రెనాల్ట్ క్విడ్ కి త్వరలో ఏఎంటీ రానుంది
సెప్టెంబర్ 01, 2015 12:25 pm manish ద్వారా సవరించబడింది
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్: ఒక కొత్త పోటీదారు ఆటోమాటిక్ క్లబ్ లో ప్రవేశించనున్నారు. రెనాల్ట్ వారు వారి ఉనికిని చాటుకునేందుకు గాను వచ్చే ఫ్రాంక్ఫర్ట్ మోటర్ షో లో దీని మొట్టమొదటి ఏఎంటీ అమర్చిన వాహనాలను ప్రదర్శించనున్నారు. రెనాల్ట్ వారు ఈ ఆటోమాటిక్ టెక్నాలజీ ని బహుశా 'ఈజీ ఆర్' అని నామకరణం చేయవచ్చు. ఈ టెక్నాలజీ వెలుగులోకి రావడానికి కొంత సమయం పట్టినా కంపెనీ వారి డైకా లో మొదటి సారిగా ఇది చోటు సంపాదించనుంది.
న్యూ లోగన్, లోగన్ ఎంసీవీ, డైకా శాండెరో స్టెప్వే వంటి కార్లు యూరప్ మార్కెట్స్ లో రాబోయే ఈజీ-ఆర్ గేర్ బాక్స్ ని కలిగి ఉంటాయి. రెనాల్ట్ క్విడ్ యొక్క ఒక ఆటోమాటిక్ గేర్బాక్స్ వెర్షన్ కూడా తయారీ లో ఉంది మరియూ భారతదేశం లోని ప్రామాణిక ఎంటీ రెనాల్ట్ క్విడ్ విడుదల తరువాత వెలుగు లోకి వస్తుంది. ఈ కారు లోని సెంట్రల్ కన్సోల్ లో ఒక వినూత్న రోటరీ క్లబ్ గేర్ బాక్స్ కి ఉంటుంది. అంటే, మాన్యువల్ షిఫ్టింగ్ యొక్క ఎంపికని పూర్తిగా తొలగించి వేస్తారని దీని బట్టి తెలుస్తోంది. ఇదే విధమైన అమరిక ఇతర ఏఎంటీ వాహనాలు అయిన మారుతీ మరియూ టాటా లలో చూడవచ్చు.