• English
  • Login / Register

టాలిస్మాన్ సెడాన్ ను బహిర్గతం చేసిన రెనాల్ట్

జూలై 07, 2015 04:39 pm raunak ద్వారా సవరించబడింది

  • 13 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

రెనాల్ట్ సంస్థ, దాని డి సిగ్మెంట్ సెడాన్ అయిన టాలిస్మాన్ ను బహిర్గతం చేసింది. ఈ సెలూన్, ఈ ఏడాది చివరలో యూరోప్ లో అమ్మకానికి వెళ్తుంది. ఫ్రెంచ్ తయారీదారుడు మాట్లాడుతూ, టాలిస్మాన్ అంటే చాలా 'ప్రజాకర్షణ కలిగిన పేరు" అంతేకాకుండా రఇది క్షణ మరియు శక్తి రెండు భావాలను చూపిస్తుంది. కంపెనీ ఈ వాహనానుకి ఆ పేరు ను పెట్టడానికి గల కారణం ఏమనగా, ఇది ఉచ్చారణకు సులభం గా మరియు ప్రపంచవ్యాప్తంగా అర్ధం చేసుకొనుటకు సులంభంగా ఉంటుంది అని చెప్పారు. ఈ వాహనం, రాబోయే రోజుల్లో వోక్స్వాగన్ పసత్, స్కోడా సూపర్బ్, ఫోర్డ్ మొండియో మరియు మజ్డా6 వంటి వాహనాలకు పోటీ గా రానుంది. ఇవే కాకుండా రాబోయే వాహనాలైనటువంటి రాబోయే కొత్త వోక్స్వాగన్ పసత్ మరియు స్కోడా సూపర్బ్ వంటి వాహనాలను భారతదేశం లో అమ్ముతారు. కానీ, రెనాల్ట్ టెలిస్మాన్ యొక్క ప్రణాళిక మాత్రం ఇప్పటికి బహిర్గతం చేయలేదు.

ఈ టెలిస్మాన్ 4.85 మీటర్ల పొడవును, 1.87 మీటర్ల వెడల్పు ను 1.46 ఎత్తు, 2.81 మీటర్ల వీల్బేస్ ను కలిగి ఉంది. దీని యొక్క బూట్ వైశాల్యం చాల ఎక్కువ అంటే, 608 లీటర్లు. దీనితో పాటుగా వెనుక సీట్ 60:40 స్ప్లిట్ సౌకర్యాన్ని కలిగి ఉండటం వలన ఈ వైశాల్యాన్ని మరింత పెంచుకోవచ్చు. ఈ కొత్త వాహనం యొక్క డిజైన్, ప్రస్తుత రెనాల్ట్ కవళికలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ వాహనం, సి ఆకృతి కలిగిన డే టైం రన్నింగ్ లైట్లను కలిగి ఉంది. ఈ వాహనాల ముందరి భాగంలో సన్నని హెడ్ల్యాంప్స్ తో పాటు రెనాల్ట్ చిహ్నం తో రాబోతుంది. అంతేకాకుండా, 3డి ఎఫెక్ట్ కలిగిన టైల్ ల్యాంప్స్ తో రాబోతుందని కంపెనీ చెబుతుంది.  

ఈ వాహనం యొక్క ఇంటీరియర్స్ విషయానికి వస్తే, ఇవి ఎస్పేస్ క్రాస్ ఓవర్ ఆధారంగా ఉండబోతుంది. ఈ వాహనాలలో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ తో రాబోతుంది. అంతేకాకుండా, దీనిలో మూడు సమాచార వ్యవస్థలు ఉన్నాయి. అవి వరుసగా, దిగువ శ్రేణి వేరియంట్ల కొరకు 4.2 అంగుళాల సమాచార స్క్రీన్, మిగిలిన రేండు ఏమిటంటే, 7-అంగుళాల లాండ్ స్కేప్ ఫార్మాట్ మరియు వూపింగ్ 8. 7 అంగుళాల స్క్రీన్. ఈ 8.7 అంగుళాల స్క్రీన్ ను పోర్టైట్ ఫార్మెట్ లో పొందుపరుస్తారు.

యాంత్రికంగా చెప్పాలంటే, టాలిస్మాన్ రెండు పెట్రోల్ మరియు మూడు డీజిల్ ఇంజన్ లలో రాబోతుంది. వీటితో పాటు మూడు ట్రాన్స్మిషన్ లు అందుబాటులో ఉండబోతున్నాయి. అవి వరుసగా, 6-స్పీడ్ మాన్యువల్ (డీజిల్ కు మాత్రమే), 6 మరియు 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ఆప్షన్ ట్రాన్స్మిషన్ తో రాబోతుంది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience