• English
  • Login / Register

తదుపరి తరం ఫ్లూయన్స్ ను అందిస్తున్న రెనాల్ట్

రెనాల్ట్ ఫ్లూయెన్స్ కోసం అభిజీత్ ద్వారా నవంబర్ 30, 2015 05:37 pm ప్రచురించబడింది

  • 15 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

రెనాల్ట్ ఫ్లూయెన్స్, భారతదేశం లో దాని స్థానాన్ని కోల్పోయి ఉండవచ్చు, కానీ తదుపరి తరం ఫ్లూయెన్స్, కొనుగోలుదారుల మనసును దోచుకోబోయే విధంగా అద్భుతమైన ప్రదర్శనతో రాబోతుంది.

జైపూర్:

తదుపరి తరం ఫ్లూయన్స్, డిజిటల్ గా అందించబడింది మరియు కొనుగోలుదారుల మనసును ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ వాహనం, కొన్ని రోజుల క్రితం ఫ్రెంచ్ గడ్డపై రహస్యంగా కనిపించింది కానీ, బారీ ముసుగుతో బహిర్గతం అయ్యింది. ఈ వాహనాన్ని, 2016 వ సంవత్సరంలో ఆవిష్కరించనున్నారు. భారతదేశం గురించి అయితే ప్రస్తుతం ఏ రకమైన విషయం వెలువడలేదు. కానీ, ప్రస్తుత కారు నామమాత్రపు అమ్మకాలను చోటుచేసుకుంది. కానీ, ఇప్పుడు రాబోయే రెనాల్ట్ యొక్క తదుపరి తరం ఫ్లూయెన్స్ ఊహించినదాని కంటే ఆకర్షణీయంగా మరియు కొనుగోలుదారుల మనసును దోచుకునే విధంగా రాబోతుంది.   

ఈ వాహనం యొక్క భాగాల గురించి ఊహాజనకంగా మాట్లాడటానికి వస్తే, ఈ కొత్త మోడల్ యొక్క భాగాలు మరింత ఆకర్షణీయతను అందిస్తాయి. ఈ కొత్త వాహనం యొక్క చిత్రాలు, ఒక కొత్త ముందు భాగాన్ని అలాగే మార్పు చేయబడిన సైడ్ మరియు వెనుక భాగాలు అందించబడ్డాయి. ముందు భాగం విషయానికి వస్తే, ఒక కొత్త హెడ్ ల్యాంప్ క్లస్టర్, సిగ్నేచర్ రేడియేటర్ గ్రిల్ మరియు మస్కులార్ బోనెట్ వంటివి అందించబడ్డాయి. అయితే తయారీదారుడు ఈ కొత్త వాహనానికి వీటన్నింటితో పాటు, బూమేరాంగ్ ఆకారపు ఎల్ ఈ డి డి ఆర్ ఎల్ ఎస్ అందించాడు.

హాచ్బాక్ వెర్షన్ అయిన ఈ ఫ్లూయన్స్ వాహనం, డిజిటల్ దృశ్యం నుండి భిన్నంగా ఉంటుంది. ఈ వాహనం యొక్క బాహ్య భాగం విషయానికి వస్తే, బూమేరాంగ్ ఆకారపు ఎల్ ఈ డిలు, ఏకైక బంపర్ సెటప్, అదే సైడ్ మరియు వెనుక భాగం విషయానికి వస్తే పాత దాని వలే సుమారు ఒకేలా ఉంటాయి

ఈ కారు, 2016 చివరి నాటికి విడుదల అయ్యే అవకాశం ఉంది మరియు అదే పాత ఇంజన్ లతో అందుబాటులో ఉండబోతుంది. ముందుగా పెట్రోల్ ఇంజన్ విషయానికి వస్తే, ఈ ఇంజన్ మూడు రకాల పవర్ ఉత్పత్తులను విడుదల చేస్తుంది అవి వరుసగా, 100 బి హెచ్ పి, 130 బి హెచ్ పి మరియు 205 బి హెచ్ పి పవర్ లను విడుదల చేస్తుంది. మరోవైపు డీజిల్ ఇంజన్ విషయానికి వస్తే, ఈ వాహనం 1.6 లీటర్ డిసి ఐ ఇంజన్ తో జత చేయబడి ఉంటుంది. ఈ ఇంజన్ అత్యధికంగా, 130 బి హెచ్ పి పవర్ విడుదల చేస్తుంది. ఈ ఫ్లూయెన్స్ వాహనం, డస్టర్ లో ఉండే 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ తో జత చేయబడి 108 బి హెచ్ పి గల అధిక పవర్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

ఇంకా చదవండి

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Renault ఫ్లూయెన్స్

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది సెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience