• English
  • Login / Register

M S ధోనీ గ్యారేజ్ ను మరింత ప్రత్యేకం చేసిన Mercedes-AMG G 63 SUV

మెర్సిడెస్ జి జిఎల్ఈ కోసం shreyash ద్వారా డిసెంబర్ 01, 2023 02:50 pm ప్రచురించబడింది

  • 74 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

మహేంద్ర సింగ్ ధోని గ్యారేజ్ లో క్లాసిక్ నుండి మోడ్రన్ వాహనాల సేకరణ ఉంది

M S Dhoni's Mercedes AMG G 63

భారత మాజీ క్రికెటర్ మరియు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇటీవల తన ఆకట్టుకునే గ్యారేజీ కలెక్షన్లో కొత్త మెర్సిడెస్-AMG G 63 SUV ని చేర్చారు. ధోనీ బ్లాక్ AMG G 63 SUV లో హాయిగా కూర్చొని ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ కారు రిజిస్ట్రేషన్ ప్లేట్ పై '0007' (ఆయన పుట్టిన తేదీ అలాగే జెర్సీ నంబర్) నంబర్ కనిపిస్తుంది.

A post shared by Sumeet Kumar Bajaj (@bajaj.sumeetkumar)

M S ధోనీ గ్యారేజీలోని ఇతర కార్లు

మహేంద్ర సింగ్ ధోనీ కారు కలెక్షన్ లో రెడ్ జీప్ గ్రాండ్ చెరోకీ ట్రాక్ హాక్ SUV కూడా ఉంది, దీనిని అతని భార్య సాక్షి ధోని బహుమతిగా ఇచ్చారు. ఇది కాకుండా, 'కెప్టెన్ కూల్' అని పిలువబడే ధోనీ కారు కలెక్షన్ లో కస్టమ్ బిల్ట్ రెడ్ అండ్ బ్లాక్ మహీంద్రా స్కార్పియో, పాత ల్యాండ్ రోవర్ డిఫెండర్ మరియు గ్రీన్ నిస్సాన్ జోగా గ్రీన్ నిస్సాన్ జోంగా (2019 లో కొనుగోలు చేసి పునరుద్ధరించారు)తో సహా కొన్ని వింటేజ్ కార్లు కూడా ఉన్నాయి.

ఇది కూడా చదవండి: KBC 2023 లో కోటి రూపాయలు గెలుచుకున్న మయాంక్ కు హ్యుందాయ్ i20 గిఫ్ట్

మెర్సిడెస్ AMG G 63 గురించి మరిన్ని విషయాలు

Mercedes AMG G 63
Mercedes AMG G 63 Interior

మెర్సిడెస్ SUV మంచి రోడ్డు ఉనికి, శక్తి మరియు ఆఫ్-రోడ్ సామర్థ్యాలకు ప్రసిద్ధి చెందింది. ఇందులోని 4-లీటర్ V8 బై-టర్బో-పెట్రోల్ ఇంజన్ 585 PS శక్తిని మరియు 850 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో జతచేయబడి ఉంటుంది. AMG G 63 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడానికి 4.5 సెకన్లు పడుతుంది మరియు ఎలక్ట్రానిక్ లిమిటెడ్ టాప్ స్పీడ్ గంటకు 220 కిలోమీటర్లు. AMG G 63లో ఫోర్ వీల్ డ్రైవ్ (4WD) సిస్టమ్ ను ప్రామాణికంగా అందించారు.

ఇందులో డ్యూయల్ 12.3 అంగుళాల డిస్ ప్లే (ఇన్ఫోటైన్ మెంట్, ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్), 590వాట్ 15 స్పీకర్ల సౌండ్ సిస్టం, సింగిల్ పాన్ సన్ రూఫ్ వంటి ప్రత్యేకతలున్నాయి. తొమ్మిది ఎయిర్ బ్యాగులు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), అడ్వాన్స్ డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి.

ఇది కూడా చూడండి: సంవత్సరం చివరలో కొత్త కారు కొనడం వల్ల కలిగే లాభాలు మరియు నష్టాలు

మహేంద్ర సింగ్ ధోని కొత్త కారు గురించి మీ ఆలోచనలు ఏమిటి? కామెంట్స్ లో తెలియజేయండి.

మరింత చదవండి : మెర్సిడెస్ బెంజ్ G-క్లాస్ ఆటోమేటిక్

was this article helpful ?

Write your Comment on Mercedes-Benz జి జిఎల్ఈ

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience