పోర్ష్ బ్రాండ్ యొక్క కొత్త షోరూమ్ ను మే 30, 2015 న కోలకత్తా లో తెరిచేందుకు సన్నాహాలు జరుపుతున్నారు.
మే 29, 2015 05:17 pm sourabh ద్వారా ప్రచురించబడింది
- 17 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్: భారతదేశంలో, పోర్స్చే దాని యొక్క ఐదవ షోరూమ్ తెరవడానికి నిర్ణయించుకుంది. స్టట్గార్ట్ కి చెందిన లగ్జరీ స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ అయిన ఈ పోర్స్చే కోలకత్తా లో దాని ఐదవ కొత్త షోరూమ్ ను మే 30, 2015 న తెరవబోతున్నారు. దీని నాలుగు షోరూమ్లు ముంబై, గుర్గాన్, బెంగుళూర్ మరియు అహ్మదాబాద్ లో ఉండగా దీని యొక్క ఐదవ షోరూమ్ ను కోలకత్తా నగరంలో, టాప్సియా రోడ్ సమీపంలో తెరవబోతున్నారు.
కోలకత్తా లో ఉన్న ఈ షోరూమ్ 5,952 చదరపు అడుగుల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది, అంతేకాకుండా ఈ పోర్స్చే షోరూమ్ ఏడు మోడల్స్ ను ప్రదర్శించడానికి పుష్కలమైన స్థలాన్ని కూడా కలిగి ఉంది. తయారీదారుడు విషయానికి వస్తే, ఈ షోరూమ్ ను నిర్మించడానికి రెండు సంవత్సరాల కాలం పట్టింది మరియు ఈ పోర్స్చే షోరూమ్ అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా రూపొందించబడింది.
పోర్స్చే ఐదవ షోరూమ్ అయిన కోలకత్తా సెంటర్ లో ఒక ఫిట్టింగ్ లాంజ్ ను అమర్చారు మరియు అనేక అంశాలను కలిగి ఉంది. దీని వలన వినియోగదారుల వారి అవసరాలు ప్రకారం కారు ను ఆకృతీకరించేందుకు అనుమతిస్తుంది. కోలకత్తా లో దీని ఉనికి, భారతదేశం యొక్క తూర్పు భాగంలో పోర్స్చే బ్రాండ్ విస్తరించేలా కనిపిస్తోంది.
భారతదేశంలో పోర్స్చే యొక్క డైరెక్టర్ అయిన అనిల్ రెడ్డి, కోలకత్తా సెంటర్ లో ఉన్న పోర్స్చే షోరూమ్, వినియోగదారులకు మరియు ఉత్సాహికుల కోసం కొత్త, సమకాలీన గమ్యస్థానం "అన్నారు. ఈ షోరూమ్, కొనుగోలుదారుల మొదటి పరిచయం నుండి అసాధారణమైన మరియు చిరస్మరణీయ యాజమాన్యపు అనుభవాన్ని అందిస్తుంది అని చెబుతున్నారు. అంతేకాకుండా, ఈ అద్భుతమైన రిటైల్ ల్యాండ్మార్క్ భారతీయ మార్కెట్లో పోర్స్చే యొక్క నిరంతర అంకితభావాన్ని ప్రదర్శిస్తుంది.