజింగ్, అడ్జ్స్టబుల్ డ్యువల్ రేర్ ఏసీ వెంట్స్ వెనుక సెంట్రల్ కన్సోల్ పై, స్కోడా 2-డిన్ అనుసంధానం అయిన ఆడియో ప్లేయర్, బ్లూటూత్ కనెక్టివిటీ ఫోన్ కి/ఆడియో స్ట్రీమింగ్/ రిమోట్ కంట్రోల్ వయా ఫోన్ ఆప్, క్రుయిజ్ కంట్రోల్, ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్, హైట్ మరియూ లెంత్ అడ్జుస్టబుల్ స్టీరింగ్ వీల్ ఉన్నాయి.
ఈ కొత్త ప్రారంభం గురించి స్కొడా ఆటో ఇండియా సేల్స్, సర్వీస్ & మార్కెటింగ్ డైరెక్టర్ మిస్టర్ అశుతోష్ దీక్షిత్ మాట్లాడుతూ " స్కోడా రాపిడ్ భారతదేశం లో ప్రవేశపెట్టిన తర్వాత దాని శైలి, ఆచరణీయత మరియు శుద్ధీకరణ వంటి వాటితో వినియోగదారులను ఆకర్షిస్తుంది. ఇప్పుడు స్కోడా యొక్క నిబద్ధతకు, యాజమాన్యం అనుభవం విస్తరిస్తున్నందుకుగానూ మరియు విలువ పెంచుతున్నందుకుగానూ స్కోడా కి ధన్యవాదాలు. వినియోగదారులు కొత్త రాపిడ్ యానివర్శరీ ఎడిషన్ ను ఆర్డర్ చేస్తున్నారు మరియు వారు వారి డబ్బు కంటే విలువైనదానినే పొందుతున్నారు. తెలివైన మరియు ఆచరణాత్మక పరిష్కారాలు అందించడంలో మిన్న అయినటువంటి స్కోడా యొక్క ప్రతిరూపం ఈ వాహనం. సాంకేతిక లక్షణాలు సమ్మేళనంతో, అనేక భద్రతా లక్షణాలను అందిస్తూ మరియు ఆకర్షణీయంగా ఉండే రాపిడ్ యానివర్శరీ ఎడిషన్ పోటీ సి విభాగంలో అద్భుతమైన ఆఫర్" అని పేర్కొన్నారు.
- Renew Skoda Rapid Car Insurance - Save Upto 75%* with Best Insurance Plans - (InsuranceDekho.com)
- Loan Against Car - Get upto ₹25 Lakhs in cash
0 out of 0 found this helpful