రూ. 2.56 లక్షల వద్ద క్విడ్ ని ప్రారంభించిన రెనాల్ట్ సంస్థ

రెనాల్ట్ క్విడ్ 2015-2019 కోసం konark ద్వారా సెప్టెంబర్ 24, 2015 05:38 pm సవరించబడింది

జైపూర్: ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్, ఎంతో ఆశక్తిగా ఎదురుచూస్తున్న రెనాల్ట్ క్విడ్ ని నేడు ప్రారంభించింది. క్విడ్ ఎస్యువి లుక్ ని కలిగియుండి ఆకర్షణీయంగా ఉన్న కారణంగా 2015 లో వినియోగదారులు ఎంతగానో ఎదురుచూస్తున్న కారు ఇది. ఈ కారు రూ 2.56 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ధర వద్ద విడుదలయ్యి 25.17kmpl మైలేజ్ ని అందిస్తుంది.    

 

రెనాల్ట్ క్విడ్ ప్రత్యేఖ అనువర్తనాలు కలిగియున్న భారతదేశం లో మొదటి కారు మరియు ఇది కారు యొక్క లక్షణాలు, ఉపకరణాలు మరియు కారు యొక్క 360 డిగ్రీ వీక్షణను యాప్ ద్వారా బ్రౌజ్ చేసుకునేందుకు అనుమతిస్తుంది. క్విడ్ యొక్క పోటీని యాప్ ద్వారా కూడా పోల్చవచ్చు మరియు దాని ద్వారా వినియోగదారులు కారుని బుక్ చేసుకోవచ్చు.     

క్విడ్ కారు రెనాల్ట్ మరియు నిస్సాన్ రెండూ కలిపి రూపొందించినటువంటి 799cc స్థానభ్రంశాన్ని అందించే కొత్త 3 సిలిండర్  పెట్రోల్ మోటార్ తో అమర్చబడి ఉంది. ఇది 54bhp శక్తిని మరియు 72Nm టార్క్ ని అందిస్తూ 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. ఇది సి-ఎంఎ వేదిక పైన ఆధారపడి ఉండి బరువు మరియు శక్తి నిష్పత్తి అద్భుతంగా ఉన్న కారణంగా వాహనం చాలా తేలికగా ఉంటుంది.     

రెనాల్ట్ క్విడ్ యొక్క వేరియంట్స్ 

క్విడ్ మొత్తం ప్రామాణిక, ఆర్ఎక్స్ఇ, ఆర్ఎక్స్ఇ (ఓ), ఆర్ఎక్స్ఎల్, ఆర్ఎక్స్ టి మరియు ఆర్ఎక్స్ టి (ఓ) అను మొత్త్తం 6 వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ వేరియంట్ల యొక్క ధర పంపిణీ క్రింద ఇవ్వబడింది.  

  

రెనాల్ట్ క్విడ్  Vs ప్రత్యర్ధులు

క్విడ్ వాహనం ద్వారా దేశంలో తమ ఆధిపత్యం పెరగాలనేది రెనాల్ట్ యొక్క ఆశ. ఫ్రెంచ్ ఆటో తయారీసంస్థ ఈ ప్రవేశ స్థాయి హాచ్బ్యాక్ లో విభాగంలో మొదటి టచ్స్క్రీన్ సమాచారవ్యవస్థ, స్పోర్టి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు విస్తృత ఉపకరణాలను కలిగి ఉంది.    

రెనాల్ట్ క్విడ్: లుక్స్! 

క్విడ్ వాహనం రెనాల్ట్ యొక్క చిన్న వాహనం కావచ్చు కాని ఇది చూడడానికి పెద్దదిగానే కనిపిస్తుంది మరియు డస్టర్ నుండి కొన్ని అంశాలను పంచుకుంది. 

ఈ వాహనంలో డిజిటల్ స్పీడోమీటర్ తో పాటూ 7- అంగుళాల టచ్ స్క్రీన్ మీడియా నావిగేషన్ వ్యవస్థ ఉండడం దీని అంతర్భాగాలలో ముఖ్యమైన విషయం. అంతేకాకుండా క్విడ్ 300 లీటర్ల బూట్ స్పేస్ ను కలిగియుండి 25.17kmpl మైలేజ్ సామర్ధ్యాన్ని అందిస్తూ భారతదేశపు అత్యంత ఇంధన సామర్ధ్యం పెట్రోల్ కారుగా అవుతుంది.

యాప్ తో పాటూ రెనాల్ట్ క్విడ్ ప్రత్యక్ష అమ్మకాలు ప్రదర్శన మరియు నిర్వహణ పోర్టల్ పై అభ్యంతరం వంటివి ప్రదర్శించే  వర్చువల్ షోరూమ్ ని కలిగి ఉంది. వినియోగదారులు కారు యొక్క ప్రత్యక్ష వీడియో ని చూసుకేందుకు టైం సాట్లను కూడా పొందవచ్చు.   

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన రెనాల్ట్ క్విడ్ 2015-2019

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిహాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience