నిస్సాన్ కిక్స్ Vs హ్యుందాయ్ క్రెటా: వేరియంట్స్ పోలిక

published on ఏప్రిల్ 20, 2019 02:05 pm by dinesh for నిస్సాన్ కిక్స్

 • 20 సమీక్షలు
 • ఒక వ్యాఖ్యను వ్రాయండి

kicks vs creta

నిస్సాన్ భారతదేశం లో తాజా కాంపాక్ట్ SUV, కిక్స్ ని రూ. 9.55 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) వద్ద ప్రారంభించింది. ఈ కిక్స్ చాలా లక్షణాలను కలిగి ఉంటూ మరియు లుక్స్ పరంగా చాలా రిచ్ గా కనిపిస్తుంది. ఇది హ్యుండాయ్ క్రెటా, మారుతి S- క్రాస్ మరియు రెనాల్ట్ కాప్టర్ వంటి SUV లతో పోటీపడుతుంది. పేపర్ మీద సెగ్మెంట్ నాయకుడైన క్రెటాకు వ్యతిరేకంగా ఏ విధంగా పోటీ చేస్తుందో చూద్దాము.

 

కొలతలు

 

నిస్సాన్ కిక్స్

హ్యుందాయ్ క్రెటా

పొడవు

4384mm

4270mm

వెడల్పు

1813mm

1780mm

ఎత్తు

1656mm (రూఫ్ రెయిల్స్ తో)

1665mm (రూఫ్ రెయిల్స్ తో)

వీల్బేస్

2673mm

2590mm

 •  నిస్సాన్ కిక్స్ హ్యుందాయ్ క్రెటా కంటే పొడవైనది మరియు వెడల్పుగా ఉంటుంది. ఇది కూడా పెద్ద వీల్ బేస్ ని కలిగి ఉంటుంది.
 •  పెద్ద పెద్ద పరిమాణాలు హ్యుందాయ్ క్రెటా కంటే కిక్స్ ని మరింత విశాలమైనదిగా చేస్తుంది. అది నిజమో కాదో తెలుసుకోవడానికి కిక్స్ యొక్క మా పూర్తి స్థాయి రహదారి పరీక్ష కోసం వేచి ఉండండి.

ఇంజిన్

పెట్రోల్:

Nissan Kicks


 

నిస్సాన్ కిక్స్

హ్యుందాయ్ క్రెటా

ఇంజిన్

1.5-లీటర్

1.6-లీటర్

పవర్

106PS

123PS

టార్క్

142Nm

151Nm

ట్రాన్స్మిషన్

5 MT

6MT/ 6AT

 • క్రెటా ఒక పెద్ద పెట్రోల్ ఇంజన్ ని కలిగి ఉంది. ఇది మరింత శక్తివంతమైనది మరియు మరింత టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది.
 • కిక్స్ 5-స్పీడ్ MT తో మాత్రమే లభిస్తుంది. మరోవైపు, క్రెటా 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికలను కలిగి ఉంటుంది.

డీజిల్:

2018 Hyundai Creta


 

నిస్సాన్ కిక్స్

హ్యుందాయ్ క్రెటా

ఇంజిన్

1.5-లీటర్

1.4- లీటర్ /1.6-లీటర్

పవర్

110PS

90PS/128PS

టార్క్

240Nm

220Nm/260Nm

ట్రాన్స్మిషన్

6MT

6MT/ 6AT

.కిక్స్ 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ తో అందుబాటులో ఉండగా, క్రెటా రెండు డీజిల్ ఇంజిన్ ఎంపికలతో లభిస్తుంది: 1.4-లీటర్లు మరియు 1.6 లీటర్ యూనిట్లు.  

.కిక్స్ '1.5 లీటర్ యూనిట్ హ్యుండాయ్ యొక్క 1.4-లీటర్ యూనిట్ కంటే 20Ps శక్తిని/ 20Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది, కానీ 1.6 లీటర్ యూనిట్ కంటే 18Ps శక్తిని / 20Nm టార్క్ ని తక్కువ ఉత్పత్తి చేస్తుంది.

.కిక్స్ ఒక 6-స్పీడ్ MT తో మాత్రమే లభిస్తుంది. క్రెటా 6 స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో కూడిన పెద్ద డీజిల్ మోటర్ తో అమర్చబడి ఉంటుంది. అయితే, 1.4 లీటర్ మోటార్ 6-స్పీడ్ MTతో మాత్రమే కలిగి ఉంటుంది.

వేరియంట్స్ : మేము రెండు కాంపాక్ట్ SUVల యొక్క ఒకే విధమైన ధరలు కలిగినటువంటి వేరియంట్స్ ని పోల్చి చూసాము (ధరల వ్యత్యాసం రూ. 50,000).

పెట్రోల్:

నిస్సాన్ కిక్స్ XL Vs హ్యుందాయ్ క్రెటా E

నిస్సాన్ కిక్స్ XL

రూ. 9.55 లక్షల

హ్యుందాయ్ క్రెటా E +

రూ. 9.50 లక్షలు

తేడా

రూ .5,000 (కిక్స్ ఎక్కువ ఖరీదైనది)

సాధారణ లక్షణాలు:

భద్రత: డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్, EBD తో ABS, ఇంపాక్ట్ సెన్సింగ్ డోర్ అన్లాక్, డ్రైవర్ సీట్ బెల్ట్ రిమైండర్ మరియు ప్రీ-టెన్ష్నర్ తో ఫ్రంట్ సీట్ బెల్ట్స్ మరియు లోడ్ లిమిటర్.

బాహ్యభాగాలు: బాడీ-రంగు బంపర్స్ మరియు డోర్ హ్యాండిల్స్, హాలోజెన్ హెడ్ల్యాంప్స్

Nissan Kicks

సౌకర్య లక్షణాలు: ఫ్రంట్ సెంటర్ ఆరంరెస్ట్, అన్ని నాలుగు పవర్ విండోస్, మాన్యువల్ డే / నైట్ IRVM, టిల్ట్ అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, అడ్జస్టబుల్ ఫ్రంట్ హెడ్‌రేస్ట్లు మరియు వెనుక A.C వెంట్స్.   

క్రెటా E పైన కిక్స్ XL అందించే లక్షణాలు: రేర్ పార్కింగ్ కెమేరా,కో-ప్యాసింజర్ సీటు బెల్ట్ రిమైండర్, రియర్ డీఫాగర్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, LED DRLS,ORVM లపై టర్న్ ఇండికేటర్స్, ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్ ORVMలు, షార్క్ ఫిన్ యాంటెన్నా, ఆటో AC , USB తో 2-DIN మ్యూజిక్ సిష్టం,బ్లూటూత్ మరియు నిస్సాన్ కనెక్ట్, అడ్జస్టబుల్ రేర్ హెడ్‌రెస్ట్లు మరియు కూలెడ్ గ్లోవ్ బాక్స్.

కిక్స్ XL పైన క్రెటా E అందించే లక్షణాలు: ఏమీ లేవు.

తీర్పు: కిక్స్ అనేది కేవలం 5,000 రూపాయల ప్రీమియంతో క్రెటాపై అందించే అదనపు లక్షణాలకు గానూ లభిస్తుంది.

డీజిల్:

నిస్సాన్ కిక్స్ XV ప్రీమియం vs హ్యుందాయ్ క్రెటా SX

నిస్సాన్ కిక్స్ XV ప్రీమియం

రూ. 13.65 లక్షలు

హ్యుందాయ్ క్రెటా SX

రూ. 13.33 లక్షలు

తేడా

రూ. 32,000 (కిక్స్ ఎక్కువ ఖరీదైనది)

సాధారణ లక్షణాలు:

భద్రత: డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్, EBD తో ABS, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, ఇంపాక్ట్ సెన్సింగ్ డోర్ అన్లాక్, డ్రైవర్ సీట్ బెల్ట్ రిమైండర్ మరియు ప్రీ-టెన్ష్నర్ మరియు లోడ్ లిమిటర్ తో ఫ్రంట్ సీట్ బెల్ట్స్.

Hyundai Creta

బాహ్య భాగాలు:

బాడీ-రంగు బంపర్స్ మరియు డోర్ హ్యాండిల్స్, ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్, షార్క్ ఫిన్ యాంటెన్నా, LED DRLs, అల్లాయ్ వీల్స్, ORVM లపై టర్న్ ఇండికేటర్స్ మరియు ఫాగ్ లాంప్స్.

సౌకర్య లక్షణాలు: ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ మరియు ఫోల్డబుల్ ORVM లు, ఫ్రంట్ సెంటర్ ఆర్మ్స్ట్రెస్, అన్ని నాలుగు పవర్ విండోస్, మాన్యువల్ డే / నైట్ IRVM, రియర్ సెంటర్ ఆర్మ్ రెస్ట్, టిల్ట్ -అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్, రేర్ A.C వెంట్స్ తో ఆటోAC, స్టీరింగ్-మౌంట్ కంట్రోల్స్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, ముందు మరియు వెనుక భాగంలో అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్లు, వెనుక డీఫాగర్, క్రూయిస్ కంట్రోల్, పుష్-బటన్ స్టార్ట్ / స్టాప్ మరియు రివర్స్ పార్కింగ్ కెమెరా.

Nissan Kicks

ఇంఫోటైన్మెంట్: ఆపిల్ కార్పిల్ మరియు ఆండ్రాయిడ్ ఆటోతో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్  

క్రెటా SX పైన కిక్స్ XV ప్రీమియం అందించే లక్షణాలు ఏమిటి: ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ లాంచ్ అసిస్ట్, కూలెడ్ గ్లోవ్ బాక్స్,LED హెడ్ల్యాంప్స్, కో- ప్యాసింజర్ సీటుబెల్ట్ రిమైండర్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ మరియు వెనుక ఫాగ్ లాంప్.

Hyundai Creta

కిక్స్ XV ప్రీమియం పైన క్రెటా SX అందించే లక్షణాలు ఏమిటి: LED పొజిషనింగ్ ల్యాంప్స్,కార్నరింగ్ ల్యాంప్స్ మరియు  వైర్లెస్ మొబైల్ ఛార్జింగ్.

తీర్పు: క్రెటా తో పోలిస్తే కిక్స్ ఎక్కువ లక్షణాలతో అమర్చబడి ఉంటుంది, కానీ ఇది చాలా ఖరీదైనది. ఈ రెండు వేరియంట్స్ లో మేము నిస్సాన్ కిక్స్ ని సిఫార్సు చేస్తున్నాము, ఎందుకంటే ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) మరియు హిల్ హోల్డ్ అసిస్టెన్స్ (HLA) వంటి లక్షణాలు ఉన్నాయి కాబట్టి. ఈ SUV ల రెండు వేరియంట్స్ మధ్య ధర వ్యత్యాశం రూ.20,000. క్రెటా కారు కిక్స్ మీద కొన్ని అధనపు లక్షణాలను కూడా కలిగి ఉంది కానీ అవి SUV యొక్క మొత్తం అనుభవాన్ని లేదా భద్రతా కారకాన్ని మరింత ఎక్కువగా ఏమీ ప్రభావం చూపదు.

నిస్సాన్ కిక్స్ XV ప్రీమియం ఆప్షన్ Vs హ్యుందాయ్ క్రెటా SX (O)

నిస్సాన్ కిక్స్ XV ప్రీమియం ఆప్షన్

రూ. 14.65 లక్షలు

హ్యుందాయ్ క్రెటా SX

రూ. 15.10 లక్షలు

తేడా

రూ. 45,000 (క్రెటా ఖరీదైనది)

సాధారణ ఫీచర్లు (మునుపటి వేరియంట్లలో):

భద్రత: సైడ్ ఎయిర్ బాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ మరియు హిల్ స్టార్ట్ అసిస్ట్.

సౌకర్య లక్షణాలు: కార్నర్నింగ్ ల్యాంప్స్

లోపల భాగాలు: లెదర్ అప్హోస్టరీ

Nissan Kicks

క్రెటాSX(O) మీద కిక్స్ XV ప్రీమియమ్ అందించే లక్షణాలు ఏమిటి: 360-డిగ్రీ కెమెరా, ఆటో హెడ్ల్యాంప్స్, రెయిన్-సెన్సింగ్ వైపర్స్ మరియు వెనుక ఫాగ్ లాంప్స్.

2018 Hyundai Creta

కిక్స్ XV ప్రీమియమ్ ఆప్షన్ మీద క్రెటాSX(O) అందించే లక్షణాలు ఏమిటి:

కర్టెన్ ఎయిర్బాగ్స్, విద్యుత్ సన్రూఫ్, సిక్స్-వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, వైర్లెస్ మొబైల్ ఛార్జింగ్, LED పొజిషింగ్ ల్యాంప్స్, ఆటో డిమ్మింగ్ IRVM మరియు స్మార్ట్ కీ బ్యాండ్.

తీర్పు:

Nissan Kicks

నిస్సాన్ కిక్స్ యొక్క టాప్-స్పెఫ్ వేరియంట్ చాలా ఆకర్షణీయమైన ప్యాకేజీ, ముఖ్యంగా మీ బడ్జెట్ ని మీరు క్రేటా SX (O) వరకూ కొనసాగించలేకపోతే ఇది మీకు సరైనవి. అటువంటి సందర్భంలో మీరు దీనికోసం వెళ్ళొచ్చు, మీరు దీనిలో కూర్చుంటే ఈ లక్షణాలను చూస్తే గనుక తక్కువ రకం కారులో ఉన్న ఫీలింగ్ కలగదు. ఆటో హెడ్ల్యాంప్లు మరియు రెయిన్-సెన్సింగ్ వైపర్స్ మాత్రమే కాకుండా, ఇది విభగంలోనే మొట్టమొదటి  360 డిగ్రీ స్పోర్ట్ కెమెరా తో కూడా లభిస్తుంది, ఇది టైట్ గా ఉండే పార్కింగ్ లో బాగా సహాయపడుతుంది.

2018 Hyundai Creta

ఏమైనప్పటికీ, మీ బడ్జెట్ రూ .50,000 వరకూ మీరు విస్తరించగలిగితే, క్రెటా అది అందించే విలువను పరిగణనలోకి తీసుకుంటే మంచి ఆఫర్ గా నిలుస్తుంది. కర్టెన్ ఎయిర్బాగ్స్ మరియు ఆటో డిమ్మింగ్ IRVM వంటి లక్షణాలను అందించినందుకు మరింత భద్రత కలిగి ఉంది. పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు మరియు సన్రూఫ్ వంటి ఇతర లక్షణాలు  క్యాబిన్ కి మరింత ప్రీమియం అనుభవం జోడిస్తున్నాయి. ఈ లక్షణాల కొరకు అధనపు ధర మ ఉద్దేశంలో సమంజశం.

పెట్రోల్

నిస్సాన్ కిక్స్

హ్యుందాయ్ క్రెటా

XL: రూ. 9.55 లక్షలు

E: రూ. 9.5 లక్షలు

 

E +: రూ. 9.99 లక్షలు

XV: రూ. 10.95 లక్షలు

 
 

SX: రూ.  12.03 లక్షలు

 

SX డ్యుయల్ టోన్: రూ. 12.53 లక్షలు

 

SX(O): రూ.  13.66 లక్షలు

   
 

SX ఆటో: రూ. 13.53 లక్షలు

డీజిల్

నిస్సాన్ కిక్స్

హ్యుందాయ్ క్రెటా

 

1.4L E+: రూ. 9.99 లక్షలు

XL: రూ. 10.85 లక్షలు

 
 

1.4L S: రూ.11.79 లక్షలు

XV: రూ. 12.49 లక్షలు

 

XV ప్రీమియం: రూ. 13.65 లక్షలు

1.6L SX: రూ. 13.33 లక్షలు

 

1.6L SX డ్యుయల్ టోన్: రూ. 13.83 లక్షలు

XV ప్రీమియం ఆప్షన్: రూ. 14.65 లక్షలు

1.6L SX(O): రూ.15.10 లక్షలు

   
 

1.6L S ఆటో: రూ.13.26 lakh

 

1.6L SX ఆటో: రూ.14.93 lakh

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన నిస్సాన్ కిక్స్

Read Full News
 • ట్రెండింగ్
 • ఇటీవల

trendingఎస్యూవి

 • లేటెస్ట్
 • ఉపకమింగ్
 • పాపులర్
×
We need your సిటీ to customize your experience