RC-6 భారతదేశానికి MG యొక్క మొదటి సెడాన్ కావచ్చు
ఎంజి ఆర్సి-6 కోసం dhruv attri ద్వారా ఫిబ్రవరి 07, 2020 12:33 pm ప్రచురించబడింది
- 27 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఇది హెక్టర్ SUV వంటి సౌలభ్యం మరియు కనెక్ట్ చేయబడిన లక్షణాలతో ఉంటుంది
- MG RC-6 యొక్క బాహ్య డిజైన్ లో సెడాన్, కూపే మరియు SUV ఎలిమెంట్స్ మిశ్రమం ఉంటుంది.
- ఫీచర్ ముఖ్యాంశాలు LED లైట్లు, సన్‌రూఫ్ మరియు లోపలి భాగంలో కనెక్ట్ చేయబడిన స్క్రీన్‌లు.
- లాక్స్, లొకేషన్ షేరింగ్ మరియు సంగీతాన్ని కంట్రోల్ చేసుకోడానికి కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీని పొందుతుంది.
- ఇది 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ద్వారా 6-స్పీడ్ MT లేదా CVT తో జతచేయబడుతుంది.
- ప్రారంభించినట్లయితే, ఈ కేమ్రీ-పరిమాణ క్రాస్-సెడాన్ ధర కొరోల్లా టెరిటర్రీ (~ 18 లక్షలు) మధ్య ఉంటుందని భావిస్తున్నాము.
MG మోటార్ తన బ్రాండ్‌ను SUV ల ద్వారా స్థాపించుకుంది, అయితే ఆటో ఎక్స్‌పో 2020 లో RC -6 సెడాన్ తో దాని పరిధులను విస్తృతం చేయాలనే ఉద్దేశాలను చూపించింది. RC-6, MG సోదరి సంస్థ బావోజున్ ద్వారా 2019 లో చెంగ్డు మోటార్ షోలో మొదట ప్రదర్శించబడింది.
MG RC-6 అనేది అన్‌కన్వెన్షనల్ వాహనం అని చెప్పవచ్చు, ఇది సెడాన్ బాడీ స్టైల్‌ను కలిగి ఉంటుంది, అయితే కొన్ని SUV లక్షణాలతో మిక్స్ చేయబడి ఉంటుంది. దీని రూఫ్ వెనుక వైపు కూపే లా మనకి కనిపిస్తుంది. పరిమాణం పరంగా, కింది సంఖ్యలు సూచించినట్లు ఇది చాలా పెద్దది.
అస్పెక్ట్ |
చైనా-స్పెక్ MG RC-6 |
హోండా అకార్డ్ |
కేమ్రీ హైబ్రిడ్ |
స్కోడా సూపర్బ్ |
పొడవు |
4925mm |
4933mm |
4885mm |
4861mm |
వెడల్పు |
1880mm |
1849mm |
1840mm |
1864mm |
ఎత్తు |
1580mm |
1464mm |
1455mm |
1483mm |
వీల్బేస్ |
2800mm |
2776mm |
2825mm |
2841mm |
చైనా-స్పెక్ MG RC-6 పొడవు పరంగా అకార్డ్ కంటే కొంచెం వెనుక వెనుకబడి ఉంది, అయితే వెడల్పు మరియు ఎత్తులో, ఇది ఇతరులపై గణనీయమైన ఎడ్జ్ ని కలిగి ఉంది. ఇది చాలా విస్తృతమైన వీల్‌బేస్ కలిగి ఉంది, కాని ఇది కేమ్రీ కంటే 25mm తక్కువ మరియు సూపర్బ్ కంటే 41mm తక్కువ ఉంటుంది. కానీ, దాని యొక్క ప్రధనాంశం ఏమిటంటే 198mm గ్రౌండ్ క్లియరెన్స్, ఇది దాని సెడాన్ ప్రత్యర్థుల కంటే మెరుగ్గా ఉండడమే కాకుండా, SUV వంటి గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంటుంది.
MG RC-6 ఒక హెక్టర్ లాంటి భారీ, నలుపు, చిల్లులు గల గ్రిల్‌ను DRL లతో LED హెడ్‌లైట్‌లతో చుట్టుముట్టబడి ఉంటుంది. వెనుక వైపున, ఇది టెయిల్ గేట్ ద్వారా విభజించబడిన సైడ్-స్వీప్డ్ టెయిల్ లైట్లను పొందుతుంది.
లక్షణాల పరంగా, ఇది సన్‌రూఫ్, ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ మరియు ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం రెండు కనెక్ట్ చేసిన స్క్రీన్లు, ఫ్లాట్-బాటమ్డ్ స్టీరింగ్ వీల్, లెథరెట్ టచ్‌పాయింట్లు మరియు కాంట్రాస్ట్ స్టిచింగ్‌ను పొందుతుంది. ఇది కనెక్ట్ చేయబడిన కార్ టెక్‌ను పొందుతుంది, ఇది రియల్ టైమ్ లొకేషన్ షేరింగ్, రిమోట్ లాక్, అలాగే AC, విండోస్, సన్‌రూఫ్ మరియు సంగీతాన్ని నియంత్రించడానికి వాయిస్ కమాండ్‌తో పాటు అన్‌లాక్ ని కూడా కలిగి ఉంటుంది.
MG RC-6 1.5-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ద్వారా పవర్ ని అందుకుంటుంది, ఇది 147Ps / 245Nm ను అందిస్తుంది. ట్రాన్స్మిషన్ ఎంపికలలో 6-స్పీడ్ మాన్యువల్ మరియు CVT ఉన్నాయి.
ఈ ఏడాది అయినా కనీసం MG, SUV లపై దృష్టి పెట్టాలని ఆశిస్తున్నాము. కాబట్టి RC -6 యొక్క MG కౌంటర్ 2021 లో ఎప్పుడైనా భారతదేశంలో లాంచ్ అవుతుందని ఆశిస్తున్నాము. ఈ స్కోడా సూపర్-సైజ్ సెడాన్ దాని పోటీ కంటే తక్కువ ఉంటూ రూ.20 లక్షల ధర రేంజ్ ని కలిగి ఉండే అవకాశం ఉంది.
0 out of 0 found this helpful