• English
  • Login / Register

చైనా లో మూడవ తరం సూపర్బ్ ని ప్రారంభించిన స్కోడా సంస్థ

స్కోడా సూపర్బ్ 2016-2020 కోసం sumit ద్వారా నవంబర్ 02, 2015 02:45 pm ప్రచురించబడింది

  • 13 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: 

షెక్ కార్ల తయారీసంస్థ స్కోడా కొత్త మూడవతరపు 'సూపర్బ్'ని యూరప్ లో ప్రారంభించిన నాలుగు నెలల్లోనే  చైనా లో ప్రారంభించింది. ఎంక్యుబి టెక్నాలజీ అమలు చేయడం ద్వారా, కారు  భద్రతా అలాగే కనెక్టివిటీ లక్షణాలను పెంచడం మీద దృష్టి పెట్టింది . వ్యక్తీకరణ డిజైన్, ఆకట్టుకునే ఇంజనీరింగ్ సామర్ధ్యం మరియు విభాగంలో అత్యుత్తమ స్థానం ఇవి కొత్త సూపర్బ్ యొక్క  ఉత్తమ లక్షణాలు.  

"మా బలమైన వ్యక్తిగత మార్కెట్ చైనా లో కొత్త స్కోడా సూపర్బ్ ప్రారంభించబడడం వలన చైనాలో మా వృద్ధి మరింతగా విస్తరిస్తుంది." అని సేల్స్ అండ్ మార్కెటింగ్ యొక్క  స్కోడా బోర్డు సభ్యుడు వెర్నర్ ఇకార్న్ తెలిపారు. "కొత్త స్కోడా సూపర్బ్ డిజన్ పరంగా బ్రాండ్ ని విస్తరించేందుకు ఉన్న అద్భుతమైన కారు.  చైనాలో ఉన్న వినియోగదారుల హృదయాలను గెలుచుకునేందుకు మరియు రాబోయే రోజుల్లో మా స్థనాన్ని మరింత బలోపేతనం చేయడం దీని ఉద్దేశ్యం. స్కోడా అనేది చైనా కి ఒక క్రొత్త పేరేమి కాదు. సంస్థ ఇప్పటికే నాన్జింగ్, యాంటింగ్  (షాంఘై), ఎజాంగ్  మరియు నింగ్బో అనే  అనేక ఫ్యాక్టరీలను చైనాలో కలిగి ఉంది. ఈ చర్యతో, తయారీదారులు వాహన ప్రపంచంలోని 2 వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ లో, సంవత్సరానికి సగం మిలియన్ యూనిట్లకు పెంచాలని సూచిస్తుంది. స్కోడా సూపర్బ్ దాని మునుపటి మోడల్ తో  2 లక్షల యూనిట్ల విక్రయాలతో ఇప్పటికే చైనీస్ మార్కెట్ లో విజయం సాధించింది. " అని ఆయన  అదనంగా అన్నారు.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your Comment on Skoda సూపర్బ్ 2016-2020

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది సెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience