రెనాల్ట్ క్విడ్ 50,000 కస్టమర్ ఆర్డర్లను పొందారు!
నవంబర్ 02, 2015 02:47 pm nabeel ద్వారా ప్రచురించబడింది
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
కేవలం ఒక నెల లోనే క్విడ్ హ్యాచ్‌బ్యాక్ కై 50,000 ఆర్డర్లను పొంది రికార్డును సృష్టించారు అని రెనాల్ట్ ఇండియా వారు చెబుతున్నారు. రెనాల్ట్ ఇండియా ఆపరేషన్స్ కి దేశం యొక్క సీఈఓ మరియూ మ్యానేజింగ్ డైరెక్టరు అయిన మిస్టర్. సుమిత్ సానే గారు," రెనాల్ట్ పై వారికి ఉన్న నమ్మకానికి మరియూ ఈ అనూహ్య స్పందనకి నేను భారతీయ కస్టమర్లకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. దేశ వ్యాప్తంగా మా కస్టమర్లతో పండగ సంబరాలు జరుపుకోవడానికి డెలివరీలు మొదలయ్యాయి. త్వరగా డెలివరీలు అందించడానికి మేము మా ఉత్పత్తి వేగాన్ని పెంచాము. మొదటి సారి కారు కొనుగోలుదారుల నుండి వస్తున్న స్పందన మినహా, సిటీ ఇంకా పల్లెటూరుల్లోని వినియోగదారుని అవసరాల నివేదికలను సైతం మేము పరీశీలిస్తున్నాము," అని అన్నారు.
రెనాల్ట్ క్విడ్ 24 సెప్టెంబరు 2015 న రూ. 2,56,968 (ఎక్స్-షోరూం ఢిల్లీ) ధరకి విడుదల అయి లీటరుకి 25.17 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. రెనాల్ట్ ఇండియా వారు కూడా 2011 నుండి 14 సేల్స్ మరియూ సర్వీసు సెంటర్ల నుండి ఇప్పుడు 180 సెంటర్లకి చేరారు. ఈ సంఖ్య వచ్చే ఏడాదికి 280 కి చేరనుంది.