• English
  • Login / Register

కొత్తదనంతో మళ్ళీ అవతరించిన టొయోటా ఇతియోస్ లీవా

టయోటా ఇతియోస్ లివా కోసం raunak ద్వారా అక్టోబర్ 16, 2015 03:19 pm ప్రచురించబడింది

  • 29 Views
  • 2 వ్యాఖ్యలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

లీవా కి విభిన్న రెండు వర్ణాల కలర్ స్కీము, డైమండ్ కట్ అల్లోయ్ వీల్స్, కొత్త క్యాబిన్ ఫినిష్ మరియూ అప్‌హోల్‌స్ట్రీ అందింది.  దీని పెట్రోల్ వేరియంట్స్ ని రూ. 5.76 లక్షలకు మరియూ డీజిల్ వేరియంట్లని రూ. 6.79 లక్షలకు (ఎక్స్-షోరూం, ఢిల్లీ) కి అందిస్తున్నారు!  

జైపూర్:

టొయోటా కిర్లోస్కర్ మోటర్ వారు పునరుద్దరించిన ఇతియోస్ లీవా ని ఈ పండుగ సందర్భంగా మార్కెట్ లో ప్రవేశపెట్టారు. ఈ వాహనం ఈరోజు నుండి అన్ని డీలర్‌షిప్ లలో దేశ వ్యాప్తంగా అందుబాటులో ఉంటుంది. ఎమిటి కొత్త? పునరుద్దరించిన లీవా ఇప్పుడు డ్యువల్-టోన్ పెయింట్ స్కీం ని రెండు వర్ణాలలో, తెలుపు ఇంకా ఎరుపు, పై కప్పు తప్ప మిగితావి అన్నీ రెండూ విభిన్న రంగులలో తీర్చిదిద్దబడ్డయి. దీనికి నలుపు రంగు గ్రిల్లు, బాహ్యపు అద్దాలు మరియూ రూఫ్ స్పాయిలర్ వంటివి ఉన్నాయి. దీనికి 185/60 క్రాస్-సెక్షన్ 15-అంగుళాల రేడియల్స్ తో కొత్త డైమండ్ కట్ అల్లోయ్ వీల్స్ కలిగి ఉంటాయి. లోపల, కొత్త ఫోక్ వుడ్ ఫినిష్ మరియూ డ్యువల్-టోన్ అప్‌హోల్‌స్ట్రీ ఉంటుంది. 

ఇది కాకుండా, సెగ్మెంట్-ఫర్స్ట్ లక్షణాలు అయిన ప్రామాణిక డ్యువల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, ప్రీ-టెన్షనర్ మరియూ ఫోర్స్ లిమిటర్ ఫ్రంట్ సీట్ బెల్ట్స్ తో పాటుగా బ్లూటూత్ అనుసంధానం ఉన్న ఆడియో సిస్టము కూడా ఉన్నాయి.

 

విడుదల గురించి మాట్లాడుతూ, టొయోటా కిర్లోస్కర్ మోటర్ ప్రైవేట్ లిమిటెడ్ కి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అయిన మిస్టర్. అకితోషి టెకెమురా గారు," ఎప్పటికప్పుడూ జీవన విధానానికి అణుగునంగా మార్పులు తీసుకురావడం మా ప్రధాన లక్ష్యం. పైగా, ఇతియోస్ సీరీస్ కి 'మొస్ట్ ప్రామిసింగ్ బ్రాండ్ 2015" అవార్డు అందడంతో మేము మరింత విశ్వాసంతో ఉన్నాము. ఈ సందర్భంగా మేము మరింతగా ఆనందంగా ఉన్నాము," అని అన్నారు.

సాంకేతికంగా, లీవా కి మార్పులు జరుగలేదు. దీనికి అదే 1.2-లీటర్ పెట్రోల్ మరియూ 1.5-లీటర్ డీజిల్ ఇంజిను కలిగి ఉంటుంది. ఈ 1197cc పెట్రోల్ మోటరు 5600rpm వద్ద 80ps శక్తి ఇంకా 31000rpm వద్ద 104Nm టార్క్ ని విడుదల చేస్తాయి. అదే 1.4-లీటర్ D4 D డీజిల్ ఇంజిను అయితే 3800rpm వద్ద 68ps శక్తిని ఇంకా 1800-2400rpm వద్ద 170Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తాయి. రెండిటికీ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ జత చేయడం అయ్యింది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Toyota ఇతియోస్ లివా

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience