రెనాల్ట్ భారతదేశం లో దాని 190వ డీలర్‌షిప్ ని ప్రారంభించింది
నవంబర్ 24, 2015 05:05 pm nabeel ద్వారా ప్రచురించబడింది
- 15 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
ఫ్రెంచ్ ఆటోమొబైల్ తయారీసంస్థ రెనాల్ట్ దేశంలో వారి డీలర్ నెట్వర్క్ విస్తారించాలనే క్రమంలో కరీంనగర్ తెలంగాణ వద్ద కొత్త డీలర్షిప్ తెరిచింది. ఈ డీలర్‌షిప్ 4,700 చదరపు అడుగుల ప్రదర్శన ప్రాంతంతో 16,584 చదరపు. అడుగుల విస్తీర్ణం కలిగి 4 కార్లు ప్రదర్శించటానికి ఉంది. అదేవిధంగా 11,884 చదరపు అడుగులు కవర్ చేస్తూ ఆరు యాంత్రిక బేస్ మరియు మూడు బాడీ షాప్ బేస్ తో ఒక వర్క్ షాప్ వసతి కూడా కల్పిస్తుంది.
ఈ ప్రారంభోత్సవంతో రెనాల్ట్ కి ఇప్పుడు దేశంలో 190 డీలర్షిప్స్ ఉన్నాయి. వారు 2016 చివరి నాటికి 240 డీలర్షిప్స్ మరియుసర్వీస్ సెంటర్స్ కలిగి ఉండాలని ప్రణాళిక వేసుకుంటున్నారు. అంతేకాకుండా, దక్షిణ భారతదేశంలో 52 అమ్మకాలు మరియు 37 సర్వీస్ కేంద్రాలు ప్రాంతంలో తమ అమ్మకాలు మరియు సేవ నెట్వర్క్ ని మెరుగుపరుస్తున్నాయి. ఈ తాజా ఫెసిలిటీ 8-5-440, సర్వే నం. 445-446, హైదరాబాద్ మెయిన్ రోడ్, కరీంనగర్ వద్ద ఉంది. అయితే వర్క్ షాప్ ప్లాట్ నెం.124, సర్వే నం. 625 & 626, ప్లాట్ నెం. 113/A, రాజీవ్ ఆటో నగర్ వద్ద ఉంది.
ఇది కూడా చదవండి రెనాల్ట్ క్విడ్ 50,000 కస్టమర్ ఆర్డర్లను పొందారు!
"తెలంగాణా కరీంనగర్ వద్ద రెనాల్ట్ యొక్క ప్రారంభోత్సవంతో దేశంలో మా ఉనికిని విస్తరించుకుంటున్నందుకుగానూ చాలా ఆనందంగా ఉంది. మేము భారతదేశం లో రెనాల్ట్ బ్రాండ్ పెరుగుదలపై మరియు మా నెట్వర్క్ ఉనికిని విస్తరించడంపై చాలా దృష్టి పెడుతున్నాము. రెనాల్ట్ క్విడ్ కి వచ్చిన మంచి స్పందనతో, మేము మా వినియోగదారులను మరింతగా చేరువయ్యి తద్వారా రెనాల్ట్ నుండి మంచి వాహనాలను అందిస్తాము.ఒక మెరుగైన వినియోగదారుల అనుభూతి కోసం మా ఈ పెరుగుతున్న నెట్వర్క్ దోహదపడగలదు అని నమ్ముతున్నాము." రెనాల్ట్ ఇండియా యొక్క సేల్స్ & మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్, రాఫెల్ ట్రైగర్ తెలిపారు.
ఇంకా చదవండి