నెక్స్ట్-జెన్ స్కోడా రాపిడ్ ఒక ఆక్టేవియా లాంటి నాచ్‌బ్యాక్ అవుతుంది. 2021 లో ప్రారంభించబడుతుంది
డిసెంబర్ 06, 2019 02:08 pm dhruv attri ద్వారా ప్రచురించబడింది
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఇది పూర్తిగా స్థానికీకరించిన MQB-A0-IN ప్లాట్‌ఫాంపై ఆధారపడి ఉంటుంది
- నెక్స్ట్-జెన్ స్కోడా రాపిడ్ ప్రస్తుత మోడల్‌కు భిన్నంగా కనిపిస్తుంది.
- పోటీ ధరల కోసం ఇది కనీసం 95 శాతం లొకలైజేషన్ ని కలిగి ఉంటుంది.
- ఇది కనీసం లాంచ్ సమయంలోనైనా పెట్రోల్ తో మాత్రమే అందించబడేలా ఉంటుంది.
- స్కోడా 2021 చివరలో కొత్త రాపిడ్ ను ప్రారంభిస్తుందని ఆశిస్తున్నాము
- ప్రస్తుత మోడల్ రూ .8.82 లక్షల నుండి 14 లక్షల రూపాయల వరకు ధరలు కలిగి ఉన్నాయి, ప్రస్తుత మోడల్ ధరలు కూడా అదే విధంగా ఉంటాయని ఆశిస్తున్నాము.
సమగ్ర ఫేస్‌లిఫ్ట్ మరియు ఈ మధ్య కొన్ని ప్రత్యేక ఎడిషన్ మోడళ్ల పరిచయం కాకుండా, స్కోడా రాపిడ్ 2011 నుండి చాలా వరకు మారలేదు. అయినప్పటికీ, స్కోడా తన భారతదేశంలో సరికొత్త వెర్షన్ ను 2.0 స్ట్రాటజీ త్వరలో విడుదల చేయబోతున్న తరుణంలో ఇది త్వరలోనే మారుతుంది. ప్రస్తుత రాపిడ్ కన్వెన్షనల్ మూడు-బాక్స్ సెడాన్ స్టైలింగ్‌ను కలిగి ఉండగా, దాని కొత్త అవతార్ ఆక్టేవియా వంటి లిఫ్ట్‌బ్యాక్ బూట్ లిడ్ ని కలిగి ఉంటుంది.
రెండవ తరం స్కోడా రాపిడ్ కొత్త MQB-A0-IN ప్లాట్‌ఫాంపై ఆధారపడి ఉంటుంది, ఇది భారతదేశానికి భారీగా స్థానికీకరించబడింది. MQB-A0-IN మోడళ్ల కోసం స్కోడా ఇండియా 95 శాతం స్థానికీకరణ స్థాయిలను సాధించాలని యోచిస్తోంది. దీని అర్థం స్కోడా నాణ్యత స్థాయిలలో ఏమాత్రం తగ్గుతుందని కాదు.
చెక్ బ్రాండ్ ఒక నిర్దిష్ట ప్రమాణాన్ని నిర్వహించడానికి ఒక ప్లాట్‌ఫార్మ్ ని ప్రారంభించింది. MQB-A0-IN ప్లాట్‌ఫామ్ ఆధారంగా స్కోడా నుండి వచ్చిన మొదటి ఉత్పత్తి రాబోయే కియా సెల్టోస్ ప్రత్యర్థి కాంపాక్ట్ SUV, దీనిని ఆటో ఎక్స్‌పో 2020 లో మనం చూడగలం.
స్కోడా తన రష్యన్ వెబ్‌సైట్ లో నెక్స్ట్-జెన్ రాపిడ్‌ను టీజ్ చేసింది, ఇది స్కేలాకు కి పోలి ఉన్నట్లు తెలుస్తుంది. ఇండియా-స్పెక్ రాపిడ్ టీజర్‌లో కారుతో పోలికను కలిగి ఉంటుంది. రాబోయే స్కోడా రాపిడ్‌లోని లక్షణాలు మరియు కంఫర్ట్ లెవల్స్ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న స్కాలా ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ను అనుకరిస్తాయి. వర్చువల్ కాక్‌పిట్ డిస్ప్లే, ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు బహుశా ఇంటర్నెట్ ఆధారిత కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీ వంటి భారీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి లక్షణాలను ఆశించవచ్చు.
స్కోడా ఇండియా BS 6 ఎరాలో తన 1.5-లీటర్ TDI ఇంజన్లను తీసేస్తున్నట్లు ప్రకటించింది. కాబట్టి రాబోయే సెడాన్ కనీసం లాంచ్ సమయంలోనైనా పెట్రోల్ తో మాత్రమే అందిస్తుందని భావిస్తున్నాము. ఇది BS 6-కంప్లైంట్ 1.0-లీటర్ TSI ని పొందుతుంది, ఇది రెండు ట్యూన్ లలో లభిస్తుంది: ఒకటి 95 Ps / 175Nm మరియు రెండోది 115 Ps / 200 Nm. ఆఫర్లో ట్రాన్స్మిషన్ ఎంపికలలో 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఒక DSG యూనిట్ ఉండాలి.
2021 చివరినాటికి లేదా 2022 ప్రారంభంలో షోరూమ్‌లలో కొత్త రాపిడ్‌ను చూడవచ్చని మీరు ఆశించవచ్చు. ప్రస్తుత కారు ధరలు (రూ. 8.82 లక్షల నుండి రూ .14 లక్షలు, ఎక్స్-షోరూమ్) ఉన్నాయి , కొత్త కారు కూడా అదే ధరలు కలిగి ఉంటుందని భావిస్తున్నాము. నెక్స్ట్-జెన్ రాపిడ్ రాబోయే హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా ఫేస్ లిఫ్ట్, టయోటా యారిస్ మరియు మారుతి సియాజ్ లతో పోటీ పడనుంది. ప్రస్తుత రాపిడ్ మరియు వెంటో మాదిరిగానే, వోక్స్వ్యాగన్ కొత్త MQB-A0-IN ప్లాట్‌ఫాం ఆధారంగా నెక్స్ట్-జెన్ స్కోడా సెడాన్ యొక్క సొంత వెర్షన్‌ను తీసుకురావాలని ఆశిస్తోంది.
మరింత చదవండి: స్కోడా రాపిడ్ డీజిల్