Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

నెక్స్ట్-జెన్ కియా సోరెంటో ఆవిష్కరించబడింది; CR-V, టిగువాన్ ఆల్స్పేస్ & కోడియాక్ వంటి కార్లతో పోటీ పడుతుంది

ఫిబ్రవరి 19, 2020 02:37 pm dinesh ద్వారా ప్రచురించబడింది

మార్చి 3 న 2020 జెనీవా మోటార్ షోలో గ్లోబల్ అరంగేట్రం

  • కియా సోరెంటో భారతదేశానికి ఇంకా ధృవీకరించబడలేదు, కానీ 2021 నాటికి ప్రారంభించవచ్చు.
  • కియా ప్రతి ఆరునెలలకు ఒకసారి భారతదేశంలో కొత్త కారును అందించే ప్రయత్నం చేస్తామని ఇప్పటికే హామీ ఇచ్చింది.
  • హ్యుందాయ్‌కు శాంటా ఫే ఎలానో కియాకు సోరెంటో అలా అన్నమాట.
  • ప్రారంభించినట్లయితే ఇది హోండా CR-V, టిగువాన్ ఆల్ స్పేస్, స్కోడా కోడియాక్, మహీంద్రా అల్టురాస్ G4, ఫోర్డ్ ఎండీవర్ మరియు టయోటా ఫార్చ్యూనర్ వంటి వాటితో పోటీ పడుతుంది.

మార్చి మొదటి వారంలో 2020 జెనీవా మోటార్ షోలో కియా తన అధికారిక ప్రారంభం కంటే ముందే నెక్స్ట్-జెన్ సోరెంటో SUV ని వెల్లడించింది. సరికొత్త డిజైన్‌ తో కూడిన SUV ఈ ఏడాది చివర్లో యూరప్‌ లో అమ్మకాలకు చేరుకుంటుంది.

మునుపటి తరం మోడల్‌ తో పోల్చితే, కొత్త సోరెంటో ఒక వైఖరిని పొందుతుంది. ఇది టైగర్ నోస్ గ్రిల్ అనే సిగ్నేచర్‌ను కలిగి ఉంది, ఇది కొత్త స్లీకర్ LED హెడ్‌ల్యాంప్‌లతో మూసివేయబడింది. బంపర్ బ్లాక్-అవుట్ సెంట్రల్ ఎయిర్‌డామ్ మరియు ఫాక్స్ స్కిడ్ ప్లేట్‌తో డ్యూయల్-టోన్ ట్రీట్‌మెంట్ పొందుతుంది.

సైడ్ ప్రొఫైల్‌లో పెద్ద గాజు ప్రాంతానికి దిగువన కూర్చున్న వీల్ ఆర్చులు మరియు పదునైన షోల్డర్ లైన్ ఉన్నాయి. వెనుకవైపు, కొత్త సోరెంటో పెద్ద టెల్లూరైడ్ SUV కి చాలా పోలి ఉంటుంది, అయితే ఇది పెద్ద SUV లో సింగిల్-పీస్ యూనిట్‌కు బదులుగా రెండు - పీస్ టెయిల్ లాంప్‌ను కలిగి ఉంది.

సోరెంటో క్యాబిన్ డ్యూయల్-టోన్ బ్లాక్-టాన్ అప్హోల్స్టరీతో చాలా ప్రీమియంగా కనిపిస్తుంది, అయితే ఆకర్షణకు కేంద్రం మాత్రం మెర్సిడెస్ లాంటి కనెక్ట్ చేసిన స్క్రీన్ సెటప్ అని చెప్పాలి. ఇది డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం 12.3- ఇంచ్ యూనిట్ మరియు ఇన్ఫోటైన్‌మెంట్ కోసం 10.25- ఇంచ్ యూనిట్ కలిగి ఉంటుంది. ఇతర హైలైట్స్ బ్రష్ అల్యూమినియంలో ఫినిషింగ్ చేయబడిన రెండు-పీస్ AC వెంట్స్.

అధికారిక అరంగేట్రం ఇంకా కొన్ని వారాల దూరంలో ఉన్నందున, కియా ఇంకా కొత్త సోరెంటో యొక్క లక్షణాలు మరియు ఇంజిన్ వివరాలను వెల్లడించలేదు. అయితే, ఇది ప్రపంచవ్యాప్తంగా పవర్‌ట్రెయిన్ ను హ్యుందాయ్ శాంటా ఫేతో పంచుకుంటుంది. ఇంజిన్ ఎంపికలను పరిశీలిద్దాం.

ఇంజిన్

2.0-లీటర్ టర్బో పెట్రోల్

2.4- లీటర్ పెట్రోల్

2.0- లీటర్ డీజిల్

2.2- లీటర్ డీజిల్

పవర్

235PS

185PS

150P/185PS

200PS

టార్క్

352Nm

241Nm

400Nm

440Nm

ట్రాన్స్మిషన్

8- స్పీడ్ AT

8- స్పీడ్ AT

6- స్పీడ్ MT/8- స్పీడ్ AT

6- స్పీడ్ MT/8- స్పీడ్ AT

భారతదేశంలో ప్రారంభించినట్లయితే, సోరెంటో ఆదర్శంగా పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఎంపికలతో అందుబాటులో ఉండాలి.

భారతీయ మార్కెట్లో సోరెంటో SUV ని ప్రవేశపెట్టడం గురించి కియా ఇంకా ఏమీ చెప్పలేదు, అయితే ప్రతి ఆరునెలలకోసారి కొత్త కారును అందిస్తామని వాగ్దానం చేసినందున, సమీప భవిష్యత్తులో, బహుశా వచ్చే ఏడాది ఇక్కడకు రావచ్చని మేము ఆశిస్తున్నాము. దాని తదుపరి సమర్పణ, సోనెట్ సబ్ -4m SUV, 2020 రెండవ భాగంలో లాంచ్ కానుంది. ఒకసారి లాంచ్ అయిన తర్వాత, సోరెంటో స్కోడా కోడియాక్, వోక్స్వ్యాగన్ టిగువాన్ ఆల్స్పేస్ మరియు హోండా CR-V వంటి వాటితో పాటు బాడీ-ఆన్-ఫ్రేం SUV లైన ఫోర్డ్ ఎండీవర్ మరియు టయోటా ఫార్చ్యూనర్ వంటి వాటికి పోటీగా ఉంటుంది.

ఇది కూడా చదవండి: కియా సోనెట్ ఆటో ఎక్స్‌పో 2020 లో వెల్లడించబడింది; మారుతి విటారా బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ తో పోటీ పడుతుంది

మరింత చదవండి: CR-V ఆటోమేటిక్

Share via

Write your వ్యాఖ్య

M
mahesh kannan
Feb 17, 2020, 6:59:40 PM

When we can see India?

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
కొత్త వేరియంట్
Rs.30.40 - 37.90 లక్షలు*
కొత్త వేరియంట్
Rs.2.84 - 3.12 సి ఆర్*
కొత్త వేరియంట్
ఫేస్లిఫ్ట్
Rs.1.03 సి ఆర్*
కొత్త వేరియంట్
Rs.11.11 - 20.50 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర