• English
  • Login / Register

రెనాల్ట్ సంస్థ 2016 ఆటో ఎక్స్పోలో క్విడ్ యొక్క ఆంట్ మరియు 1-లీటర్ వెర్షన్ ను ప్రదర్శించనున్నది

రెనాల్ట్ క్విడ్ 2015-2019 కోసం raunak ద్వారా డిసెంబర్ 29, 2015 06:17 pm ప్రచురించబడింది

  • 17 Views
  • 6 వ్యాఖ్యలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

800cc వెర్షన్ మారుతి సుజుకి ఆల్టో 800 మరియు హ్యుందాయ్ ఇయాన్ తో పోటీ పడుతుంది, అయితే AMT మరియు 1 లీటర్ వెర్షన్ మారుతి సుజుకి ఆల్టో K10 మరియు K10 AGS తో ఎక్కువగా పోటీ పడవచ్చు!

న్యూ డిల్లీ:

రెనాల్ట్ సంస్థ అందించిన నివేధిక ప్రకారం ప్రముఖ క్విడ్ వాహనం యొక్క క్లచ్ లేని ఆంట్ మరియు 1000cc వెర్షన్లను ఫిబ్రవరి 2016 లో రాబోయే ఎక్స్పో వద్ద ప్రదర్శించనున్నదని తెలిసింది. ఫ్రెంచ్ తయారీసంస్థ క్విడ్ ని సెప్టెంబర్ 24, 2015 న ప్రారంభించింది మరియు దీని బుకింగ్స్ అక్టోబర్ మధ్యలో మొదలయ్యాయి. ఈ వాహనం 90% వరకూ భాతదేశంలో తయారుచేయబడినందున దీని ధర రూపాయలు.2.56 - 3.53 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ). ఈ సంస్థ ఆగష్టు 2015 చుట్టూ నుండి వాహనం కోసం దాదాపు 80,000 బుకింగ్స్ పొందింది. ఇప్పుడు, రాబోయే ఆటోమేటిక్ మరియు మరింత శక్తివంతమైన 1 లీటర్ వెర్షన్లు ఈ సంఖ్యలను మరింత ఎత్తుకి తీసుకెళ్తాయని భావిస్తున్నారు.

800 సిసి మోటారు తో రెనాల్ట్ క్విడ్ 54bhp శక్తిని మరియు 72Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. 1 లీటర్ మోటారు 70hp శక్తిని మరియు 90NM కంటే ఎక్కువ టార్క్ ని అందించవచ్చని ఊహిస్తున్నారు. తేలికైన చాసిస్ ఉండడం వలన క్విడ్ మరింత చురుకైనదిగా ఉంటుంది. 800 సిసి మోటార్ పోలి, 1 లీటర్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో ప్రామాణికంగా వస్తుంది మరియు మంచి ఇంధన సామర్ధ్యం కలిగి ఉంటుందని భావిస్తున్నారు. AMT వెర్షన్ గురించి మాట్లాడుకుంటే, రెనాల్ట్ క్విడ్ యొక్క రెండు ఇంజిన్ ఎంపికలలో కూడా AMT ని అందించే అవకాశాలు ఉన్నాయి. ఈ AMT బాక్స్, సంస్థ కొన్ని నెలల ముందు 2015 జెనీవా మోటార్ షో లో తెలిపిన విధంగా బహుశా పూర్తిగా దేశీయంగా తయారుచేయబడిన Easy-R AMT అయ్యుండవచ్చు. అంతేకాక, ఈ Easy-R AMT ఆటోమెటిక్ కూడా రాబోయే 2016 రెనాల్ట్ డస్టర్ ఫేస్లిఫ్ట్ లో అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు.

ఇంకా చదవండి

రెనాల్ట్ క్విడ్ 1.0 లీటర్ వేరియాంట్ ఏ బి ఎస్ అనే ఫీచర్ తో రావచ్చు

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your Comment on Renault క్విడ్ 2015-2019

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience