• English
    • Login / Register

    నిస్సాన్ పైలేటెడ్ డ్రైవ్ కోసం ఆన్-రోడ్ పరీక్షలు మొదలవుతాయి

    నవంబర్ 03, 2015 04:26 pm bala subramaniam ద్వారా ప్రచురించబడింది

    19 Views
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    చెన్నై:

    Nissan Leaf

    2020 నాటికి రోడ్లపై స్వతంత్ర వాహనాలు పెట్టాలనే దృష్టితో, నిస్సాన్ తన తొలి ప్రోటోటైప్ వాహనం పైలేటెడ్ డ్రైవ్ యొక్క ఆన్-రోడ్ పరీక్షను జపాన్ యొక్క హైవేలు మరియు నగరం/పట్టణం రెండు రోడ్లపై ప్రారంభించారు. నిస్సాన్ లీఫ్ ఎలక్ట్రిక్ వాహనం ఆధారిత ప్రోటోటైప్ వెహికల్ ని, ప్రజా ఉపయోగం కోసం నిస్సాన్ ఇంటెలిజెంట్ డ్రైవింగ్ పెంపొందించుకునేందుకు రహదారి మరియు నగరం రోడ్లు రెండిటిపైన అసలు ట్రాఫిక్ పరిస్థితుల్లో పరీక్షలు చేయబడుతుంది. ఈ కారు మిల్లిమీటర్ వేవ్ రాడార్, లేజర్ సెన్సార్లు, కెమెరాలు, హై-స్పీడ్ కంప్యూటర్ చిప్స్ మరియు ఒక ప్రత్యేక హెచ్ఎంఐ (హ్యూమన్ మెషిన్ ఇంటర్ఫేస్) వంటి అంశాలను కలిగి ఉంది.

    Nissan Leaf

    నగరం రోడ్లపై పైలేటెడ్ డ్రైవ్ సాధ్యం చేయడానికి, సూక్ష్మ హై స్పెక్ లేజర్ స్కానర్ మరియు 8-వే 360-డిగ్రీ వీక్షణ కెమెరా వ్యవస్థ వంటి రెండు టెక్నాలజీలను ఉపయోగిస్తుంది. ఈ లేజర్ స్కానర్ త్రీ -డైమెన్షనల్ కొలత ఉపయోగించడం ద్వారా వాహనం మరియు దాని పరిసరాల మధ్య దూరం లెక్కిస్తుంది. విభజన రోడ్లు మరియు పదునైన రోడ్లపై డ్రైవింగ్ చెసేటప్పుడు కెమెరా వ్యవస్థ ఖచ్చితమైన రూటింగ్ నిర్ణయాలు అందిస్తుంది.

    Nissan Leaf

    "మేము నిస్సాన్ వద్ద స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించడానికి మరియు పైలేటెడ్ డ్రైవ్ అమలు చేసేందుకు ఉన్నాము. మేము ఈ లక్ష్య పరిపూర్ణత వైపు ఎంత దగ్గరగా ఉన్నామో నిరూపించేందుకు ఇక్కడ ప్రోటోటైప్ ని పరిచయం చేస్తున్నాము. నిస్సాన్ ఎల్లపుడూ సురక్షితమైన డ్రైవింగ్ కొరకు పాటు పడుతుంది. ఈ విషయాలలో పైలేటెడ్ డ్రైవింగ్ ద్వారా ముందు ఉంటుందని ఆశిస్తున్నాము." అని నిస్సాన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ టాకో అసామి తెలిపారు.

    మొదటి దశగా నిస్సాన్ భారీ హైవే ట్రాఫిక్ పరిస్థితుల్లో స్వయంప్రతిపత్తి డ్రైవింగ్ కోసం జపాన్ లో 2016 నాటికి "పైలెటెడ్ డ్రైవ్ 1.0" అందించే ప్రణాళికలో ఉంది. 2018 నాటికి రహదారులపై లేన్ మార్పులు కొనసాగించడానికి ఒక బహుళ లైన్ల పైలేటెడ్ డ్రైవ్ ని అమలు చేయాలని ఆశిస్తుంది. 2020 నాటికి, ఒక కొత్త టెక్నాలజీ ని వాహనాలు విజయవంతంగా నగరం / పట్టణ రోడ్లపై నిర్వహించడానికి పరిచయం చేస్తుంది.

    was this article helpful ?

    Write your Comment on Nissan లీఫ్

    ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

    • లేటెస్ట్
    • రాబోయేవి
    • పాపులర్
    ×
    We need your సిటీ to customize your experience