• English
  • Login / Register

రెనాల్ట్ క్విడ్: ఇప్పటివరకు మనం ఏమిటి తెలుసుకున్నాము!

రెనాల్ట్ క్విడ్ 2015-2019 కోసం raunak ద్వారా ఆగష్టు 28, 2015 06:08 pm ప్రచురించబడింది

  • 13 Views
  • 3 వ్యాఖ్యలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

రెనాల్ట్ ఇదివరకు ఎప్పుడూ విననటువంటి క్విడ్ తో ఎంట్రీ స్థాయి హాచ్బాక్ విభాగంలో ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది.

జైపూర్: మేము విన్నదేమిటంటే కొంతమంది డీలర్స్ భారతదేశం యొక్క మొదటి ఎంట్రీ స్థాయి క్రాస్ఓవర్ హాచ్బాక్ రెనాల్ట్ క్విడ్ యొక్క బుకింగ్స్ ని తీసుకోవడం మొదలు పెట్టారు. కాబట్టి తెలిసుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి! మేము ఇప్పటివరకూ రెనాల్ట్ క్విడ్ గురించి తెలుసుకున్న విషయాలు మీ ముందు ఉంచాము, చూద్దాం అవేమిటో!!

3-4 లక్షల ధర పరిధి వద్ద బేబీ డస్టర్

3-4 లక్షల ధర వద్ద మీరు ఏమిటి పొందగలుగుతారు. కానీ ఈ తక్కువ ధర వద్ద క్రాస్ఓవర్-ఎస్క్ అది కూడా డస్టర్ వంటి వైఖరి ఉన్న వాహనాన్ని ఈ విభాగంలో ఏ ఇతర ఉత్పత్తికి లేనటువంటి విధంగా పొందగలుతున్నాము. ఇది ఉత్తమమైన గ్రౌండ్ క్లియరెన్స్ ని అందిస్తుందని వూహిస్తున్నాము. రెనాల్ట్, లాడ్జీ స్టెప్ వే వలే క్విడ్ యొక్క స్టెప్ వే వెర్షన్ ని కూడా ప్రారంభించేందుకు ఆశక్తికరంగా ఉంది. నిజానికి క్విడ్ ఇటీవలే లాడ్జీ-స్టెప్ వే లో ఉన్నటువంటి క్రోమ్ చేరికలు కలిగినటువంటి గ్రిల్ ని మరియు అల్లాయ్స్ తో పెద్ద వీల్స్(వీల్ కవర్ తో 13-అంగుళాల స్టీల్ రిమ్స్) తో రహస్యంగా బయటపడింది.

అత్యుత్తమమైన ఇంధన సామర్థ్యంతో 800cc ఇంజన్

బహిర్గతం సమయంలో, క్విడ్ 800సిసి స్థానభ్రంశాన్ని అందించే ఎమ్పి ఎఫ్ఐ (మల్టీ-పాయింట్-ఇంధన ఇంజెక్షన్) మోటారు తో అమర్చబడి ఉంది. ఇంక ఈ ఇంజిన్ గురించి ఇప్పటి వరకూ ఎటువంటి సమాచారం లేదు. కానీ రెనాల్ట్ ఇది ప్రముఖ ఇంధన సామర్ధ్యాన్ని కలిగి ఉందని తెలిపింది. అంతేకాక, శక్తి 60bhp సమీపంలో ఉందని ఊహించవచ్చు.

రెనాల్ట్ యొక్క మీడియా నావిగేషన్ టచ్స్క్రీన్ యూనిట్

రెనాల్ట్ ఈ విభాగంలో మొదటిసారిగా దీనిలో టచ్స్క్రీన్ యూనిట్ తో ఉన్న మీడియో నావిగేషన్ సమాచార వ్యవస్థను అందించింది. అంతేకాకుండా డస్టర్ మరియు లాడ్జీ వలే ఇది సాటిలైట్ నావిగేషన్ వ్యవస్థను కూడా కలిగి ఉంది.

డిజిటల్ ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్

రెనాల్ట్ దీనిలో సాధారణ డిజిటల్ ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్ ని కలిగి ఉంటుంది. ఇది ఒక విలక్షణమైన రెనాల్ట్ విషయం. అయితే, అది ఒక ప్రాథమిక డాట్ మ్యాట్రిక్స్ డిస్ప్లే లా కనిపిస్తుంది. కానీ మేము ఈ విభాగంలో ఈ లక్షణాన్ని పొందలేదు. అయితే ఇది స్పీడ్ కొరకు అతిపెద్ద కేంద్ర ప్రదర్శన కలిగి ఉంది మరియు పక్కభాగంలో హెచ్చరిక లైట్స్ తో పాటూ ఇంధన సూచికను కలిగి ఉంది. ఇప్పటివరకూ టాకొమీటర్ గురించి ఎటువంటి సమాచారం లేదు.

ఎ ఎంటి గేర్బాక్స్ ఎంపిక మరియు 1.0ఎల్ ఇంజన్

క్విడ్ పెద్ద సామర్థ్యం గల 1.0 లీటర్ మోటార్ ని కూడా అందించవచ్చని పుకార్లు వచ్చాయి. కానీ రెనాల్ట్ సంస్థ ఈ విషయంపై ఇప్పటివరకూ స్పందించలేదు. అంతేకాక, క్విడ్ ఇటీవలే లాడ్జీ స్టెప్వే లో ఉన్నటువంటి గ్రిల్ తో రహస్యంగా బయటపడింది. బహుశా ఈ వెర్షన్ పెద్ద మోటార్ తో ఉండవచ్చు. ఈ విభాగంలో ఎ ఎంటి (ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్) డిమాండ్ ని చూశాక రెనాల్ట్ రాబోయే క్విడ్ లో ఈ లక్షణాన్ని అందించవచ్చు.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Renault క్విడ్ 2015-2019

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience