• English
  • Login / Register

భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో Skoda Kylaq 5-స్టార్ భద్రతా రేటింగ్‌

స్కోడా kylaq కోసం dipan ద్వారా జనవరి 17, 2025 11:03 am ప్రచురించబడింది

  • 21 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

Czech కార్ల తయారీదారు నుండి భారత్ NCAP ద్వారా క్రాష్-టెస్ట్ చేయబడిన మొదటి కారు స్కోడా కైలాక్.

Skoda Kylaq Crash tested Bharat NCAP

  • వయోజన ప్రయాణీకుల రక్షణ విభాగంలో కైలాక్ 32కి 30.88 స్కోర్‌ను సాధించింది, అందుకే దీనికి 5 స్టార్ రేటింగ్ ఇవ్వబడింది. 

  • చైల్డ్ ఆక్సిడెంట్ ప్రొటెక్షన్ విభాగంలో, ఇది 49 కి 45 స్కోర్‌లను సాధించింది, ఇందులో కూడా దీనికి 5 స్టార్ రేటింగ్ ఇవ్వబడింది. 

  • ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు (ప్రామాణికం), 360-డిగ్రీ కెమెరా మరియు ADAS ఉన్నాయి. 

  • దీని ధర రూ. 7.89 లక్షల నుండి రూ. 14.40 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. 

స్కోడా కైలాక్ ఇటీవల భారతదేశంలో విడుదల అయిన అత్యంత సరసమైన కారు, స్కోడా కైలాక్‌ ఇటీవలి పరీక్షల్లో భారత్ NCAP నుండి 5-స్టార్ క్రాష్ సేఫ్టీ రేటింగ్ సాధించింది. వయోజన ప్రయాణీకుల రక్షణ విభాగం  (AOP) లో 32కి 30.88 స్కోర్‌ను సాధించగా, పిల్లల రక్షణ విభాగం (COP) లో 49కి 45 స్కోర్‌ను సాధించింది. ఈ ఫలితాల కారణంగా, ఇది పెద్దలు మరియు పిల్లల రక్షణ వర్గాలలో పూర్తి 5 స్టార్ రేటింగ్‌ను పొందింది.

క్రాష్ టెస్ట్ ఫలితాలను వివరంగా చూద్దాం.

వయోజన ప్రయాణీకుల రక్షణ (AOP)

Skod Kylaq Bharat NCAP crash test

ఫ్రంటల్ ఆఫ్‌సెట్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్: 15.04/16 పాయింట్లు

సైడ్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్: 15.84/16 పాయింట్లు

వయోజన ప్రయాణీకుల కోసం నిర్వహించిన ఫ్రంట్ ఇంపాక్ట్ టెస్ట్‌లో, స్కోడా కైలాక్ డ్రైవర్ ఛాతీ మరియు ఎడమ దిగువ కాలు మినహా డ్రైవర్ శరీరంలోని అన్ని భాగాలకు మంచి రక్షణను అందించింది.

Skod Kylaq Bharat NCAP crash test

సైడ్ మూవబుల్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్‌లో, వయోజన డమ్మీ ఛాతీకి 'తగినంత' రక్షణ కలిగి ఉన్నట్లు కనుగొనబడింది, అయితే తల, ఉదరం మరియు పొత్తికడుపు భాగాల రక్షణ సంతృప్తికరంగా ఉన్నట్లు కనుగొనబడింది. సైడ్ పోల్ ఇంపాక్ట్ టెస్ట్‌లో, శరీరంలోని అన్ని భాగాల రక్షణ బాగుందని తేలింది. 

బాల ప్రయణీకుల రక్షణ (COP)

Skod Kylaq Bharat NCAP crash test

డైనమిక్ స్కోర్: 24/24 పాయింట్లు

చైల్డ్ రెస్ట్రెయింట్ సిస్టమ్ (CRS) ఇన్‌స్టాలేషన్ స్కోర్: 12/12 పాయింట్లు

వెహికల్ అసెస్‌మెంట్ స్కోర్: 9/13 పాయింట్లు

బాల ప్రయణీకుల రక్షణ విభాగంలో, చైల్డ్ రెస్ట్రెయింట్ సిస్టమ్‌ను ఉపయోగించారు మరియు డైనమిక్ పరీక్షలో 24కి 24 స్కోర్‌ను పొందింది. 18 నెలల మరియు 3 సంవత్సరాల పిల్లల డమ్మీని అందులో ఉంచారు మరియు ముందు మరియు సైడ్ ప్రొటెక్షన్‌లో వరుసగా 8కి 8 మరియు 4కి 4 డైనమిక్ స్కోర్ సాధించింది. 

ఇది కూడా చదవండి: మహీంద్రా XEV 7e (XUV700 EV)  డిజైన్ విడుదలకు ముందే లీక్

స్కోడా కైలక్: భద్రతా ఫీచర్లు

స్కోడా కైలాక్ కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు (ప్రామాణికం), రియర్ పార్కింగ్ కెమెరా, మల్టీ-కొలిజన్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) వంటి భద్రతా ఫీచర్లు అందించబడ్డాయి.

స్కోడా కైలాక్: పవర్‌ట్రెయిన్ ఎంపికలు

Skoda Kylaq gear lever

స్కోడా కైలాక్ స్లావియా సెడాన్ మరియు కుషాక్ SUV నుండి 1-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంది, వీటి యొక్క స్పెసిఫికేషన్లు క్రింది విధంగా ఉన్నాయి:

ఇంజను

1-లీటర్ టర్బో-పెట్రోల్

పవర్

115 PS

టార్క్

178 Nm

ట్రాన్స్మిషన్

6-స్పీడ్ MT, 6-స్పీడ్ AT*

*AT = టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్

స్కోడా కైలక్: ధర మరియు ప్రత్యర్థులు

Skoda Kylaq front

స్కోడా కైలాక్ ధర రూ. 7.89 లక్షల నుండి రూ. 14.40 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. ఇది మారుతి బ్రెజ్జా, టాటా నెక్సాన్, కియా సోనెట్  మరియు హ్యుందాయ్ వెన్యూ వంటి ఇతర సబ్-4m SUVలతో పోటీపడుతుంది . 

కైలాక్ యొక్క క్రాష్ టెస్ట్ ఫలితాల గురించి మీరు ఏమనుకుంటున్నారు? కింద కామెంట్స్ ద్వారా తెలియజేయండి.

ఆటోమొబైల్ ప్రపంచం నుండి తక్షణ అప్‌డేట్‌లను పొందడానికి కార్‌దేఖో వాట్సాప్ ఛానెల్‌ని ఫాలో అవ్వండి.

was this article helpful ?

Write your Comment on Skoda kylaq

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience