• English
  • Login / Register

ప్రారంభం అయిన MG కామెట్ EV ఉత్పత్తి

ఎంజి కామెట్ ఈవి కోసం tarun ద్వారా ఏప్రిల్ 17, 2023 01:29 pm ప్రచురించబడింది

  • 30 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఈ చిన్న అర్బన్ EV 300 కిలోమీటర్‌ల వరకు మైలేజ్‌ను అందిస్తుందని అంచనా 

MG Comet EV

  • కామెట్ EV మొదటి యూనిట్ MG గుజరాత్ ప్లాంట్ నుండి బయటకు వచ్చింది. 

  • ఇది రెండు-డోర్‌ల కాంపాక్ట్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్, నలుగురికి సరిపడే సీటింగ్ సామర్ధ్యం ఉంది. 

  • దీనిలో ఇన్ఫోటైన్మెంట్ మరియు క్లస్టర్ కోసం 10.25-అంగుళాల డ్యూయల్ డిస్ప్లేలు ఉంటాయి; వెనుక కెమెరా మరియు ESCని కూడా ఆశించవచ్చు. 

  • రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో, 300 కిలోమీటర్‌ల పరిధితో అందించవచ్చు. 

  • ధర రూ.10 లక్షల నుండి రూ.15 లక్షల (ఎక్స్-షోరూమ్) పరిధిలో ఉంటాయని అంచనా. 

గుజరాత్ؚలో తమ హలోల్ కర్మాగారంలో కామెట్ EV ఉత్పత్తిని MG ప్రారంభించింది. ఈ కారు తయారీదారు నుండి వస్తున్న సరికొత్త మైక్రో ఎలక్ట్రిక్ హ్యాచ్ؚబ్యాక్ ఏప్రిల్ 19న విడుదల కానుంది. ప్రీమియం ఇంటీరియర్ؚను చూపిస్తున్న దీని టీజర్‌లు ఇప్పటికే విడుదల అయ్యాయి.

MG Comet EV

ఈ కారు తయారీదారు GSEV ప్లాట్ఫార్మ్‌పై కామెట్ EVని నిర్మిస్తున్నారు, MG తోటి బ్రాండ్‌ల గ్లోబల్ మోడల్‌లకు కూడా ఇదే ఆధారం. ఇది ఒక నిటారైన హ్యాచ్ؚబ్యాక్, చిన్న వీల్స్ మరియు క్వాడ్రి సైకిల్ (టాటా నానో కంటే చిన్నవి) ఫుట్ ప్రింట్ؚతో, 4 సీటింగ్ మరియు 2 డోర్‌లతో వస్తుంది. 

ఇది కూడా చదవండి: Q2 2023లో విడుదల అవుతాయని ఆశిస్తున్న టాప్ 10 కార్‌ల వివరాలు

ఎలక్ట్రిక్ హ్యాచ్ ప్రీమియం క్యాబిన్‌లో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ మరియు డ్రైవర్ డిస్ప్లే కోసం 10.25-అంగుళాల డ్యూయల్ డిస్ప్లేలు, మాన్యువల్ AC మరియు కనెక్టెడ్ కార్ సాంకేతికత ఉన్నాయి. డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్ؚలు, రేర్ పార్కింగ్ కెమెరా మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC)లు భద్రతా ఫీచర్లుగా ఉంటాయి అని ఆశిస్తున్నాము. 

MG Comet EV

కామెట్ EVలాగే కనిపించే ఇండోనేషియన్ వెర్షన్ వూలింగ్ ఎయిర్ EVని 17.3kWh మరియు 26.7kWh బ్యాటరీ ప్యాక్ؚలతో అందిస్తున్నారు, ఇవి వరుసగా 200 కిలోమీటర్‌ల మరియు 300కిలోమీటర్‌ల పరిధిని అందిస్తాయి. భారతదేశంలో ఏ బ్యాటరీ ప్యాక్ؚను అందిస్తారో చూడాలి. కామెట్ EV 40PSగల ఏకైక రేర్-మౌంటెడ్ మోటార్ؚను పొందవచ్చు. 

ఇది కూడా చదవండి: భారతదేశంలో త్వరలోనే రానున్న ఎలక్ట్రిక్ కార్‌ల వివరాలు

MG కామెట్ EV ధర రూ.10 లక్షల నుండి రూ.15 లక్షల (ఎక్స్-షోరూమ్) పరిధిలో ఉంటుందని అంచనా. ఈ ధరలో ఇది ప్రధానంగా సిట్రోయెన్ eC3, టాటా టియాగో EVలతో పోటీ పడుతుంది. అయితే, తన పోటీదారులతో పోలిస్తే ఇది చాలా చిన్న వాహనం.

was this article helpful ?

Write your Comment on M g కామెట్ ఈవి

explore మరిన్ని on ఎంజి కామెట్ ఈవి

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది ఎలక్ట్రిక్ కార్లు

  • పాపులర్
  • రాబోయేవి
×
We need your సిటీ to customize your experience