ఈ పండుగ సీజన్‌లో MG ZS EVని తక్కువ ధరలో కొనుగోలు చేయవచ్చు

ఎంజి జెడ్ఎస్ ఈవి కోసం rohit ద్వారా అక్టోబర్ 09, 2023 05:38 pm ప్రచురించబడింది

  • 374 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ధర తగ్గింపుతో, ZS EV ప్రస్తుతం రూ.2.30 లక్షల తగ్గింపుతో మరింత చవకగా వస్తుంది

MG ZS EV

  • MG ZS EV ధర ప్రస్తుతం రూ.22.88 లక్షలు మరియు రూ.25.90 లక్షల మధ్య ఉంది.

  • హెక్టార్‌ను MG రూ.14.73 లక్షల నుండి రూ.21.73 లక్షల ధరతో అందిస్తోంది. 

  • హెక్టార్ ప్లస్ ధర రూ.17.50 లక్షలు నుండి రూ.22.43 లక్షల మధ్యలో ఉంది. 

ఇటీవల MG హెక్టార్ మరియు MG హెక్టార్ ప్లస్ తగ్గింపు ధరల సమాచారాన్ని అందించాము. పండుగ సీజన్ కోసం ఈ కారు తయారీదారు ఈ రెండు SUVల ధరలను తగ్గించారు, అలాగే ప్రస్తుతం MG ZS EV ధరను కూడా తగ్గించారు. ఎలక్ట్రిక్ SUVల వేరియెంట్ వారీ సవరించిన ధరలను ఇప్పుడు చూద్దాం: 

ZS EV

వేరియెంట్ 

పాత ధర 

కొత్త ధర

ఎగ్జైట్

రూ. 23.38 లక్షలు

రూ. 22.88 లక్షలు

ఎక్స్ؚక్లూజివ్

రూ. 27.30 లక్షలు

రూ. 25 లక్షలు

ఎక్స్ؚక్లూజివ్ ప్రో 

రూ. 27.90 లక్షలు

రూ. 25.90 లక్షలు

ధర తగ్గింపుతో, MG ZS EV ప్రారంభ ధర రూ.50,000 వరకు తగ్గింది. దీని మిడ్-స్పెక్ మరియు శ్రేణిలో ఉత్తమమైన వేరియెంట్‌లు రూ.2 లక్షలు మరియు అంతకంటే ఎక్కువగా ధరల తగ్గింపును అందుకున్నాయి. ఎలక్ట్రిక్ SUV 50.3kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది, ఇది 177PS పవర్ మరియు 280Nm టార్క్‌ను అందించే ఎలక్ట్రిక్ మోటార్‌తో జోడించబడింది. 

హెక్టార్ మరియు హెక్టార్ ప్లస్ 

MG Hector

మా మునుపటి రిపోర్ట్ؚ ప్రకారం, MG హెక్టార్ ధరలు రూ.1.29 లక్షల వరకు తగ్గాయి, అలాగే MG హెక్టార్ ప్లస్ కూడా రూ.1.37 లక్షలు చవకగా వస్తుంది. వాటి సవరించిన ధర శ్రేణులు వరుసగా రూ.14.73 లక్షల నుండి రూ.21.73 లక్షల వరకు మరియు రూ.17.50 లక్షల నుండి రూ.22.43 లక్షల వరకు ఉన్నాయి. మిడ్-సైజ్ SUVల టాప్ వేరియెంట్‌ల ధరలు గణనీయంగా తగ్గించారు. హెక్టార్ 5-సీట్ల SUV కాగా, హెక్టార్ ప్లస్ 6 మరియు 7 సీట్ల లేఅవుట్ ఎంపికలతో వస్తుంది. 

ఈ SUVలు ఒకే విధమైన రెండు ఇంజన్ ఎంపికలతో వస్తాయి: 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ లేదా CVTతో జోడించిన 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ (143PS/250Nm) ఇంజన్ మరియు 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ؚతో మాత్రమే జోడించిన 2-లీటర్ డీజిల్ ఇంజన్ (170PS/350Nm).  

దీన్ని కూడా చూడండి: సెప్టెంబర్ 2023లో అధికంగా అమ్ముడైన 15 కార్‌ల వివరాలు

MG పోటీదారులు 

హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ మరియు BYD అట్టో 3లకు పోటీదారుగా MG ZS EV నిలుస్తుంది. టాటా నెక్సాన్ EVకి ఖరీదైన ప్రత్యామ్నాయంగా ఉంటుంది. మరొక వైపు, MG హెక్టార్ మరియు MG హెక్టార్ ప్లస్ؚలు టాటా హ్యారియర్, టాటా సఫారీ, మహీంద్రా XUV700 మరియు హ్యుందాయ్ ఆల్కజార్ؚలతో పోటీ పడతాయి. 

ఈ కథనంలో పేర్కొన్నవి అన్నీ ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధరలు 

ఇక్కడ మరింత చదవండి: ZS EV ఆటోమ్యాటిక్ 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన ఎంజి ZS EV

Read Full News

explore మరిన్ని on ఎంజి జెడ్ఎస్ ఈవి

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది ఎలక్ట్రిక్ కార్లు

  • పాపులర్
  • రాబోయేవి
×
We need your సిటీ to customize your experience