Renault Duster New vs Old: చిత్రాలతో పోలిక
రెనాల్ట్ డస్టర్ 2025 కోసం shreyash ద్వారా డిసెంబర్ 01, 2023 02:28 pm ప్రచురించబడింది
- 61 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
2025 నాటికి కొత్త-జనరేషన్ మోడల్‌లో, భారతదేశంలో కొత్త రెనాల్ట్ డస్టర్ తిరిగి వస్తుందని అంచనా.
మూడవ-జనరేషన్ రెనాల్ట్ డస్టర్, ఫ్రెంచ్ వాహన తయారీదారు బడ్జెట్-ఓరియెంటెడ్ బ్రాండ్ అయిన, డాసియా ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించబడింది. దీని కంటే ముందు వర్షన్ విధంగా కాకుండా, సరికొత్త డస్టర్ CMF-B ప్లాట్ఫార్మ్ పై ఆధారపడింది. ఇది, ఆధునికమైన డిజైన్, నవీకరించిన ఇంటీరియర్ؚను మాత్రమే కాకుండా, స్వల్ప హైబ్రిడ్ మరియు బలమైన హైబ్రిడ్ కాన్ఫిగరేషన్‌లలో అనేక పవర్ؚట్రెయిన్ ఎంపికలతో రానుంది.
రెనాల్ట్ డస్టర్, 2022 ప్రారంభంలో భారతదేశంలో నిలిపివేయబడింది. అప్పటికి ఇది భారతదేశంలో 10 సంవత్సరాల తన దీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేసింది. ఆ తరువాత రెండవ-జెన్ మోడల్ؚను కూడా రెనాల్ట్ విడుదల చేయలేదు, ప్రస్తుతం కొత్త వర్షన్ؚ మార్కెట్‌లో విడుదల కానుంది. భారతదేశంలో కొత్త-జెన్ డస్టర్ కోసం ఇంకా కొంతకాలం వేచి ఉండాల్సి ఉంది. ఇంతకు ముందు భారతదేశంలో విక్రయించబడిన పాత డస్టర్ؚతో పోలిస్తే కొత్త-జెన్ SUV ఎంత భిన్నంగా ఉందో మనం పరిశీలిద్దాము.
ఫ్రంట్
పాత వర్షన్ؚతో పోలిస్తే ప్రస్తుత కొత్త-జనరేషన్ రెనాల్ట్ డస్టర్ మరింత నాజూకుగా మరియు ధృఢంగా కనిపిస్తోంది. సరికొత్త గ్రిల్, Y-ఆకారపు LED DRLలతో నాజూకైన హెడ్ؚలైట్ؚలు, భారీ ఎయిర్ డ్యామ్ؚలతో వస్తుంది. అయితే, పాత డస్టర్‌లో ఉన్న ఎయిర్ డ్యామ్ కొత్త డస్టర్ؚలో కనిపించినంత ప్రాముఖ్యంగా కనిపించదు.
పెద్ద ఎయిర్ డ్యామ్ చుట్టూ ఉన్న మందమైన స్కిడ్ ప్లేట్ కొత్త డస్టర్ؚను మరింత ధృఢంగా కనిపించేలా చేస్తోంది. ఫాగ్ ల్యాంప్ؚలు స్కిడ్ ప్లేట్ؚలోనే అమర్చబడి ఉన్నాయి. కొత్త డస్టర్ؚలో, మరింత మెరుగైన ఏరోడైనమిక్ సామర్ధ్యం కోసం ముందు బంపర్‌పై ఎయిర్ వెంట్ؚలు అమర్చారు, దీనికి భిన్నంగా, పాత డస్టర్ؚలో ఫాగ్ ల్యాంప్ؚల కోసం విడిగా హౌసింగ్ ఉంది.
ఇది కూడా తనిఖీ చేయండి: మెర్సిడెజ్-AMG G 63 SUVతో MS ధోని గ్యారేజీకి మరొక ప్రత్యేకత వచ్చింది
సైడ్
ఐకానిక్ ‘డస్టర్’ సిలహౌట్ؚను కొత్త డస్టర్ నిలుపుకుంది. అయితే, ఇది ప్రస్తుతం ఇంతకు ముందు కంటే మరింత ఆకర్షణీయంగా (మరింత భారీగా) కనిపిస్తోంది. మునుపటి-జెన్ డస్టర్‌లో ఉన్నట్లుగా కాకుండా, కొత్త వాహనంలో ప్రత్యేకించి ఫ్రంట్ డోర్ మందమైన సైడ్ క్లాడింగ్ؚ మరియు స్క్వేరెడ్ వీల్ ఆర్చెస్‌లؚతో వస్తుంది. మరొక గుర్తించదగిన మార్పు, పాత డస్టర్ؚలో ఫ్లాప్ స్టైల్ డోర్ హ్యాండిల్స్ ఉండగా, ఇవి కొత్త డస్టర్ؚలో లేవు. కొత్త్ డస్టర్ రేర్ డోర్ హ్యాండిల్ C-పిల్లర్ వద్దకు మార్చబడింది. రెండు డస్టర్ వర్షన్ؚలలో రూఫ్ రెయిల్స్‌ను చూడవచ్చు. అయితే, కొత్త మోడల్ؚలో ఉన్నవి, రూఫ్-ర్యాక్ యాక్సెసరీలతో 80కిలోల వరకు లోడ్ؚను భరించగల సామర్ధ్యంతో ఫంక్షనల్ؚగా ఉంటాయి.
కొత్త డస్టర్ؚ 17 లేదా 18-అంగుళాల అలాయ్ వీల్స్ ఎంపికలతో రానుంది, అయితే పాత డస్టర్ؚలో కేవలం 16-అంగుళాల అలాయ్ వీల్స్ؚ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ కూడా, వీల్స్ డిజైన్ పూర్తిగా భిన్నoగా కాకుండా మరింత ఆధునికంగా కనిపించనున్నాయి.
రేర్
ముందు భాగం విధంగానే, కొత్త-జనరేషన్ డస్టర్ వెనుక భాగాన్ని కూడా తేలికపాటి మార్పులతో కాకుండా పూర్తిగా నవీకరించారు. స్పష్టమైన పరిమాణంలో, డైనమిక్ ఆకృతి కోసం కుంభకార బూట్ లిడ్ؚను కలిగి ఉంది. ముఖ్యాంశాలలో Y-ఆకారపు LED టెయిల్‌ల్యాంప్ؚలు, రూఫ్-ఇంటిగ్రేటెడ్ రేర్ స్పాయిలర్ మరియు భారీ సిల్వర్ స్కిడ్ ప్లేట్ ఉన్నాయి.
పాత డస్టర్ రేర్ డిజైన్ మరింత సంప్రదాయకంగా ఉంటుంది, దీనిలో చదునైన టెయిల్‌గేట్ ఉంది. దీనిలో రేర్ స్పాయిలర్ లేదు అయితే రేర్ స్కిడ్ ప్లేట్ ఉంది.
డ్యాష్ؚబోర్డు
కొత్త-జనరేషన్ డస్టర్, క్యాబిన్ చుట్టూ Y-ఆకారపు హైలైట్ؚలు మరియు ఇన్ؚసర్ట్ؚలతో పూర్తిగా కొత్త డ్యాష్ؚబోర్డు డిజైన్ؚను కలిగి ఉండటాన్ని చూడవచ్చు. ఇన్ఫోటైన్మెంట్ యూనిట్, సెంట్రల్ AC వెంట్ؚలు మరియు కంట్రోల్ؚలు మెరుగైన ఎర్గోనామిక్స్ కోసం డ్రైవర్ సీట్ వైపుకు అమర్చారు.
సరికొత్త డ్యాష్‌బోర్డులో భాగంగా, కొత్త డస్టర్ 10.1-అంగుళం ఫ్లోటింగ్ టచ్ؚస్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ؚతో వస్తుంది, ఇది వైర్ؚలెస్ అండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ؚప్లేలకు కూడా మద్దతు ఇస్తుంది. పాత ఇండియా-స్పెక్ డస్టర్ؚలో వైర్డ్ ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ؚప్లే సపోర్ట్ؚతో 7-అంగుళాల టచ్ؚస్క్రీన్ సిస్టమ్ؚను కలిగి ఉంది, ఈ SUVని నిలిపివేయడానికి ముందే ఇది నిలిపివేయబడింది.
2024 రెనాల్ట్ డస్టర్ 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లేను కలిగి ఉంది, పాత డస్టర్ నలుపు మరియు తెలుపు బహుళ సమాచార డిస్ప్లేను కలిగి ఉన్న థర్డ్ డయల్ؚతో అనలాగ్ ఇన్ట్రుమెంట్ క్లస్టర్ ఉండేది.
సెంటర్ కన్సోల్
కొత్త సెంటర్ కన్సోల్ లేఅవుట్ؚతో, కొత్త డస్టర్ ఆటోమ్యాటిక్ వేరియెంట్ؚలు, డ్రైవ్ మోడ్ ఎంపిక కోసం నాబ్ؚను, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, 12 V మరియు C-టైప్ ఛార్జింగ్ పోర్ట్ؚలు, వైర్ؚలెస్ ఫోన్ ఛార్జింగ్ ట్రేؚలను పొందుతాయి. పాత డస్టర్ؚలో వైర్ؚలెస్ ఫోన్ ఛార్జింగ్ ఫీచర్ లేదా ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ؚలు వంటి ఫీచర్‌లు లేవు. చాలా తక్కువ స్థాయి ఆటోమ్యాటిక్ క్లైమేట్ కంట్రోల్ؚను కూడా ఇది కలిగి ఉంది, కొత్త టచ్ؚస్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ؚలో అనేక క్లైమెట్ కంట్రోల్ؚలను కొత్త SUVలో చూడవచ్చు.
ఇది కూడా చదవండి: క్యాలెండర్ ఇయర్ చివరలో కొత్త కారును కొనడంలో లాభాలు మరియు నష్టాలు
ఫ్రంట్ సీట్ؚలు
కొత్త మరియు పాత రెనాల్ట్ డస్టర్ؚ మోడల్‌లలో ఫ్యాబ్రిక్ సీట్ అప్ؚహోల్ؚస్ట్రీని చూడవచ్చు. అయితే, కొత్త డస్టర్ హెడ్‌రెస్ట్ؚల డిజైన్ భిన్నంగా ఉంది, అంతేకాకుండా అప్ؚహోల్ؚస్ట్రీ కొత్త రంగులలో వస్తుంది.
వెనుక సీట్ؚలు
వెనుక వైపు, రెండు డస్టర్‌లలో 3 హెడ్‌రెస్ట్‌లు ఉన్నాయి, అయితే కొత్త డస్టర్‌లో మధ్య హెడ్‌రెస్ట్‌ను సవరించవచ్చు, పాత డస్టర్ؚలో ఇది అమర్చబడి ఉంటుంది. కొత్త-జెన్ SUVలో, పాత SUVలో ఉన్న ఫోల్డ్-అవుట్ రేర్ ఆర్మ్ రెస్ట్ లేదు, అయితే దీని బదులుగా 3-పాయింట్ సీట్ బెల్ట్ మరియు ISOFIX చైల్డ్ సీట్ యాంకరేజ్ؚలు ఉన్నాయి.
బూట్ స్పేస్
కొత్త-జనరేషన్ డస్టర్ బూట్ స్పేస్‌లో 472 లీటర్ లగేజీని ఉంచవచ్చు. మరొక వైపు, పాత డస్టర్ 475 లీటర్ బూట్ స్పేస్ؚను అందిస్తుంది. అంటే, బూట్ స్పేస్ అంకెలలో భారీ మార్పులు లేవు.
పవర్ؚట్రెయిన్ؚలు
భారతదేశంలో తన జీవితకాలం చివరిలో, పాత రెనాల్ట్ డస్టర్‌ను రెండు పెట్రోల్ ఇంజన్ ఎంపికలలో అందించింది: 106 PS పవర్ 1.5-లీటర్ యూనిట్ మరియు 156 PS పవర్ 1.3-లీటర్ టర్బో పెట్రోల్. ఇంతకు ముందు, రెనాల్ట్ కూడా డస్టర్ؚను 110 PS పవర్ 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ؚతో అందించింది.
కొత్త యూరోపియన్-స్పెక్ డస్టర్ 3 పవర్‌ట్రెయిన్ ఎంపికలతో వస్తుంది: 130 PS, 48V మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్ؚతో జోడించబడిన 1.2-లీటర్ పెట్రోల్ యూనిట్, బలమైన-హైబ్రిడ్ 140 PS 1.6-లీటర్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ మరియు మూడవది పెట్రోల్ మరియు LPG కలయిక. కొత్త ఇండియా-స్పెక్ డస్టర్ వివరాలను ఇంకా ప్రకటించలేదు, కానీ ఇది కేవలం పెట్రోల్ ఆఫరింగ్ కావచ్చని భావిస్తున్నాము. అయితే, భారతీయ మార్కెట్ కోసం డస్టర్ ఆల్-వీల్-డ్రైవ్ వేరియెంట్‌తో తిరిగి వస్తుందని ఆశించవచ్చు.
అంచనా విడుదల మరియు ధర
మూడవ-జనరేషన్ రెనాల్ట్ డస్టర్ 2025 నాటికి భారతదేశంలో విడుదల అవుతుందని అంచనా. రెనాల్ట్ దీనిని రూ.10 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు విక్రయించవచ్చు. ఇది హ్యుందాయ్ క్రెటా, మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్, సిట్రోయెన్ C3 ఎయిర్ؚక్రాస్ మరియు హోండా ఎలివేట్ వంటి వాటితో పోటీ పడుతుంది.