రెనాల్ట్ వారు లోటస్ ఫార్ములా వన్ టీం ని కొనుగోలు చేసేందుకు 'లెటర్ ఆఫ్ ఇంటెంట్' పై సంతకం చేశారు
సెప్టెంబర్ 29, 2015 10:03 am cardekho ద్వారా ప్రచురించబడింది
- 21 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్: రెనాల్ట్ ఫార్ములా వన్ టీం 2016 కి సంబంధించి రెనాల్ట్ వారు 'లెటర్ ఆఫ్ ఇంటెంట్' పై సంతకం పెట్టి మొదటి అడుగు ఆ వైపుగా వేశారు. తద్వారా లోటస్ కంపెనీ వారి షేర్లను నియంత్రించవచ్చు. రెనాల్ట్ గ్రూప్ మరియూ గ్రావిటీ మోటర్ స్పోర్ట్స్ , ఒక జెనై క్యాపిటల్ S.a.r.l - మధ్య ఈ ఒప్పందం ఫార్ములా వన్ టీం వైపుగా రెనాల్ట్ వారి అడుగుగుగా భావించవచ్చు.
ప్రపంచ ప్రీమియర్ మోటర్ స్పోర్ట్ చాంపియన్షిప్ కి 38 ఏళ్ళ నిబద్దతను అందించిన రెనాల్ట్ వారికి ఇది ఒక ముఖ్యమైన అడుగు.
సోమవారం రెనాల్ట్ స్పోర్ట్ వారు ఇచ్చిన ఒక అధికారిక ప్రకటనలో," రెనాల్ట్ గ్రూప్ మరియూ గ్రావిటీ మోటర్ స్పోర్ట్స్ , ఒక జెనై క్యాపిటల్ S.a.r.l.., అనుసంధానం అయిన కంపెనీ ఈ లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై సంతకం పెట్టడం సంతోషంగా ఉంది అని, తద్వారా రెనాల్ట్ వారు లోటస్ F1 టీం లిమిటెడ్ యొక్క స్టేక్ ని నియంత్రించగలరు అని," అభిప్రాయపడ్డారు.
" రెనాల్ట్ గ్రూప్ మరియూ గ్రావిటీ వారు వచ్చే వారాలలో కలిసి పనిచేసి ఇరువురికి సమ్మతంగా ఉండే విధంగా ఈ తంతుని జరిపిస్తారు."
లోటస్ సీఈఓ అయిన మ్యాత్యూ కార్టర్ ప్రకారం," లోటస్ వారు పరిపాలన వదులుకుంటే, రెనాల్ట్ వారు టీం ని కొనుగోలు చేశారు అని అర్థం అవుతుంది. అధికారికంగా వచ్చే వారం ధృవీకరణ ఉంటుంది. వచ్చే వారం రెనాల్ట్ వారి తరఫున ప్రెస్ రిలీజ్ ఉండవచ్చు."
రెనాల్ట్ వారి ప్రకటన లోటస్ వారు టాక్సులు బకాయి కోర్టులో ఉన్న సమయంలో జరిగింది.