Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

2024లో 8 కార్లను విడుదల చేయనున్న Skoda, Volkswagen

స్కోడా సూపర్బ్ కోసం ansh ద్వారా డిసెంబర్ 26, 2023 12:09 pm ప్రచురించబడింది

2024 లో స్కోడా, వోక్స్వాగన్ విడుదల చేయనున్న కార్లలో 8 మోడళ్లలో 4 కొత్తవి కాగా, మిగిలినవి ఫేస్ లిఫ్ట్ మరియు మోడల్ ఇయర్ నవీకరణలు.

స్కోడా-వోక్స్వాగన్ గ్రూప్ లో ప్రస్తుతం కాంపాక్ట్ సెడాన్, కాంపాక్ట్ SUV, మిడ్ సైజ్ SUV సెగ్మెంట్ లో మొత్తం 6 కార్లు ఉన్నాయి. ఈ రెండు కార్ల తయారీ సంస్థలు భారత కార్ల మార్కెట్లో విస్తరించాలని కోరుకుంటున్నారు. అందువల్ల, ఈ రెండు కంపెనీలు వచ్చే ఏడాది భారతదేశంలో 8 కొత్త కార్లను విడుదల చేయనున్నారు.

కొత్త-తరం స్కోడా సూపర్బ్

అంచనా ధర: రూ.40 లక్షలు

ఆశించిన విడుదల తేదీ: జూన్ 2024

స్కోడా సూపర్బ్ ఈ సంవత్సరం ప్రారంభంలో భారతదేశంలో నిలిపివేయబడింది, దాని పునరాగమనంపై ఎటువంటి సమాచారం లేదు. అయితే, స్కోడా ఇటీవలే నాల్గవ తరం సూపర్బ్ను అంతర్జాతీయ మార్కెట్లో ఆవిష్కరించారు. ఈ మోడల్ భారతదేశంలో విడుదల అయ్యే అవకాశం ఉంది. కొత్త సూపర్బ్ సెడాన్ యొక్క ఎక్ట్సీరియర్ లో కొన్ని మార్పులు చేశారు, క్యాబిన్ పూర్తిగా కొత్తగా ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో, మైల్డ్-హైబ్రిడ్ మరియు ప్లగ్-ఇన్ హైబ్రిడ్తో ఫ్రంట్-వీల్-డ్రైవ్ మరియు ఆల్-వీల్-డ్రైవ్ ఎంపికలతో సహా అనేక ఇంజన్ ఎంపికలను అందించారు. దీనిని దిగుమతి చేసుకుని భారతదేశంలో విక్రయించవచ్చు, కాబట్టి దీని ధర మునుపటి కంటే ఎక్కువగా ఉండవచ్చు. ఏ పవర్ ట్రైన్ ఇండియాకు వస్తుందో తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

కొత్త-తరం స్కోడా కొడియాక్

అంచనా ధర: రూ.40 లక్షలు

ఆశించిన విడుదల తేదీ: జూన్ 2024

కొత్త తరం సూపర్బ్ తో పాటు, స్కోడా కొత్త తరం కోడియాక్ ఫేస్ లిఫ్ట్ ను కూడా ఆవిష్కరించారు. దీని ఎక్ట్సీరియర్ డిజైన్ లో కొన్ని నవీకరణలు చేయగా, దాని క్యాబిన్ లో ముఖ్యమైన నవీకరణలు చేశారు. SUV లో మైల్డ్ మరియు ప్లగ్-ఇన్ హైబ్రిడ్ సిస్టమ్స్ మరియు ఫ్రంట్ మరియు ఆల్-వీల్ డ్రైవ్ ట్రెయిన్ లతో సహా సెడాన్ మాదిరిగానే పవర్ ట్రైన్ ఎంపికలు లభిస్తాయి. కొత్త స్కోడా కొడియాక్ గురించి మీరు ఇక్కడ క్లిక్ చేసి మరింత తెలుసుకోండి. సూపర్బ్ సెడాన్ మాదిరిగానే, కొత్త కొడియాక్ కూడా భారతదేశంలో దిగుమతి చేసుకొని విక్రయించవచ్చు.

స్కోడా ఎన్యాక్ iV

అంచనా ధర: రూ.60 లక్షలు

ఆశించిన విడుదల తేదీ: సెప్టెంబర్ 2024

స్కోడా 2024 లో ఎన్యాక్ iVతో భారత ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఈ ఎలక్ట్రిక్ వాహనాన్ని భారతదేశ రోడ్లపై చాలాసార్లు పరీక్షించారు, భారతదేశంలో దీనిని దిగుమతి చేసుకుని విక్రయించే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా, ఇది మూడు బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో లభిస్తుంది: 52 కిలోవాట్, 58 కిలోవాట్ మరియు 77 కిలోవాట్లతో పాటు రేర్-వీల్ డ్రైవ్ మరియు ఆల్-వీల్ డ్రైవ్ ఎంపికలతో లభిస్తుంది. దీని పూర్తి ఛార్జ్ పరిధి 510 కిలోమీటర్లు. స్కోడా అన్యాక్ iV ఆధారంగా మొబైల్ కార్యాలయాన్ని కూడా ఆవిష్కరించవచ్చు, ఇక్కడ వివరంగా చదవండి.

స్కోడా స్లావియా కుషాక్ మోడల్ ఇయర్ నవీకరణలు

స్కోడా కుషాక్ మరియు స్లావియా 2021 మరియు 2022 నుండి భారతదేశంలో అమ్ముడవుతున్నాయి. ఈ రెండు మోడళ్లలో కొన్ని నవీకరణలు చేయనున్నారు. రెండు మోడళ్లు తమ ప్రత్యర్థులతో సమానంగా ఉండటానికి సరైన ఫేస్ లిఫ్ట్ లను పొందాలని మేము కోరుకుంటున్నాము, అవి తరువాత వస్తాయి. ఈ రెండు మోడళ్ల క్యాబిన్ లో కొన్ని మార్పులు చేయవచ్చు మరియు కొన్ని కొత్త ఫీచర్లను కూడా చేర్చవచ్చు. అయితే, ఈ నవీకరణ వల్ల వాటి ధర కూడా పెరగవచ్చు.

ఇది కూడా చదవండి: స్కోడా కుషాక్, స్కోడా స్లావియా ఎలిగెన్స్ ఎడిషన్ విడుదల, ధర రూ.18.31 లక్షలు

వోక్స్వాగన్ ID.4 GTX

అంచనా ధర: రూ.45 లక్షలు

ఆశించిన విడుదల తేదీ: 2024 మధ్యలో

వోక్స్వాగన్ ID.4 GTX తో భారతదేశ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో, ఈ ఎలక్ట్రిక్ SUV రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో లభిస్తుంది: 52 కిలోవాట్ మరియు 77 కిలోవాట్. ఈ రెండింటిలో రేర్ వీల్ డ్రైవ్, ఆల్ వీల్ డ్రైవ్ సెటప్ ఉన్నాయి. ID.4 GTX పూర్తి ఛార్జ్ చేస్తే 510 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటుంది. దీన్ని 36 నిమిషాల్లో 5 నుండి 80 శాతం ఛార్జ్ చేయవచ్చు. వోక్స్వాగన్ ID.4 GTX గురించి మీరు తెలుసుకోవలసిన ఐదు విషయాలు ఇక్కడ ఉన్నాయి.

వోక్స్వాగన్ టైగూన్ ఫేస్‌లిఫ్ట్

అంచనా ధర: రూ.11 లక్షలు

ఆశించిన విడుదల తేదీ: 2024 మధ్యలో

కుషాక్ మాదిరిగానే, వోక్స్వాగన్ టైగూన్ కూడా నవీకరించబడుతుంది, ఇది భారతదేశంలో మైల్డ్ ఫేస్ లిఫ్ట్ రూపంలో 2024 లో విడుదల అవ్వనుంది. అంతర్జాతీయ మార్కెట్లో, కొత్త T-క్రాస్ ఈ సంవత్సరం ప్రారంభంలో ఆవిష్కరించబడింది, ఇది భారతదేశంలో విక్రయించే టైగూన్ను పోలి ఉంటుంది. ఇది మునుపటి మాదిరిగానే పవర్ట్రెయిన్ ఎంపికలను కలిగి ఉంది, కానీ దాని డిజైన్, ఫీచర్లు మరియు భద్రత మునుపటి కంటే మెరుగ్గా ఉన్నాయి. T-క్రాస్ తో ఫేస్ లిఫ్ట్ చేసిన టైగూన్ కు ఈ నవీకరణలు ఇవ్వవచ్చు. ఇందులో ఎలాంటి మార్పులు చేయనున్నారో ఇక్కడ తెలుసుకోండి.

వోక్స్వాగన్ విర్టస్ మోడల్ ఇయర్ నవీకరణలు

స్కోడా మాదిరిగానే, వోక్స్వాగన్ కూడా తన కాంపాక్ట్ సెడాన్ విర్టస్ ను 2024 లో నవీకరించే అవకాశం ఉంది. స్లావియా మాదిరిగానే, వోక్స్వాగన్ విర్టస్ కూడా మోడల్ ఇయర్ నవీకరణను పొందుతుంది, ఇందులో కొన్ని కాస్మెటిక్ నవీకరణలు, ప్రత్యేక ఎడిషన్లు, కొత్త ఫీచర్లు మరియు మెరుగైన భద్రతా ఫీచర్లు ఉండవచ్చు. నవీకరణ తర్వాత దీని ధర కూడా పెరిగే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: వోక్స్వాగన్ టైగూన్ విర్టస్ యొక్క డీప్ బ్లాక్ ఎక్ట్సీరియర్ షేడ్ ఇప్పుడు మరింత సరసమైనది

స్కోడా మరియు వోక్స్వాగన్ నుండి ఏ కొత్త మోడళ్ల కోసం మీరు ఎదురుచూస్తున్నారు? కామెంట్స్ లో తెలియజేయండి.

a
ద్వారా ప్రచురించబడినది

ansh

  • 178 సమీక్షలు
  • 0 Comments

Write your Comment పైన స్కోడా సూపర్బ్

Read Full News

explore similar కార్లు

ట్రెండింగ్‌లో ఉందిసెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
ఫేస్లిఫ్ట్
Rs.73.50 - 78.90 లక్షలు*
ఎలక్ట్రిక్
Rs.2.03 - 2.50 సి ఆర్*
ఎలక్ట్రిక్
Rs.41 - 53 లక్షలు*
Rs.11.53 - 19.13 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర