తదుపరి తరం మెర్సిడెస్ బెంజ్ ఈ- క్లాస్ ఇంటీరియర్స్ బహిర్గతం
మెర్సిడెస్ బెంజ్ 2017-2021 కోసం raunak ద్వారా డిసెంబర్ 09, 2015 04:21 pm ప్రచురించబడింది
- 13 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఈ కొత్త డబ్ల్యూ 213 ఈ క్లాస్ వాహనం యొక్క క్యాబిన్ ను చూసినట్లైతే, ప్రధానంగా ఎస్ క్లాస్ వాహన ప్రేరణ కనబడుతుంది. అంతేకాకుండా, క్యాబిన్ లో పరిసర లైటింగ్ ను అందించడం జరిగింది. వీటితో పాటు, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు సమాచార వ్యవస్థ కోసం రెండు బారీ 12.3 అంగుళాల ప్రదర్శన స్క్రీన్ లు అందించబడ్డాయి.
జైపూర్: మెర్సిడెస్, అధికారిక ప్రీమియర్ ద్వారా తదుపరి తరం ఈ- క్లాస్ వాహన వివరాలను బహిర్గతం చేసింది. ఈ మెర్సిడెస్ సంస్థ, 2016 నైయాస్ ఆక డెట్రాయిట్ మోటార్ షోలో వచ్చే నెల డబ్ల్యూ 213 ఈ- క్లాస్ వాహనాన్ని ప్రదర్శించనున్నారు. జర్మన్ వాహన తయారీ సంస్థ నుండి రాబోయే సెడాన్ యొక్క క్యాబిన్, ప్రస్తుత ఎస్- క్లాస్ ను గుర్తుచేస్తుంది.
ఆడి సంస్థ చివరిగా ప్రవేశపెట్టిన ఏ4 మరియు టిటి వాహనాలలో, 12.3 అంగుళాల ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ను గమనించవచ్చు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇదే 12.3 అంగుళాల రెండు డిస్ప్లే లను రాబోయే ఈ క్లాస్ సెడాన్ లో చూడవచ్చు. ఎస్ క్లాస్ వాహనంలో వలే, ఈ రెండు డిస్ప్లే లు ప్రక్కప్రక్కన అమర్చబడి ఉంటాయి. ఈ కొత్త ఈ క్లాస్ వాహనం లో ఉండే రెండు 12.3 అంగుళాల డిస్ప్లేలు, ఒకటి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కొరకు మరియు రెండవది సమాచార వ్యవస్థ కొరకు అందించబడతాయి. ఎస్ క్లాస్ వాహనం వలే కాకుండా, ఈ క్లాస్ వాహనం లో ఉండే స్క్రీన్లు ఒకే సింగిల్ యూనిట్ గ్లాస్ కర్టసీ లా కనిపిస్తాయి. మెర్సిడెస్ యొక్క కామన్ ఆన్లైన్ సమాచార వ్యవస్థ ఆప్షనల్ గా అందించబడుతుంది. అంతేకాకుండా, సెంటర్ టన్నెల్ లో ఒక టచ్ ప్యాడ్ కూడా అందించబడుతుంది. వినోద వ్యవస్థ విషయానికి వస్తే, వినోదం బయటకు వినిపించడం కోసం ఈ వాహనంలో, 23 స్పీకర్లను, 1450 వాట్ల ట్విన్ యాంప్లిఫైర్ ను కలిగిన రెండవ తరం బర్మస్టర్ హై ఎండ్ 3డి సరౌండ్ సౌండ్ సిస్టం అందించబడుతుంది.
"ఈ కొత్త ఈ- క్లాస్ వాహనం యొక్క అంతర్గత భాగంలో, మేము సమకాలీన లగ్జరీ భావనను అందిస్తున్నాము అని, అంతర్గత డిజైన్ హెడ్ అయిన హార్ట్ ముట్ సింక్విట్జ్," చెప్పారు. అంతేకాకుండా "మేము ఈ వాహనం యొక్క అంతర్గత క్యాబిన్ ను, ఒక విశాలంగా మరియు ఇంటిలిజెంట్ గా రూపొందించారు అని అన్నారు. సెన్సువల్ ప్యూరిటీ యొక్క మెర్సిడెస్ బెంజ్ రూపకల్పన తత్వశాస్త్రం తో, డ్రైవర్ కు మరియు ముందు ప్రయాణికుడి కోసం ఒక అసాధారణమైన భావావేశ అనుభవాన్ని సృష్టించడానికి సాంకేతిక ఆవిష్కరణ మరియు అధిక గ్రేడ్ పరికరాలతో ఈ వాహనాన్ని రూపొందించడం జరిగింది. ఈ ఈ- క్లాస్ వాహనం, వ్యాపార తరగతి లో ఒక కొత్త ప్రామాణికమైనది మాత్రమే కాదు, అన్ని విధాలుగా అనుకూలమైనది అని చెప్పారు. ఒక కార్యాలయం మరియు ప్రైవేట్ వాతావరణం వంటి వాటితో కలిసి ప్రయాణీకులకు సమకాలీన లగ్జరీ ను అందించడానికి ఒక జీవన ప్రాంతం అవుతుంది అని అన్నారు. అంతేకాకుండా ఇది, మూడవ స్థానం అవుతుంది అని వ్యాఖ్యానించారు.
దాదాపు కొత్త ఈ- క్లాస్ వాహనంలో ఉండే ప్రతి స్విచ్చు, సున్నితమైన టచ్ ను కలిగి ఉంటుంది అని చెప్పవచ్చు. అంతేకాకుండా, బహుళ-ఫంక్షనల్ స్టీరింగ్ వీల్ పై, ఒక టచ్ సెన్సిటివ్ బటన్ అందించబడుతుంది. టచ్ సెన్సిటివ్ బటన్లు సమాంతర మరియు నిలువు వేలు తో ప్రెస్ చేసినట్లైతే, ఖచ్చితంగా స్పందిస్తాయి మరియు మెర్సిడెస్ కారులో, ఈ టచ్ బటన్లను పొందుపరచడం అనేది మొట్టమొదటిసారి అని చెప్పారు. సమాచార వ్యవస్థ ను, ఈ టచ్ సెన్సిటివ్ స్విచ్చుల ద్వారా లేదా సెంటర్ టన్నెల్ టచ్ ప్యాడ్ ద్వారా నియంత్రించవచ్చు. ఆప్షనల్ పరిసర లైటింగ్స్ గురించి మాట్లాడటానికి వస్తే, మెర్సిడెస్ బెంజ్, 64 రంగులు వ్యక్తిగతీకరణ అవకాశాలను కొనుగోలుదారులకు అందిస్తుంది. క్యాబిన్ లో ఈ టచ్ లైట్లు ఎక్కడెక్కడ గమనించవచ్చు అంటే, సెంట్రల్ డిస్ప్లే, సెంటర్ కన్సోల్ లో ముందు నిల్వ సౌకర్యం, డోర్ ప్యాకెట్లు, హ్యాండిల్, ముందు మరియు వెనుక ఫూట్ వెల్స్ పై, ఓవర్ హెడ్ కన్సోల్, మిర్రర్ ట్రైయాంగిల్ మరియు ట్వీటర్ల చుట్టూ వీటిని గమనించవచ్చు.
ఇవి కూడా చదవండి:
రూ. 24.95 లక్షలు ధర వద్ద ప్రారంభించబడిన మెర్సిడెస్ బెంజ్ A-క్లాస్ ఫేస్లిఫ్