Renault Kardian విడుదల: మీరు తెలుసుకోవాల్సిన 5 విషయాలు ఇవే

రెనాల్ట్ కార్డియన్ కోసం rohit ద్వారా అక్టోబర్ 27, 2023 05:47 pm ప్రచురించబడింది

  • 902 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

తొలిసారి విడుదలకానున్న, రెనాల్ట్ కార్డియన్ కార్ల తయారీదారు యొక్క కొత్త మాడ్యులర్ ప్లాట్ఫామ్తో పాటు 6-స్పీడ్ DCTతో కొత్తగా అభివృద్ధి చేసిన 1-లీటర్, 3-సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్.

Renault Kardian

రెనాల్ట్ కార్డియన్ యూరప్, లాటిన్ అమెరికా వంటి దేశాల కోసం తయారు చేసిన కంపెనీ కొత్త SUV కారు ఇది. రెనాల్ట్ SUVని అంతర్జాతీయ మార్కెట్లో ఆవిష్కరించింది.  రియో డి జనీరోలో జరిగిన విలేకరుల సమావేశంలో రెనాల్ట్ ఈ కారును ప్రదర్శించింది. ఇది 2027 వరకు కంపెనీ గ్లోబల్ ప్లాన్లో భాగం. రెనాల్ట్ యొక్క ఈ SUV గురించి మీరు తెలుసుకోవలసిన 5 విషయాలు ఇక్కడ ఉన్నాయి:

కొత్త మాడ్యులర్ ప్లాట్ ఫామ్ ఆధారంగా

Renault Kardian platform

లాటిన్ అమెరికా, భారత్ సహా నాలుగు వేర్వేరు ప్రపంచ మార్కెట్ల కోసం రూపొందించిన కొత్త మాడ్యులర్ ప్లాట్ఫామ్ను ఈ కార్యక్రమంలో రెనాల్ట్ ప్రకటించింది. రెనాల్ట్ కార్డియన్ ఈ ప్లాట్ ఫామ్ పై నిర్మించిన కంపెనీ యొక్క మొదటి కారు అవుతుంది. కంపెనీకి చెందిన ఈ కొత్త మాడ్యులర్ ప్లాట్ ఫామ్ పై 4 నుంచి 5 మీటర్ల పొడవున్న కార్లను తయారు చేయనున్నారు. రెనాల్ట్ యొక్క కొత్త కాంపాక్ట్ SUV పొడవు 4120, 2025 మిమీ వెడల్పు (ORVMలతో సహా), 1596 మిమీ ఎత్తు (పైకప్పు పట్టాలతో సహా). ఈ వాహనం యొక్క వీల్ బేస్ పరిమాణం 2604 మిల్లీమీటర్లు, గ్రౌండ్ క్లియరెన్స్ 209 మిల్లీమీటర్లు.

A post shared by CarDekho India (@cardekhoindia)

ఇంటీరియర్ మరియు ఎక్స్టీరియర్ డిజైన్ వివరాలు

Renault Kardian front

రెనాల్ట్ కార్డియన్ SUV ఫ్రంట్ లుక్ చాలా షార్ప్ గా కనిపిస్తుంది. ముందు భాగంలో, ఆల్- LED హెడ్లైట్ సెటప్ అలాగే గ్రిల్పై గ్లాస్ బ్లాక్ ప్యానెల్ తో అందించబడుతుంది, ఇది రెనాల్ట్ లోగోను పోలిన అనేక రాంబస్లను పొందుతుంది. LED డేటైమ్ రన్నింగ్ లైట్లు వోల్వో యొక్క హామర్ స్టైల్ హెడ్లైట్లను పోలి ఉంటాయి. ముందు భాగంలో పెద్ద ఎయిర్ డ్యామ్, సిల్వర్ స్కిడ్ ప్లేట్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు మరియు ఫాగ్ ల్యాంప్స్, రాడార్ ఫర్ అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) వంటి ఫీచర్లు ఉన్నాయి.

Renault Kardian side
Renault Kardian rear

సైడ్ ప్రొఫైల్ గురించి మాట్లాడితే, ఇందులో ఫంక్షనల్ రూఫ్ రైల్స్ (80 కిలోల వరకు లోడ్లను తీసుకెళ్లే సామర్థ్యం), 17-అంగుళాల డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ మరియు ఫ్లోటింగ్ రూఫ్ ఉన్నాయి. వెనుక భాగంలో రెనాల్ట్ కిగర్ వంటి C-ఆకారంలో LED టెయిల్లైట్లు మరియు సిల్వర్ స్కిడ్ ప్లేట్తో వెడల్పాటి బంపర్ ఉన్నాయి. దీని వెనుక ప్రొఫైల్ చాలా సింపుల్ గా కనిపిస్తుంది.

Renault Kardian cabin
Renault Kardian 8-inch touchscreen

కార్డియన్ SUV క్యాబిన్ లో ఆల్-బ్లాక్ కలర్ థీమ్ ను రెనాల్ట్ ఎంచుకుంది. క్యాబిన్ లోపల, సెంటర్ కన్సోల్ లో స్టీరింగ్ వీల్, AC వెంట్స్ మరియు సిల్వర్ యాక్సెంట్స్ ఉన్నాయి. డ్యాష్ బోర్డుపై, దాని పూర్తి వెడల్పు వరకు విస్తరించిన గ్లోస్-బ్లాక్ ఇన్సర్ట్ లు ఉన్నాయి మరియు డ్యాష్ బోర్డ్ పై, ఎసి వెంట్ లను కూడా అమర్చారు. ఈ SUV కారు క్యాబిన్ కు ఫ్యాబ్రిక్ అప్ హోల్ స్టరీతో పాటు డోర్ ప్యాడ్స్, ఫ్రంట్ సెంటర్ ఆర్మ్ రెస్ట్, సీట్లపై కాంట్రాస్ట్ ఆరెంజ్ కుట్లు వంటి ఫీచర్లు ఉన్నాయి. సీట్లపై రెనాల్ట్ లోగో ఉంటుంది. సిట్రోయెన్ eC3, C5 ఎయిర్ క్రాస్ వంటి అత్యాధునిక జాయ్ స్టిక్ తరహా గేర్ సెలెక్టర్లను కూడా కంపెనీ అందించింది.

ఇది కూడా చూడండి: లంబోర్ఘిని హురాకాన్ టెక్నికాను ఎంచుకున్న శ్రద్ధా కపూర్, కొత్త రేంజ్ రోవర్ స్పోర్ట్ ను కొనుగోలు చేసిన అనుభవ్ సింగ్ బస్సీ

కార్డియన్ SUV థీమ్ లోనే నవీకరించనున్న రెనాల్ట్ కిగర్ ఫేస్ లిఫ్ట్ క్యాబిన్

Renault Kiger

ఫేస్ లిఫ్ట్ రెనాల్ట్ కిగర్ కారు యొక్క డిజైన్ కార్డియన్ SUV నుండి ప్రేరణ పొందవచ్చు. కొత్త రెనాల్ట్ కిగర్ 2024 నాటికి భారతదేశంలో విడుదల అయ్యే అవకాశం ఉంది. ఎక్స్టీరియర్ లాగే, రెనాల్ట్ తన కిగర్ కారు యొక్క ఇంటీరియర్ ను కూడా కార్డియన్ SUV యొక్క క్యాబిన్ డిజైన్ థీమ్ లోనే కిగర్ ను నవీకరించవచ్చని మేము భావిస్తున్నాము.

ఫీచర్లు మరియు భద్రత

Renault Kardian 7-inch digital driver's display

రెనాల్ట్ కార్డియన్ లో 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, 8-అంగుళాల టచ్స్క్రీన్ సిస్టమ్ (వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లేతో), 8-కలర్ యాంబియంట్ లైటింగ్, ప్యాడిల్ షిఫ్టర్లు, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ మరియు ఆటో AC వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇందులో మొత్తం 4 USB పోర్టులు (2 ముందు, 2 వెనుక) ఉన్నాయి.

Renault Kardian 6 airbags

ఆరు ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్,360 డిగ్రీల కెమెరా వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, ఫ్రంట్ కొలిషన్ వార్నింగ్ వంటి 13 ADAS ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ఇది కూడా చదవండి: రూ.10 లక్షల లోపు వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ ఎంపిక ఉన్న 7 కార్లు

సరికొత్త పవర్ ట్రైన్

రెనాల్ట్ కార్డియన్ కంపెనీ లైనప్ లో కొత్త పవర్ ట్రెయిన్ పొందిన మొదటి కారు అవుతుంది. ఇది డైరెక్షన్ ఇంజెక్షన్ తో కొత్త 1-లీటర్, 3-సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ తో పనిచేస్తుంది, ఇది 120PS శక్తిని మరియు 220Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ (DCT) తో జతచేయబడుతుంది, ఇది లాటిన్ అమెరికాలోని రెనాల్ట్ కారులో మొదటిసారి లభిస్తుంది. కార్డియన్ కారులో మూడు డ్రైవింగ్ మోడ్లు ఉంటాయి: ఎకో, స్పోర్ట్ మరియు మైసెన్స్.

భారతదేశంలో కార్డియన్ కారు రాక ఇంకా నిర్ణయించబడలేదు. అదే సమయంలో, రెనాల్ట్ రాబోయే సంవత్సరాలలో ఇక్కడ మూడవ తరం డస్టర్ ను విడుదల చేయనుంది, ఈ వాహనం త్వరలో అంతర్జాతీయంగా ఆవిష్కరించబడుతుంది. అప్పటిలోగా, రెనాల్ట్ కార్డియన్ కారులో మీకు ఏమి నచ్చింది? ఈ కారును భారతదేశంలో చూడాలనుకుంటున్నారా? అనే విషయాలు మాకు తెలియజేయడం మర్చిపోకండి.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన రెనాల్ట్ కార్డియన్

1 వ్యాఖ్య
1
A
alapati chandra sekhar
Nov 4, 2023, 4:57:38 PM

Which batteries are using and the capacity

Read More...
    సమాధానం
    Write a Reply
    Read Full News

    ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

    • లేటెస్ట్
    • రాబోయేవి
    • పాపులర్
    ×
    We need your సిటీ to customize your experience