రెనాల్ట్ వారు తమ యొక్క ఇయోలాబ్ కాన్సెప్ట్ ని 2016 ఆటో ఎక్స్పో లో ప్రదర్శించారు

ఫిబ్రవరి 04, 2016 03:01 pm saad ద్వారా ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

కొనసాగుతున్న డిల్లీ ఆటో ఎక్స్పో అనేక కొత్త వాహనాలతో రెనో వంటి పెద్ద బ్రాండులతో ఎంతో ఉత్తేజకరంగా జరుగుతుంది. ఈ ఫ్రెంచ్ తయారీసంస్థ రెనో తమ యొక్క కాన్సెప్ట్ కారు ఎయోలాబ్ 100Kmpl మైలేజ్ ని అందిస్తున్నదని తెలియజేశారు.

డైరెక్టర్ ఆఫ్ డిజన్ సినర్జీస్ గ్రూప్, మిస్టర్ పాట్రిక్ లెకార్పే ఆటో ఎక్స్పో వద్ద ఈ వాహనం గురించి చెబుతూ ఈ వాహనం 2022 నాటికి రోడ్ల మీదకి రానున్నది మరియు ఇది కేవలం కాన్సెప్ట్ లా మాత్రమే ఉండకుండా ఉత్పాదనం కూడా త్వరలో ప్రారంభించనున్నది. ఫ్రెంచ్ వారి 2 లీటర్ ఇంజిన్ల పైన జరిగిన ప్రాజెక్ట్ పర్యవసానంగా ఈ వాహనం రాబోతుంది. ఈ ఎయోలాబ్ వాహనం కాన్సెప్ట్ ద్వారా 100 అంశాల నవీకరణలను సంస్థ వారు ప్రతిపాదించగా అందులో 20 ఇప్పటికే రెనో మోడల్స్ గా అందుబాటులో ఉన్నాయి. మిగిలిన 60 వరకూ ఉతపాదకాలు రాబోయే 8 నుచి 10 సంవత్సరాలలో రానున్నాయి. అయితే మిగిలిన 20 నవీకరణలు తదుపరి ఎప్పుడు రాబోతున్నాయి అన్నది ఇంకా తేలాల్సి ఉంది అని తెలిపారు.

ఈ ఎయోలాబ్ వాహనం కలిగి ఉన్న కొన్ని నవీకరణ అంశాలు కార్బన్ ఫ్లోర్, చిన్నది మరియు తేలికైనది అయిన సిలెండర్ ఇంజిన్ మెగ్నీషియం రూఫ్ ని కలిగి ఉండబోతుంది. ఈ విధమైన పలుచని మరియు చిన్న ఇంజిన్ ను తయారుచేయడం ద్వారా కారు మొత్తం బరువు 30 శాతం తగ్గడం గమనార్హం. కారు డిజైన్ తీరుతెన్నులు ఏరోడైనమిక్ గా తయారుచేయబడి కారు రూపంలో అనుసంధానమైన గ్రిల్ కలిగి కారు సులువుగా గాలిలో ప్రయాణించేందుకు వీలు కల్పిస్తుంది. కారు చక్రాలకు అమర్చిన ఎయిర్ పాసెస్ ద్వారా అవి ఒంపు తో కూడిన ఆర్చులను కలిగి శరీర భాగంలో కలిసి ఉండబోతున్నాయి. కారు 70 కిలోమీటర్ల వేగం అందుకున్న వెంటనే కారు వెనకాతల అమర్చిన ఫ్కాప్స్ తిరగబడతాయి. ఇది కారు వేగాన్ని నియంత్రించేందుకు ఉపయోగపడుతుంది. ఈ ఎయోలాబ్ వాహనం ఆటోమెటిక్ గేర్బాక్స్ ని మొదటి గేర్ ను ఎలక్ట్రిక్ పవర్ ద్వారా మరియు తరువాతి గేర్లకు గ్యాస్ ద్వారా శక్తిని పొంది వాహనం నడుస్తుంది.   

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience