నిస్సాన్ నుండి కియా సోనెట్ కి మారుతి విటారా బ్రెజ్జా కి ప్రత్యర్థి 2020 మధ్యలో లాంచ్ అవ్వనున్నది

నిస్సాన్ మాగ్నైట్ కోసం sonny ద్వారా ఫిబ్రవరి 14, 2020 12:16 pm ప్రచురించబడింది

  • 76 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఇది ఆటో ఎక్స్‌పో 2020 లో అడుగుపెట్టిన రెనాల్ట్-నిస్సాన్ యొక్క కొత్త 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ద్వారా పవర్ ని అందుకుంటుంది.

  •  నిస్సాన్ EM 2 మరియు రెనాల్ట్ HBC తమ ప్లాట్‌ఫామ్‌ను ట్రైబర్‌ తో పంచుకోనున్నాయి.
  •  రెనాల్ట్-నిస్సాన్ యొక్క కొత్త 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ద్వారా పవర్ ని అందుకుంటాయి. 
  •  తాజా EM2 టీజర్ కనెక్ట్ చేయబడిన టైలాంప్ డిజైన్ లేకుండా LED టెయిల్ ల్యాంప్స్ ని వెల్లడిస్తుంది.
  •  నిస్సాన్ యొక్క సబ్ -4m SUV ని సెప్టెంబర్ 2020 నాటికి విడుదల చేయనున్నారు.  

Nissan’s Kia Sonet, Maruti Vitara Brezza Rival To Launch Around Mid-2020

భారతీయ ఫోర్-వీల్ పరిశ్రమలో సబ్ -4m SUV విభాగం అత్యంత ప్రాచుర్యం పొందింది, అందుకనే ఎక్కువ మంది తయారీదారులు ఈ రంగంలోకి దిగారు. ఇప్పుడు, నిస్సాన్ తన కొత్త కారు కోడ్‌నేం EM2 ని కూడా బరిలోకి దింపాలని చూస్తోంది.   

EM2 మొదట జనవరిలో ప్రకటించబడింది మరియు ఇప్పుడు నిస్సాన్ EM2 యొక్క LED టెయిల్ ల్యాంప్ ద్వారా మరొక టీజర్‌ను విడుదల చేసింది. టీజర్ దాని ప్రక్కభాగం చుట్టుకునే స్ప్లిట్ డిజైన్‌ను కలిగి ఉంటుందని సూచిస్తుంది. బూట్లిడ్‌లోకి విస్తరించేటట్టు లేనందున కనెక్ట్ చేయబడిన టైల్‌ల్యాంప్‌ల ధోరణిని ఇది మార్చినట్టు కనిపిస్తోంది. నిస్సాన్ సబ్ -4m SUV యొక్క మొదటి టీజర్ కిక్స్ మాదిరిగానే స్పోర్టి ప్రొఫైల్‌లో ఉన్నట్టు తెలుస్తుంది.

Nissan’s Kia Sonet, Maruti Vitara Brezza Rival To Launch Around Mid-2020

నిస్సాన్ EM2 మరియు రెనాల్ట్ యొక్క రాబోయే సబ్-4m SUV కోడ్‌నేం తో ఉన్న HBC కూడా, వారి ప్లాట్‌ఫామ్‌ను రెనాల్ట్ ట్రైబర్‌తో పంచుకుంటాయి. ఆటో ఎక్స్‌పో 2020 లో అడుగుపెట్టిన రెనాల్ట్-నిస్సాన్ యొక్క కొత్త 1.0-లీటర్ TCe 100 టర్బో-పెట్రోల్ ఇంజన్ దీనికి పవర్ ని ఇస్తుంది. నిస్సాన్ మైక్రా మరియు రెనాల్ట్ క్లియో వంటి కార్లతో ఈ ఇంజన్ యూరప్‌ లో లభిస్తుంది. ఇది  రెండు ట్యూన్ లలో లభిస్తుంది: 5-స్పీడ్ మాన్యువల్‌ తో 100Ps మరియు 160Nm మరియు CVT తో పాటు 6-స్పీడ్ మాన్యువల్‌ తో మరింత శక్తివంతమైన 117Ps మరియు 180Nm (+ 20Nm ఓవర్‌బూస్ట్). CVT ఆప్షన్‌ తో పాటు భారతదేశంలో 117Ps వెర్షన్‌ ను నిస్సాన్ అందిస్తుందని భావిస్తున్నాము.

Renault’s 1.0-litre Turbo-Petrol Engine Showcased At Auto Expo 2020

లక్షణాల విషయానికొస్తే, నిస్సాన్ EM2 లో కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీ (ఒక యాప్ ద్వారా క్యాబిన్ ప్రీ-కూల్ వంటి రిమోట్ ఆపరేషన్‌ను అందిస్తుంది), 8-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు నాలుగు ఎయిర్‌బ్యాగులు ఉంటాయి. సెంట్రల్ డిస్‌ప్లేలో ప్రదర్శించబడే కారు యొక్క 360-డిగ్రీల వీక్షణ కోసం ఇది చుట్టూ వ్యూ- మానిటర్‌ను కూడా పొందవచ్చు.    

 హ్యుందాయ్ వెన్యూ, ఫేస్‌లిఫ్టెడ్ మరియు పెట్రోల్-మాత్రమే ఉండే మారుతి విటారా బ్రెజ్జా, మహీంద్రా XUV 300, టాటా నెక్సాన్, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ మరియు రాబోయే కియా సోనెట్ వంటి వాటితో పోటీ పడడానికి నిస్సాన్ 2020 సెప్టెంబర్ నాటికి తన సబ్ -4m SUV ని విడుదల చేయనుంది. దీని ధర రూ .7 లక్షల నుంచి రూ .11 లక్షల మధ్య ఉంటుంది.  

మరింత చదవండి: విటారా బ్రెజ్జా AMT

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన నిస్సాన్ మాగ్నైట్

Read Full News
Used Cars Big Savings Banner

found ఏ కారు యు want నుండి buy?

Save upto 40% on Used Cars
  • quality వాడిన కార్లు
  • affordable prices
  • trusted sellers

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

కార్ వార్తలు

  • ట్రెండింగ్ వార్తలు
  • ఇటీవల వార్తలు

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience