Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

న్యూ-జెన్ ఫోర్డ్ ఎండీవర్ టెస్టింగ్ చేయబడుతూ మా కంటపడింది, 2022 నాటికి ఇండియా లాంచ్ అవుతుంది

ఫోర్డ్ ఎండీవర్ 2020-2022 కోసం sonny ద్వారా మార్చి 14, 2020 12:23 pm ప్రచురించబడింది

లోపల మరియు వెలుపల, కొత్త ఎండీవర్ పూర్తిగా రీ-డిజైన్ చేయబడింది

  • న్యూ-జెన్ ఎండీవర్ చైనాలో కవరింగ్ చేయబడి మా మా కంటపడింది.
  • డిజైన్ వివరాలు ఇంకా ఖరారు కాలేదు, టెస్ట్ మ్యూల్‌ లో అసంపూర్తిగా ఉన్న గ్రిల్ ఉంది.
  • దాని ప్రొఫైల్‌ను అదే విధంగా ఉంచినట్టు కనిపిస్తోంది.
  • 2021 లో అరంగేట్రం చేస్తుందని భావిస్తున్నాము.

ఇతర ఆసియా మార్కెట్లలో ఫోర్డ్ ఎవరెస్ట్ గా ప్రవేశించిన ఒక సంవత్సరం తరువాత, ప్రస్తుత-తరం ఫోర్డ్ ఎండీవర్ 2016 లో భారతదేశంలో ప్రవేశపెట్టబడింది. ఇప్పుడు, ఫోర్డ్ SUV యొక్క నెక్స్ట్-జెన్ మోడల్ చైనాలో టెస్టింగ్ చేయబడుతూ మా కంటపడింది.

నెక్స్ట్-జెన్ ఎండీవర్ కవరింగ్ తో కప్పబడి మరియు ప్రోటోటైప్ గ్రిల్ డిజైన్‌ తో మా కంటపడింది. సైడ్ ప్రొఫైల్ నుండి నిష్పత్తి చూస్తే గనుక ప్రస్తుత మోడల్ మాదిరిగానే ఉన్నట్లు అనిపించినప్పటికీ, ఇది సరికొత్త మోడల్. కవరింగ్ చేసి ఉన్నప్పటికీ రీ-డిజైన్ చేయబడిన ఫ్రంట్ ఎండ్ మరియు రేర్ ఎండ్ లు గుర్తించగలిగే విధంగానే ఉన్నాయి. హెడ్‌ల్యాంప్‌ లు బంపర్ దగ్గరకి జరపబడ్డాయి మరియు దానితో పాటుగా స్టైలింగ్ ఉన్న DRL లు బోనెట్ లైన్ కి అనుగుణంగా వచ్చాయి మరియు ఫ్రంట్ ఎయిర్ డ్యామ్‌ మరింత స్పోర్టియర్ గా కనిపిస్తుంది.

మా కంటపడిన టెస్ట్ మ్యూల్ కూడా సవరించిన డాష్‌బోర్డ్ లేఅవుట్‌ తో అప్‌డేట్ చేయబడిన ఇంటీరియర్‌ను కలిగి ఉంది. ఇది డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ తో ఉన్న సెంట్రల్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ క్రింద సెంట్రల్ ఎయిర్ వెంట్స్‌ను ఉంచింది. కొత్త ఎండీవర్‌ లో కొత్త స్టీరింగ్ వీల్ కూడా ఉంది. దీని సెంట్రల్ కన్సోల్ ఇప్పటికీ అభివృద్ధి దశలో ఉంది, కానీ సాంప్రదాయ డ్రైవ్-సెలెక్ట్ లివర్‌ను కలిగి ఉన్నట్లు అనిపించదు.

మోడల్ యొక్క మిడ్-లైఫ్ రిఫ్రెష్‌ తో ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ప్రవేశపెట్టబడిన 10-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ తో అదే 2.0-లీటర్ ఎకోబ్లూ డీజిల్ ఇంజన్ ద్వారా ఇది పవర్ ని అందుకుంటుంది. కొత్త ఎండీవర్‌ పై టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను కూడా పొందే అవకాశం ఉంది, ఇది భారతదేశంలో ఫోర్డ్ SUV కి మొదటిసారి అని చెప్పవచ్చు. నెక్స్ట్-జెన్ ఫోర్డ్ ఎండీవర్ 2021 లో ప్రపంచవ్యాప్త ప్రవేశాన్ని అంచనా వేయవచ్చు మరియు 2022 నాటికి భారతదేశంలో ప్రారంభించబడవచ్చు.

చిత్ర మూలం

మరింత చదవండి: ఎండీవర్ ఆటోమెటిక్

s
ద్వారా ప్రచురించబడినది

sonny

  • 51 సమీక్షలు
  • 0 Comments

Write your Comment పైన ఫోర్డ్ ఎండీవర్ 2020-2022

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర