Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

స్కోడా ఆక్టేవియా RS245 రూ .36 లక్షల వద్ద ఆటో ఎక్స్‌పో 2020 లో లాంచ్ అయ్యింది

ఫిబ్రవరి 05, 2020 04:28 pm sonny ద్వారా ప్రచురించబడింది
39 Views

ప్రస్తుత-జెన్ ఆక్టేవియా తమ యొక్క అత్యంత శక్తివంతమైన వేరియంట్‌ తో తొలగింపబడుతుంది

  • అత్యంత శక్తివంతమైన ఆక్టేవియా ఇప్పటివరకూ 245Ps / 370Nm పనితీరును అందించింది.
  • ఇది డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, స్పోర్టి ఇంటీరియర్స్ మొదలైనటువంటి లక్షణాలను కలిగి ఉంది.
  • VRS ప్రస్తుత-జెన్ ఆక్టేవియాకు టాటా చెబుతూ కొత్త కారుతో కొన్ని నెలల తరువాత వస్తుందని భావిస్తున్నాము.
  • VRS ను లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్‌గా చేస్తూ భారతదేశంలో 200 యూనిట్లు మాత్రమే అందించనున్నారు.
  • ఇది BMW 3 సిరీస్, ఆడి A4, మెర్క్ C-క్లాస్ వంటి వాటి కంటే సరసమైన సరదా కుటుంబ కారు అని చెప్పవచ్చు.

ప్రస్తుత తరం స్కోడా ఆక్టేవియాకు ఎటువంటి BS 6 అప్‌డేట్స్ ఇంకా రాలేదు మరియు క్రొత్తదానికి కూడా ఇపుడప్పుడే వచ్చే అవకాశం లేదు. కాబట్టి, కార్‌మేకర్ ఒక కొత్త VRS వేరియంట్‌ తో దీనిని అందించాలని అనుకుంటున్నాడు, ఇది ఇంకా అత్యంత శక్తివంతమైనదిగా ఉంటుంది, అది ఎక్స్‌పో 2020 లో ప్రదర్శించబడుతుంది.

ఆక్టేవియా RS 245 అనేది లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్, ఇది కేవలం 200 యూనిట్లు మాత్రమే భారత మార్కెట్‌కు అందుబాటులో ఉంది, ఇప్పుడు ఇది రూ .36 లక్షల ధరతో (ఎక్స్-షోరూమ్,ఢిల్లీ) ప్రారంభించబడింది. ఇది 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ద్వారా 245 Ps పవర్ మరియు 370Nm టార్క్ అవుట్పుట్ కి ట్యూన్ చేయబడింది. మెరుగైన గ్రిప్ కోసం ఫ్రంట్ యాక్సిల్‌ పై ఎలక్ట్రానిక్ లిమిటెడ్-స్లిప్ డిఫరెన్షియల్‌ తో ఉంటుంది, 7-స్పీడ్ DSG ఆటోమేటిక్ ద్వారా ముందు చక్రాలకు పవర్ ని అందిచబడుతుంది.

లక్షణాల పరంగా, ఇది సాధారణ ఆక్టేవియా యొక్క టాప్-స్పెక్ వలె ఉంటుంది, కానీ స్పోర్టియర్ క్యాబిన్‌తో ఉంటుంది. ఇది ఎరుపు హైలైట్స్, స్పోర్ట్ సీట్లు, ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ మరియు ప్రతిచోటా VRS బ్యాడ్జ్‌లతో కూడిన అన్ని బ్లాక్ థీమ్‌ను పొందుతుంది. స్పోర్టి ఆక్టేవియాకు వర్చువల్ కాక్‌పిట్ కోసం 12.3-ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో 8-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, హ్యాండ్స్ ఫ్రీ పార్కింగ్ మరియు డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ లభిస్తాయి.

ఆక్టేవియా VRS245 వెలుపల చూసినట్లయితే మార్పులలో 18-ఇంచ్ అలాయ్స్, VRS బ్యాడ్జీలు, స్పాయిలర్ మరియు డ్యూయల్ ఎగ్జాస్ట్ టిప్స్ ఉన్నాయి. ప్రస్తుత టాప్-స్పెక్ పెట్రోల్ పవర్డ్ L K వేరియంట్ కంటే అదనపు పనితీరు కోసం స్కోడా అదనంగా రూ .124 లక్షలు వసూలు చేస్తోంది. రోజువారీ తిరగడం కోసం ఫన్ కార్ల పనితీరుకోసం చూసే ఒత్సాహికులకు, ఆక్టేవియా VRS ఒక కల ఎంపిక. ఇది BMW 3 సిరీస్, ఆడి A 4 మరియు మెర్సిడెస్ బెంజ్ C-క్లాస్ వంటి వాటి కంటే తక్కువ ఖరీదు లో లభిస్తుంది.

మరింత చదవండి: ఆక్టేవియా ఆన్ రోడ్ ప్రైజ్

Share via

Write your Comment on Skoda ఆక్టవియా 2013-2021

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది సెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
ఎలక్ట్రిక్కొత్త వేరియంట్
Rs.1.70 - 2.69 సి ఆర్*
Rs.6.79 - 7.74 లక్షలు*
కొత్త వేరియంట్
Rs.6.54 - 9.11 లక్షలు*
ఫేస్లిఫ్ట్
కొత్త వేరియంట్
Rs.12.28 - 16.65 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర