• English
  • Login / Register

విక్రయాలలో ఒక లక్ష యూనిట్‌ల మార్క్‌ను దాటిన టాటా హ్యారీయర్

టాటా హారియర్ 2019-2023 కోసం ansh ద్వారా మే 22, 2023 12:34 pm ప్రచురించబడింది

  • 42 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఇది ల్యాండ్ రోవర్-అభివృద్ధి చేసిన ప్లాట్ؚఫార్మ్‌పై ఆధారపడిన మొదటి టాటా SUV మరియు జనవరి 2019లో మార్కెట్ؚలోకి ప్రవేశించింది 

Tata Harrier

  • విడుదల అయినప్పటి నుండి, హ్యారియర్ SUV 170PS పవర్ 2-లీటర్ డీజిల్ ఇంజన్ؚను కలిగి ఉంది.

  • మొదటి సంవత్సరంలో మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ؚను మాత్రమే కలిగి ఉంది, 2020లో ఆటోమ్యాటిక్ ఎంపికను జోడించారు.

  • 10.25-అంగుళాల ఇన్ఫోటైన్ؚమెంట్ సిస్టమ్, వైర్ؚలెస్ ఫోన్ ఛార్జింగ్ మరియు పనోరమిక్ సన్ؚరూఫ్ వంటి ఫీచర్‌లను కలిగి ఉంది.

  • ఫార్వర్డ్-కొలిజన్ వార్నింగ్, బ్లైండ్-స్పాట్ మానిటరింగ్ మరియు అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి ADAS ఫీచర్‌లను కలిగి ఉంది.

  • హ్యారియర్ ప్రస్తుత ధర రూ.15 లక్షల నుండి రూ.24.07 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.

2019లో విడుదలైన టాటా హ్యారియర్ ఎన్నో అంచనాలతో వచ్చింది, ఎందుకంటే ఇది లగ్జరీ ఆఫ్-రోడర్‌ల రారాజు అయిన ల్యాండ్ రోవర్ నుండి అభివృద్ధి చేసిన OMEGA ఆర్క్ ప్లాట్ؚఫార్మ్‌పై ఆధారపడి, ఈ బ్రాండ్ నుంచి విడుదలైన మొదటి SUV. అప్పటి నుండి, మంచి పేరును మరియు ప్రజాదరణను పొందింది. నాలుగు సంవత్సరాల తర్వాత, 1 లక్ష-యూనిట్ అమ్మకాలతో టాటా SUV కొత్త మైలురాయిని చేరుకుంది.

పవర్ؚట్రెయిన్

Tata Harrier Automatic Transmission

హ్యారియర్‌ను 2019 నుండి సింగిల్ ఇంజన్ ఎంపికతో అందిస్తున్నారు: 170PS పవర్ మరియు 350Nm టార్క్‌ను అందించే 2-లీటర్ డీజిల్ ఇంజన్. ఇది 6-స్పీడ్‌ల మాన్యువల్ؚతో మాత్రమే పరిచయం అయ్యింది, తరువాత 6-స్పీడ్‌ల ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ ఎంపికను పొందింది. 2024లో అందుకోబోయే నవీకరణతో పెట్రోల్ ఎంపికను కూడా పొందవచ్చు.

ఫీచర్‌లు & భద్రత

Tata Harrier Red Dark Edition Cabin

పవర్‌ట్రెయిన్ కాకుండా ఇందులో అందించే ఫీచర్‌ల వివరాలను చూద్దాం. ఈ SUV నిజానికి విలక్షణంగా కనిపించే 8.8-అంగుళాల ఫ్రీ-స్టాండింగ్ టచ్ؚస్క్రీన్ ఇన్ఫోటైన్ؚమెంట్ సిస్టమ్, 7-అంగుళాల డిస్ప్లేతో సెమీ-డిజిటల్ క్లస్టర్, JBL సౌండ్ సిస్టమ్, ఆటో AC మరియు టెర్రైన్ మోడ్ؚలతో వచ్చింది. అప్పటి నుండి, ప్రత్యేక ఎడిషన్‌ల రూపంలో అనేక ఫీచర్ అప్ؚడేట్ؚలను అందుకుని, ప్రస్తుతం మరింత ఎక్కువ ప్రీమియం క్యాబిన్ؚను అందిస్తున్నారు. ప్రస్తుతం హ్యారియర్‌లో అండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ ప్లేలతో 10.25-అంగుళాల టచ్ؚస్క్రీన్ ఇన్ఫోటైన్ؚమెంట్ సిస్టమ్, 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, పనోరమిక్ సన్ؚరూఫ్, మెమరీ, వెల్కమ్ ఫంక్షన్ మరియు వైర్ؚలెస్ ఫోన్ ఛార్జింగ్ؚతో సిక్స్-వే పవర్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్‌లను అందిస్తున్నారు.

ఇది కూడా చదవండి: 2 సంవత్సరాల కంటే తక్కువ సమయంలో 2 లక్షల ఉత్పత్తి మైలురాయిని దాటిన టాటా పంచ్

భద్రత విషయానికి వస్తే ఇందులో ఆరు వరకు ఎయిర్ బ్యాగ్ؚలు, EBDతో ABS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం (ESP), 360-డిగ్రీల కెమెరా, హిల్-హోల్డ్ మరియు హిల్-డిసెంట్ కంట్రోల్ؚలను అందిస్తుంది. ఈ భద్రత ఫీచర్‌లు మాత్రమే కాకుండా కొన్ని హ్యారియర్ వేరియెంట్‌లలో ఫార్వర్డ్-కొలిజన్ వార్నింగ్, ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్ మరియు బ్లైండ్-స్పాట్ మానిటరింగ్ వంటి ADAS ఫంక్షనాలిటీలు కూడా ఉన్నాయి.

ధర & పోటీదారులు

Tata Harrier

హ్యారియర్ ధరను రూ.15 లక్షల నుండి రూ.24.07 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య టాటా నిర్ణయించింది. విడుదల సమయంలో, టాప్-స్పెక్ మాన్యువల్ ఎంపిక ధర రూ.16.25 లక్షలుగా ఉండగా, ప్రస్తుతం టాప్-స్పెక్ మాన్యువల్ ధర రూ.21.77 లక్షలుగా (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ఉంది. మహీంద్రా XUV700, MG హెక్టార్, జీప్ కంపాస్ మరియు హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ؚల టాప్-స్పెక్ వేరియెంట్ؚలతో హ్యారియర్ పోటీ పడుతుంది.

ఇక్కడ మరింత చదవండి: హ్యారియర్ డీజిల్ 

was this article helpful ?

Write your Comment on Tata హారియర్ 2019-2023

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience