• English
    • Login / Register

    రెనాల్ట్ డస్టర్ వేరియంట్స్ ఏది కొనాలో నిర్ణయించుకోండి

    రెనాల్ట్ డస్టర్ 2016-2019 కోసం sumit ద్వారా డిసెంబర్ 15, 2015 12:56 pm ప్రచురించబడింది

    • 15 Views
    • 1 వ్యాఖ్యలు
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    Renault Duster

    జైపూర్: దాని విభాగంలో ఫ్రంట్ రన్నర్ గా, రెనాల్ట్ డస్టర్ వాహనం మార్కెట్ లో కొత్త పోటీదారులు ఎంట్రీ ఉన్నప్పటికీ తన పట్టుని నిలుపుకోగలుగుతుంది. హ్యుందాయి క్రెటా మరియు మారుతి S-క్రాస్ తో పోటీ అంత సులభం కాదు, కానీ డస్టర్ అది నిర్వర్తించగలుగుతుంది. ఈ ఫేస్‌లిఫ్ట్ కారు స్టన్నింగ్ లుక్స్ తో ఆటో ఎక్స్పో 2016 లో రాబోతున్నది. ఒకవేళ మీరు రెనాల్ట్ యొక్క ప్రధాన SUV కొనుగోలు చేద్దాం అనుకొని ఏ వేరియంట్ కొనాలో తెలియక ఆగిపోయారా?? చింతించకండి మీకోసం మేము సంక్షిప్త విశ్లేషణ సిద్ధం చేసాము. రెనాల్ట్ డస్టర్ మూడు ఇంజిన్లు తో వస్తుంది. అవి 1.5L DCI THP అనగా మరింత శక్తివంతమైన ఇంజిన్ (AWD ఎంపికతో వస్తుంది), 1.6L K4M పెట్రోల్ ఇంజన్ మరియు 1.5L DCI HP అనగా తక్కువ శక్తివంతమైన ఇంజిన్. మరింత శక్తివంతమైన మరియు తక్కువ శక్తివంతమైన ఇంజిన్లు రెండు కూడా డీజిల్ తో నడుస్తాయి. డస్టర్ RxE, RxLమరియు RxZ అను మూడు రకాల్లో వస్తుంది.

    1. RxE వేరియంట్: రూపాయలు. 8.8 లక్షలు - 9.6 లక్షలు

    Renault Duster

    RxE వేరియంట్ పెట్రోల్ ఇంజన్ మరియు తక్కువ శక్తివంతమైన డీజిల్ ఇంజిన్ ఈ రెండిటిపై మీ ఎంపికను పరిమితం చేస్తుంది. ఇది మ్యూజిక్ వ్యవస్థ మరియు అలాయ్ వీల్స్ ని పొంది లేదు. కానీ కొన్ని ముఖ్యమైన లక్షణాలు చాలా మందిని ఈ వేరియంట్ వైపు వెళ్ళేలా చేస్తాయి.

    కొన్ని లక్షణాలు

    • ABS+EBDతో బ్రేక్ సహాయం
    • ఫ్రంట్ పవర్ విండోస్
    • రెండు కప్ హోల్డర్స్
    • డిజిటల్ గడియారం
    • వన్ టచ్ టర్న్ సూచిక
    • సాధారణ స్టీల్ వీల్స్
    • కీలెస్ ఎంట్రీ
    • పవర్ స్టీరింగ్
    • హెడ్లైట్ ఆన్ అలారం

    ఎవరైతే తక్కువ బడ్జెట్ తో కారు ని కొనాలి అనుకుంటారో మరియు తక్కువ శక్తితో సర్ద్దుకుంటారో వారు ఈ RxE వేరియంట్ వైపు వెళ్ళవచ్చు. నవీకరణలతో డస్టర్ తప్పకుండా ఆకట్టుకుంటుంది.

    2. RxL వేరియంట్: రూపాయలు. 10.2 లక్షలు - 12.3 లక్షలు

    ఈ వేరియంట్ మూడు ఇంజిన్లతో అందించబడుతుంది. దీనిలో మ్యూజిక్ సిస్టమ్, ఎయిర్బ్యాగ్స్ వంటి లక్షణాలు కలిగి ఉన్నాయి.

    ఇతర కొన్ని లక్షణాలు :

    •  డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్ ( ప్రయాణీకుల కోసం ఆప్షనల్)
    •  ఆల్ వీల్ డ్రైవ్ లేదా AWD (మరింత శక్తివంతమైన ఇంజిన్ తో ఆప్ష్నల్)
    •  స్టయిలిడ్ స్టీల్ వీల్
    •  స్పోర్టి అల్యూమినియం అలాయ్ వీల్స్(ఆప్ష్నల్)
    •  స్పోర్టి బర్న్ట్ ఎరుపు ఫాబ్రిక్ (AWD) తో
    •  బహుళ సమాచార ప్రదర్శన తో ఆన్బోర్డ్ ట్రిప్ కంప్యూటర్
    •  నావిగేషన్ మరియు బ్లూటూత్ తో మీడియా నావిగేషన్ వ్యవస్థ (ఆప్ష్నల్)
    •  ఫ్రంట్ & రేర్ 12 V యాక్సేసరి సాకెట్
    •  బాహ్య ఉష్ణోగ్రత డిస్ప్లే
    •  రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ (ఆప్షనల్)

    ఇది భద్రతపై రాజీ పడని సంగీత ప్రేమికుల కొరకు ఈ వేరియంట్. ఎవరైతే RxE మోడల్ లో అందించబడని మరింత శక్తివంతమైన ఇంజిన్ కావలనుకుంటారో వారు RxLవేరియంట్ కోసం చూడవచ్చు.

    3. RxZ వేరియంట్: రూపాయలు. 13.1 లక్షలు - 14.4 లక్షలు

    Renault Duster

    ఇది డస్టర్ యొక్క అగ్ర శ్రేణి వేరియంట్. ఇది మరింత శక్తివంతమైన ఇంజిన్ తో వస్తుంది.

    కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి:

    •  డ్యుయల్ ఎయిర్బ్యాగ్స్
    •  స్పోర్టి అల్యూమినియం అలాయ్ చక్రాలు
    •  ఆంథ్రాసైట్ అల్లాయ్ వీల్స్ (AWD మాత్రమే)
    •  ఫ్రంట్ & రియర్ బంపర్ స్కిడ్ ప్లేటు
    •  క్రోం ఫినిష్ పార్కింగ్ బటన్
    •  స్పీడ్ లిమిటర్ తో క్రూయిజ్ కంట్రోల్
    •  గేర్ షిఫ్ట్ ఇండికేటర్
    •  ఎకో మోడ్
    •  ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ అన్లాక్
    •  స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్
    •  ఇంటిగ్రేటెడ్ టచ్స్క్రీన్ మీడియా నావిగేషన్ (ఆప్షనల్)
    •  వెనుక AC (ఆప్షనల్)

    ఈ వేరియంట్ ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ అన్లాక్ మరియు స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్ వంటి అత్యాధునిక సాంకేతిక లక్షణాలతో నింపబడి ఉంటుంది. ఈ అగ్ర శ్రేణి వేరియంట్ ఖచ్చితంగా మీ డిమాండులను చేరుకోగలదు.

    రెనాల్ట్ డస్టర్ AWD యొక్క ఎక్స్పర్ట్ రివ్యూ వీడియో చూడండి

    ఇంకా చదవండి

    was this article helpful ?

    Write your Comment on Renault డస్టర్ 2016-2019

    ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

    • లేటెస్ట్
    • రాబోయేవి
    • పాపులర్
    ×
    We need your సిటీ to customize your experience