జీటీ అకాడమీ అర్హత సంపాదించే ప్రక్రియను నిస్సాన్ ఆన్లైన్ లో ప్రారంభించింది
నిస్సాన్ జిటిఆర్ కోసం anonymous ద్వారా జూన్ 03, 2015 02:26 pm ప్రచురించబడింది
- 11 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జీటీ అకాడమీ యొక్క ఏడవ సీజను కొరకు నిస్సాన్ ఆన్లైన్ లో నమోదు చేసుకునే అవకాశాన్ని భారత్దేశం యొక్క గేమర్స్ కోసమై ప్రవేశ పెట్టింది. రిజిస్ట్రేషన్లు జూను 2, 2015 నుండి ప్రరంభం అవుతాయి మరియూ ప్రత్యక్ష ఈవెంట్స్ జూను 5,2015 నుండి మొదలవుతాయి. మీరు నిస్సాన్ ప్లేస్టేషన్ జీటీ అకాడమీ యొక్క వీరాభిమాని అయినా లేదా వెర్రి ఆటగాడు అయినా సరే మీ ప్లే ష్టేషన్ 3 సోనీ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్ అకౌంట్ ద్వారా ఆన్లైన్ లో గ్రాండ్ త్యురిస్మో 6 ని ఆడి అధిక స్కోర్ ని చేయండి.
లైవ్ ఈవెంట్లో పాల్గొనాలని ఆశక్తి ఉన్న ఆటగాళ్ళు ఈరోజు నుండే నమోదు చేసుకోవచ్చు. ఈ ఈవెంట్లు డిల్లీ లో మొదలై,ముంబై, బెంగుళూరు మరియూ చెన్నైలలో జరుగుతాయి. ఆన్లైన్ ప్రత్యర్ధులకి నిస్సాన్ జీటీ-ఆర్ ఎలెం నిస్మో ని లెజెండరి సర్క్యూట్ డె లా సర్తె గుండా, మరియూ లె మన్స్ 24 ఆర్ ఎండ్యురన్స్ రేస్ ద్వారా నడిపించ వలసి వస్తుంది. ఈ గేంలో అసలు కార్ మరియూ ట్రాక్ ని అచ్చుగుద్దినట్టుగా చూడవచ్చు. జీటీ అకాడెమీ 2015 కాంపెటీషను వైయా జీటీ6 పోటీకి నమోదు చేసుకొనేందుకు ఇంకా రెండే వారాలు మిగిలి ఉండగా, ఈ ఆన్లైన్ లాప్లలో ఆడి ఆట తీరుని మెరుగు పరుచుకోవాలని సూచన.
ఆన్లైన్ క్వాలిఫైయింగ్ కాంపెటీషను యొక్క ఆఖరి రౌండ్ జూను 2, మంగళవారం మొదలయ్యి 16,జూను వరకు కొనసాగుతుంది. రియల్ మరియూ ఆన్లైన్ ప్రత్యార్ధులలో నుండి మొదటి పది వేగవంతమైన వ్యక్తులను ఎన్నుకుంటారు. వీరు జూను,2015 లో జాతీయ ఫినల్స్ లో తలపడనున్నారు. ఇందులో నుండి ఆరుగురు జీటీ అకాడెమీ ఆసియా లో పాల్గొనేందుకు ప్రసిద్ది చెందిన సిల్వర్ స్టోన్ రేస్ క్యాంప్ కి పంపించబడతారు. ఇందులో థాయ్ ల్యాండ్, జపాన్, ఇండొనేషియా మరియూ ఫిలిప్పీన్స్ నుండి పోటీ పడేందుకు వస్తారు. ఇందులో గెలిచిన వారికి జనవరి 2016 లో జరిగే దుబాయ్ 24 గంటల రేసులో పాల్గొనే అవకాశం గెలుచుకుంటారు.