• English
  • Login / Register

రెనాల్ట్ క్విడ్ : బుల్లి డస్టర్!

రెనాల్ట్ క్విడ్ 2015-2019 కోసం అభిజీత్ ద్వారా ఆగష్టు 21, 2015 09:56 am సవరించబడింది

  • 13 Views
  • 12 వ్యాఖ్యలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: రెనాల్ట్ తన చిన్ని కారు అయిన క్విడ్ తో అందరినీ ఆశ్చర్య పరిచింది. 98 శాతం స్థానికంగా తయారు చేయబడిన ఈ కారుని కంపెనీ వారు రూ.3.5 నుండి 4 లక్షల ధర వరకు అందుబాటు లో ఉంచారు. ఇంత తక్కువ ధర తో పాటుగా ఇటువంటి ఒక కారుని మనం సాధారణంగా ఈ విభాగంలో చూడము. ఎందుకంటే, ఆల్టో 800, హ్యుండై ఈయాన్, షెవ్రొలే స్పార్ఖ్ వంటి కార్లు చిన్నగా కనపడుతే, ఈ కారు మాత్రం ఒక కాంపాక్ట్ ఎస్యూవీ లా కనపడుతోంది. ఇది భారతీయ మార్కెట్ లో చేసిన సమగ్ర విశ్లేషణ మరియూ డస్టర్ ఆధారంగా నిర్మించడం వలన ఇది సాధ్యం అయ్యింది. క్విడ్ లోని ముఖ్యాంశాలు మరియూ ఇది డస్టర్ తో ఏ విధంగా పోలి ఉందో చూద్దాము

బాహ్యపు రూపం

ముందుగా, డస్టర్ ని భారతదేశానికి తీసుకు రావాలి అని అనుకున్నప్పుదు ఏ విధంగా నిబద్దతగా పనిచేసే ఒక టీం ని తయారు చేసుకున్నారో, ఈ సారి కూడా అదే విధమైన టీం తో ఈ కారుని రూపొందించడం జరిగింది. కానీ డస్టర్ లా కాకుండా, క్విడ్ పూర్తిగా మనకి మరియూ మిగతా ప్రపంచానికి కూడా భారతదేశం లోనే తయారు చేయబడింది. 'మోర్ కార్ పర్ కార్ అంటే, ప్రతి కారుకీ ఎక్కువ కారు అన్న నినాదాన్ని ఈ ఫ్రెంచ్ వారు దృష్టిలో పెట్టుకుని మాములు దాని కంటే మరింత హుందాగా దీనిని రూపొందించారు. ఇది బయట నుండి చూడటానికి వీల్స్ దగ్గర, హెడ్ల్యాంప్స్ దగ్గర, బూట్ లిడ్ దగ్గర డస్టర్ లాగా ఉంటుంది.

అంతర్ఘతాలు 

డస్టర్ యొక్క క్యాబిన్ లాగే క్విడ్ కి కూడా పెద్ద ముందు వైపు అద్దాలు మరియూ లోపల సౌకర్యంగా ఉండేందుకు సరిపడ ఖాలీ ఉంటూంది. అంతా చక్కగా సాదాగా అమరిక చేసి ఉంటుంది. ఎటువంటి అసౌకర్యం లేకుండా ఉండే లక్షణం అందరిని మెపిస్తుంది.

క్విడ్ యొక్క విడుదల తో రెనాల్ట్ వారు చిన్న కార్ల విభాగంలోకి అడుగు పెడతారు మరియూ డస్టర్ లాగానే విజయం పొందే అవకాశాలు ఉన్నాయి. ఇది తయారీదారునికి సవాలుగా మరియూ చిన్న కారు కొనుగోలుదారునికి వరంగా ఉండబోతోంది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your Comment on Renault క్విడ్ 2015-2019

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience